సబ్ ఫీచర్

పుడమిని కాపాడుకుందాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంత జీవకోటి మనుగడ సాగించడానికి అద్భుతమైన ఈ భూమిపై ఎన్నో అనుకూల పరిస్థితులున్నాయి. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, ఆకాశం, నేల ఏయే పాళ్లలో వుంటే జీవరాశి మనుగడ సాగించగలదో, ఆ విధంగానే వున్నవి. ఈ ప్రకృతి సూత్రాల్లో ఏ కొద్దిపాటి తేడావున్నా భూమిపై జీవరాశి ఉండేది కాదు. సకల జీవరాశిలో మానవుడు మాత్రమే మేధస్సును కలిగిఉన్నాడు. ఇలాంటి వాతావరణం కలిగిన భూమిలాంటి గ్రహం ఈ విశ్వంలో వేరే ఏదైనా ఉందా? అని శాస్తవ్రేత్తలు చాలాకాలంగా పరిశోధనలను చేస్తున్నారు. అయితే, భూమిలాంటి గ్రహం ఇప్పటివరకు వారికి కనిపించలేదు. అందువల్ల భూమిని చాలా జాగ్రత్తగా పరిరక్షించుకోవాల్సిన అవసరం, బాధ్యత మనిషికున్నాయి. ఆ దిశగా మనిషి తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడా? అంటే లేదు. ఎంతో నివాసయోగ్యమైన భూమిని చాలా నిర్లక్షంగా చూస్తున్నాడు. ఆధునిక యుగం ప్రారంభం నుండి మానవ విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగాయి. భూమిలోపల ఉన్న బొగ్గు, చమురు, రాగి వంటి అనేక ఖనిజాలను తవ్వేస్తున్నాడు. మానవ అభివృద్ధికి ఇవన్నీ అవసరమే. ప్రకృతి వనరులను ఇష్టానుసారం వాడేస్తున్నందున భూమికి, వాతావరణానికి నష్టం కలుగుతోంది. మనిషికి ఆశ పెరిగింది. దానికి సాంకేతికత తోడైంది. భూమి పొరల్లోని ఖనిజాలను, ఇంధనాలను వెలికితీసి యథేచ్ఛగా వాడుతున్నందున రసాయన కాలుష్యం నానాటికీ విషమిస్తోంది.
కొన్ని విషవాయువులు వాతావరణంలో కలుస్తున్నాయి. కొండలను మైనింగ్ పేరిట తవ్వేస్తూ రహదారులు, భవన నిర్మాణాలకు విపరీతంగా వాడుతున్నారు. దీంతో భూమి స్వరూపమే మారిపోతున్నది. సహజ విరుద్ధమైన విష వాయువులు, రసాయనిక అవశేషాలు ప్రకృతి సిద్ధమైన గాలిలో కలిసినందువలన ప్రాణవాయువు కలుషితమవుతోంది.
ఖనిజాలను తవ్వేస్తున్నందున భూమిలో డొల్లతనం ఏర్పడుతున్నది. కోనసీమలో భూమిలోపలి నుంచి చమురును విపరీతంగా తోడేస్తున్నందున లోపల ఏర్పడిన డొల్లలోకి సముద్ర నీరు కొంత ప్రవేశిస్తున్నదని శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. అలాంటి ఉప్పునీరు ఆ ప్రాంత వ్యవసాయ భూముల్లోకి ఉబుకుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు. భూమిలోపల గుల్ల చేయడడం భవిష్యత్‌లో మరింత ప్రమాదకరమని శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఒకప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించే సాంకేతిక పరిజ్ఞానం మనిషికి లేదు. ఆధునికంగా ఈ పరిజ్ఞానం పెరిగిన తర్వాత పెద్ద పెద్దనదులపై డ్యాములు కట్టి, సముద్రంలోకి కొంత నీరు పోకుండా ఆపుచేసి కాలువల ద్వారా పొలాలకు నీరందిస్తున్నారు. ఈ విధమైన నీటి పారుదల వ్యవస్థకు మనకు అవసరమే. విస్తారమైన నేలను సాగులోకి తెచ్చి ఆహారోత్పత్తిని పెంచవచ్చు, తాగడానికి తగినంత మంచినీరు లభిస్తుంది. డ్యాములు, రిజర్వాయర్లు భారీ స్థాయిలో నిర్మిస్తే ఆ ప్రాంతంలో భూమి కుంగిపోయే అవకాశం వుంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల చిన్న డ్యాములు ఎక్కువ సంఖ్యలో కట్టుకోవాలని వారు సూచనలు చేస్తున్నారు. కానీ, మన దేశంలో అన్నీకూడా భారీ డ్యాములే కట్టారు. భూమి రక్షణ గురించి పాలకులు పట్టించుకోవడం లేదు.
