మెయన్ ఫీచర్

‘కార్తె’లతో కర్షకుల అనాది అనుబంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అశ్వని’ కురిస్తే అంతా నష్టం- అన్నది వ్యవసాయ ప్రపంచంలో మారుమోగిన ప్రాచీన సూక్తి. ‘్భరణి’ కురిస్తే ‘్ధరణి’ పండును- అన్నది సకాల వర్షాన్ని స్వాగతించే సూక్తి. అశ్వని, భరణి వంటి ‘కార్తె’లతో ముడివడిన సేద్యం గురించి, వర్షం గురించి మన దేశంలోని వ్యవసాయ శాస్త్ర పట్ట్భద్రులకు, స్నాతకోత్తర పట్ట్భద్రులకు తెలుసా? అన్నది సందేహం.. ‘జూన్ ఇరవై రెండున జూన్ పదహైదున..’ అంటూ నైరృతి ఋతుపవనం ఆగమనం గురించి అంచనాలను ప్రచారం చేస్తున్న వాతావరణ విభాగం వారు- అదే సమయంలో ‘ఆర్ద్ర’కార్తె వస్తోందన్న వాస్తవాన్ని కూడా రైతన్నలకు ఎందుకని గుర్తుచేయడం లేదు? ‘ఇరవై ఏడులో తొమ్మిది తీసివేస్తే ఎంత?’ అని అలనాడు శ్రీకృష్ణదేవరాయలు మహాకవి తెనాలి రామకృష్ణుడిని ప్రశ్నించాడట! ‘ఇరవై ఏడులో తొమ్మిదిని తీసివేస్తే మిగిలేది సున్న..’ అని ఆ మహాకవి సమాధానం చెప్పాడట! వ్యవసాయ శాస్త్ర విద్యార్థులకు ఇలాంటి భారతీయ విజ్ఞానం, కథలు, చతురోక్తులు బ్రిటన్ విద్యావేత్తలు మప్పలేదు, మరిపించారు! కానీ, క్రీస్తుశకం 1947 తరువాత భారతీయ విద్యావేత్తలు కూడా చెప్పడం లేదు. ‘కార్తె’ల గురించి తెలుసుకోవడం నిరక్షరకుక్షులైన ‘నాటు’రకం వ్యవసాయదారుల అనాగరిక పద్ధతి అని ‘చదువుకున్న’ తాము వాటి జోలికి పోరాదని భ్రాంతిపడుతున్న విద్యాధికుల సంఖ్య పెరిగిపోతోంది! పాశ్చాత్యుడైన ‘గ్రెగరీ పోపు’ తయారుచేసిన ‘కాలెండర్’లోని ‘జనవరి’, ‘డిసెంబర్’లను మాత్రమే తెలుసుకోవాలని ఈ మేధావుల విశ్వాసం! తమిళుల ఉగాది ఏప్రిల్ పదునాలుగు, పదిహేను తేదీలలోనే వస్తుందని తెలుసుకోవటం మాత్రం మరో విషయం! కానీ తమిళుల ఉగాది అశ్వని కార్తె ఆరంభమైన రోజున వస్తోందన్న సనాతన సత్యం గురించి మాత్రం ధ్యాస లేదు! నిజానికది తమిళ భాషా జన సముదాయానికి మాత్రమే కాదు, ‘సౌరమానం’ పాటిస్తున్న వివిధ ప్రాంతాల వారందరికీ చైత్రమాసపు మొదటిరోజు! తెలుగు, కన్నడ, మరాఠీ, త్రివిష్టప ప్రాంతాల వారు ‘చాంద్రమానం’ పాటిస్తున్నారు!
అశ్వని నక్షత్రంతో కలిసి సూర్యుడు ఉదయించడం ఆరంభమయ్యే రోజు అశ్వని కార్తె ప్రారంభం అవుతోంది. పదమూడు లేదా పదునాలుగు రోజుల పాటు సూర్యుడు ప్రతి నక్షత్రంతో కలిసి ఉదయిస్తాడు. ఇలా సూర్యుడు మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలతో కలిసి ఉదయించడం పూర్తయ్యేసరికి మూడు వందల అరవ అయిదు రోజుల ఆరు గంటల సమయం అవుతోంది. ఇదీ సౌర సంవత్సరం! సూర్యునికి సంబంధించినది ‘సౌరం’, చంద్రునికి సంబంధించినది ‘చాంద్రం’.. భారతీయుల యుగయుగాల జీవన ప్రస్థానంలోని వైవిధ్యాలలో ఇవి కొన్ని, వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు సమన్వయం ఉంది. అంతర్నిహిత స్నేహం ఉంది! ఇరవైఏడు నక్షత్రాలు సూర్య సహితంగా ఉదయించడం వల్ల ఆయా నక్షత్రాల పేరుతో కార్తెలు ఏర్పడుతున్నాయి. విశ్వవ్యవస్థ ఒక ఊహకందని ‘అనాది అనంతమైన’ మహా వ్యవస్థ, ‘కంప్యూటర్’ వలె, ‘ఇంటర్నెట్’ వలె ఇది మానవ నిర్మితం కాదు. సహజంగా ఎప్పుడూ ఉన్నది కాబట్టి విశ్వ వ్యవస్థ సనాతనమైనది అంటే శాశ్వతమైనది. ఈ వ్యవస్థలోని ‘్ధర్మం’ లేదా స్వభావం సనాతన ధర్మం. భారతీయులు ఈ ధర్మాన్ని తమ జీవన వ్యవహారానికి అన్వయించుకొని సనాతన అనుసంధానాన్ని విశ్వవ్యవస్థలో ఏర్పరచుకున్నారు. అందువల్లనే భారతీయ జాతీయ జీవనం సనాతన ధర్మమైంది! విశ్వ వ్యవస్థలోని ఈ మన భూమి మిగిలిన దివ్యచరాల- ‘హెవన్లీబాడీస్’తో నిరంతరం అనుసంధానమై ఉండడం సనాతన ధర్మం, ఇది తార్కికమైనది, నిత్యనూతనమైది- సూర్యకిరణం వలె, శరశ్చంద్ర చంద్రికా ధవళియవలె!
బ్రిటన్ శే్వత చర్మ దురహంకారులు మన దేశాన్ని దురాక్రమించడానికి పూర్వం మన పూర్వులు చెప్పినదంతా ‘మూఢత్వమ’ని చెప్పడం ప్రస్తుత మన విద్యావిధానంలో ప్రధాన ఇతివృత్తమైంది! అందువల్లనే వర్షంతో ముడివడి ‘కార్తెల’ కథ మన స్నాతకోత్తర వ్యవసాయ శాస్త్ర పట్ట్భద్రులకు చెప్పడం లేదు! అశ్వని, భరణి కార్తెల తరువాత ‘కృత్తిక’ వస్తుంది. ‘అశ్వని’ కార్తెలో వర్షం రాకపోవడం ‘్భరణి’లో చినుకుల చిటపటలు వినిపించడం భూమధ్య రేఖకు ఉత్తరంగాను మహోదధికి ఈశాన్యంగాను విస్తరించిన మన దేశానిని వర్తించే అనాది ప్రాకృతిక సూత్రం. భూమధ్యరేఖకు దక్షిణంగాను మహోదధికి పశ్చిమంగాను ఉన్న దేశాలకు వర్తించే ‘కార్తె’ల ప్రక్రియ వేరు. ‘మహా ఉదధి’ ‘మహోదధి’గా హిందూ మహాసముద్రం అనాదిగా ప్రసిద్ధి పొందింది. ‘ఉదధి’ అని అంటే సముద్రం. బంగాళాఖాతం ‘రత్నాకరమని’ ప్రసిద్ధి పొందింది. రత్నాకరము, మహోదధి కలిసే చోట కన్యాకుమారి ఉంది! భరణిలో ఒకవేళ వర్షం కురవకపోయినా- అపవాదం ఏర్పడి- కృత్తికలో మాత్రం వర్షం కురిసి తీరుతుంది! అందుకే ‘కృత్తిక’ను ప్రధానమైన ‘కార్తె’గా వ్యవసాయదారులు గుర్తించారు! ‘‘కార్తె పుట్టినా ఇంకా వాన రాలేదే?’’ అని ఆశ్చర్యపోతారు. వర్షం కురిపించమని ప్రార్థిస్తూ ‘పడమటి’కి యాత్ర చేస్తారు. ఈ గ్రామీణ విజ్ఞానం విశ్వవ్యవస్థకు సంబంధించిన వాస్తవం! ‘మృగశిర’ కార్తె చిందిస్తే- వర్షాన్ని మిగిలిన కార్తెలు కూడా వర్షిస్తాయంట! ‘ఆర్ద్ర’మంటే తడి.. ‘ఆర్ద్ర’మ ‘ఆరుద్ర’ కార్తె అని ‘ఆరెద్దుల’ కార్తె అనీ కూడా వివిధ ప్రాంతాలలో అంటున్నారు. ‘ఆర్ద్ర’ కార్తె రావడంతో మొత్తం భూమి, ప్రకృతి వర్షంతో తడిసిపోతాయి. అందువల్ల అంతరిక్షంలో వందల కోట్ల మైళ్ల దూరంలోని ఆ నక్షత్రాన్ని అలా పిలిచారు! విశ్వ స్థిత వాస్తవాలకు సూచిక- మానిటర్- మన పంచాంగం! అంధ విశ్వాసం కాదు! అంధ విశ్వాసమని అజ్ఞాన వేదికలెక్కి ఆర్భాటిస్తున్న దుర్జనులు బ్రిటన్ భావదాస్య వారసులు! ‘ఉత్తర’ కార్తె వరకు రైతులు వేచి ఉంటారు. అంటే మృగశిర, ఆర్ద్ర, పునర్వసు, పుష్యమి, ఆశే్లష, మఖ, పూర్వఫల్గుని కార్తెలలో వర్షం రాకపోయినా కనీసం ‘ఉత్తర ఫల్గుని’ కార్తెలోనైనా వర్షం వస్తుందన్నది కర్షకుల ఆశ! అందుకే ‘ఉత్తర’ చూసి ఎత్తర గంప- అన్నది సామెత! అంటే ఉత్తర కార్తెలో కూడా వాన రాకపోతే ఇక ఆ యేడు పంటలు సున్న! అందువల్ల తట్ట బుట్ట తపేలాలు నెత్తికెత్తుకుని వ్యవసాయ శ్రామికులు ‘ఉత్తర’ తరువాత వలసపోయేవారు. మృగశిర నుంచి తొమ్మిది ప్రధానంగా వాన కార్తెలు. అందుకే ‘‘ఇరవై ఏడులో తొమ్మిది తీసివేస్తే మిగతాది సున్న..’’ అని తెనాలి రామకృష్ణుడు చెప్పాడన్నది కమనీయ కల్పన! ఈ కల్పనకు ప్రాతిపదిక మాత్రం భూమికి వందల కోట్ల మైళ్ల దూరంలో అంతరిక్షంలో నిర్ణీత కక్ష్యలో సంచరిస్తున్న తారలు సూర్యునితో కలిసి ఉదయిస్తున్న వాస్తవం!
‘స్వాతి’ కార్తె వానకు సముద్రాలు నిండుతాయి, ముత్యాలు పండుతాయి. ‘‘చిప్పలోన పడ్డ చినుకు ముత్యంబయ్యె’’ అన్నాడు వేమన యోగి. చాతక పక్షి స్వాతి చినుకులను ఆకసంలోనే పట్టుకొని తాగేస్తుందట! స్వాతి తరువాతది విశాఖ! ఆ తరువాత వానలు రావు. వర్షంతో శుభ్రమైపోయిన ఆకాశంలో కార్తికమాసం చంద్రుడు మరింత తెల్లగా ప్రకాశించడం జీవన సత్యం! సూర్యుని ఉదయం కూడా మరింత తెల్లగా ఉంటుంది కార్తికమాసంలో.. అది శరత్ ఋతువు... ‘‘కరము వెలింగె వాసర ముఖంబులు శారద వేళ చూడగన్...’’ అన్నది మహాకవి ఎఱ్ఱన తిలకించిన దృశ్యం! ఇదంతా వస్తువునకు దూరమైన భావకవిత్వం కాదు, విశ్వవ్యవస్థ స్వభావం, ఖగోళ వాస్తవాల ప్రభావం.. భూమికి, గ్రహాలకు ఉపగ్రహాలకు సూర్యునికి అసంఖ్యాక కోట్ల నక్షత్రాలకు ప్రాణం ఉంది, రూపం ఉంది, చలనం ఉంది, ఆత్మ ఉంది! మానవుడు తిన్నట్టుగా ఈ ‘దివ్యచరాలు’ తినకపోవచ్చు! ‘చెట్టు’ తింటున్న రీతిలో, ‘ఆవు’ తినడం లేదు. భూమి విశ్వ రజాన్ని- కాస్మిక్ డస్ట్- నిరంతరం భుజించి తన చుట్టూ, సూర్యుని చుట్టూ తిరగడానికి శక్తిని పొందుతోంది, మనకు ప్రాణాన్ని ప్రసాదిస్తోంది! రూపాలు కూడా ఇలాగే వేఱు! ఈ వైవిధ్యాలు అసంఖ్యాకాలు.. వీటి మధ్య సమన్వయం అనుసంధానం ఏకోన్ముఖ లక్ష్యగమనం విశ్వవ్యవస్థ! ఈ వ్యవస్థకు ‘సూచిక’ పంచాంగం..