దేశంలోని పెద్ద నదులన్నీ అనుసంధానం చేస్తామంటున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయం ఒకటుంది. ఆంధ్రప్రదేశ్‌లో పట్టిసీమ పథకం ద్వారా గోదావరి నీటిని కాలువల ద్వారా కృష్ణాడెల్టాకు పంపేలా నదులను అనుసంధానం చేశారు. ఇది మంచి పనే. ఉత్తరాంధ్రకు కొంతనీటిని కాలువ ద్వారా మళ్లిస్తామంటున్నారు. నదుల నుండి స్థానికంగా ఇలాంటి నీటి మళ్లింపులను చేసి కరవు ప్రాంతాల్లో పంటలను పండించుకోవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వాలు చెబుతున్నది ఏమంటే గంగా నదినుండి కావేరీ నది వరకు అన్ని నదులను పెద్ద పెద్ద కాలువల ద్వారా మధ్యలో భారీ రిజర్వాయర్లను అనుసంధానం చేస్తామంటున్నారు. ఆచరణ యోగ్యత మాటలా వుంచితే ఇలాంటి చర్య భూమి సమతుల్యతకు హాని కలిగిస్తుందన్న వాదనలు లేకపోలేదు. నదుల ప్రవాహ దిశలను ఈ భారీ అనుసంధానం మార్చివేస్తుంది. జీవకోటి పుట్టడానికి చాలా ముందే నదులుపుట్టాయి. నదుల్లోని నీరు చివరకు సముద్రంలో కలుస్తునే వుంది. కొన్ని నదులు మొదట ఏ దిశలో ప్రవహించాయో, అలాకాకుండా కాలక్రమంలోఒకటి రెండుసార్లు తమ పారుదల దిశను మార్చుకున్నాయని భూగర్భ శాస్తవ్రేత్తలు చెపుతున్నారు. ఎందుకు మార్చుకున్నాయంటే భూమికి సమతుల్యత రావడానికి! భూమికి సమతుల్యత రావడానికి అనేక మార్పులు సహజసిద్ధంగా జరిగాయి. అలా మార్పులు జరిగి స్థిరపడ్డాకనే జీవరాశి పుట్టిందని శాస్తజ్ఞ్రుల అభిప్రాయం. ఈ మార్పును వారు అనేక పరిశోధనల తర్వాత గుర్తించగలిగారు. శాస్తబ్రద్ధమైన ప్రకృతి సూత్రాల ప్రకారమే భూమి ఏర్పడి స్థిరపడింది. ఆ ప్రకృతి సూత్రాలను అలాగేకొనసాగనివ్వాలి. వాటిని మార్చే సామర్ధ్యం కానీ, హక్కుగానీ మనిషికి లేదు. భూమిని కాపాడుకోవాలని అనేక అంతర్జాతీయ సమావేశాల్లో దేశాధినేతలు తీర్మానిస్తున్నారు. ఆ తర్వాత ఏ దేశానికి ఆ దేశం తన స్వార్థం కోసం పర్యావరణానికి చేటు కలిగించే కార్యక్రమాలు చేపడుతునే ఉన్నాయి. తనకు నివాసయోగ్యమైన భూమిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనిషిదే. ఎంతో వివేకంతో ఆ బాధ్యతను నెరవేర్చాలి.

-మనె్న సత్యనారాయణ