భూమితో సన్నిహిత సాపేక్ష సంబంధం ఉన్న ప్రధానమైన నక్షత్రాలు ఇరవై ఏడు. వీటిలో కొన్ని నక్షత్ర సమూహాలు! జ్యేష్ఠ అన్నది అన్నింటికంటే పెద్దది. అందుకే దాన్ని ఆ పేరుతో ‘మొదటిద’ని లేదా ‘పెద్దదని’ మన పూర్వులు పిలిచారు! అలాగే గ్రహాలలో ‘బృహస్పతి’ పెద్దది. అందుకే ఆ మహాగ్రహాన్ని ‘గురువు’ అని మన వ్యవసాయదారులు, పంచాంగకర్తలు పిలిచారు! అనంత విశ్వంలో అసంఖ్యాక నక్షత్రాలున్నాయి. కానీ, భూమితో అశ్వని నుండి రేవతి వరకుగల ఈ ఇరవై ఏడు నక్షత్రాలకు సాపేక్షంగా ప్రత్యేక సంబంధం ఉంది. భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న మకరరేఖ- ఇరవై మూడున్నర ‘్భగ’ల దక్షిణ అక్షాంశరేఖ- నుంచి భూమధ్యరేఖకు ఉత్తరంగా ఉన్న ‘కర్కటక’ రేఖ- ఇరవై మూడున్నర ‘్భగ’ల ఉత్తర అక్షాంశం వరకూ ఈ ఇరవై ఏడు నక్షత్రాలు అంతరిక్షంలో వ్యాపించి ఉన్నాయి. వీటిలో అశ్వని, చిత్ర నక్షత్రాలు భూమధ్య రేఖకు నిటారుగా ఉన్న అంతరిక్షంలో నెలకొని ఉన్నాయి. అశ్వని నుండి పదునాలుగవది చిత్ర, చిత్రనుండి పదునాలుగవది అశ్వని! అందువల్ల ఈ రెండింటి ఉదయాల మధ్య, అస్తమయాల మధ్య, పనె్నండు గంటల అంతరం ఉంది. చిత్ర ఉదయిస్తూ ఉన్నప్పుడు అశ్వని అస్తమిస్తూ ఉంటుంది. అశ్వని ఉదయిస్తున్నప్పుడు చిత్ర అస్తమిస్తూ ఉంటుంది! మిగిలిన ఇరవై ఐదు నక్షత్రాలు కూడా సగం భూమధ్యరేఖకు దక్షిణంగా మకరరేఖ వరకు మిగిలిన సగం భూమధ్యరేఖకు ఉత్తరంగా కర్కాటక రేఖ వరకూ అంతరిక్షంలో విస్తరించి ఉండడం భూమి నుండి కనిపించే సాపేక్ష దృశ్యం! శుక్రగ్రహం నుంచి చూసినపుడు, ఇతర గ్రహాల నుంచి చూసినపుడు ఈ సాపేక్ష దృశ్యం మారిపోతుంది. మనం భూమీచరులం.. ప్రతిరోజు భూమి నుంచి చూసినపుడు ఇరవై ఏడు నక్షత్రాలు ఒకటి తరువాత ఒకటిగా ఉదయిస్తూనే ఉన్నాయి! ఒకటి తరువాత ఒకటిగా అస్తమిస్తూనే ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరగడం వల్ల ఈ ‘నక్షత్రాల’ ఉదయం, అస్తమయం సాపేక్షంగా జరుగుతోంది! భూమి పరిభ్రమణం కారణంగా అంటే భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల సూర్యుడు సంవత్సరం పొడవునా ఏదో ఒక నక్షత్రంతో కలిసి ఉన్నట్టు సాపేక్ష- రిలేటివ్- దృశ్యం ప్రస్ఫుటిస్తోంది!!
ఇలా సూర్యుడు ఉదయించే సమయంలోనే అశ్వని నక్షత్రం ఉదయించడం పదమూడు రోజులు ప్రస్ఫుటించే దృశ్యం- మొదటి రోజు మేష సంక్రాంతి! సౌరమానం పాటించే తమిళులకు అదే ఉగాది.. శుక్రవారం నుంచి సూర్యుడు అశ్వనితో కలిసి ఉదయిస్తాడు! పరిభ్రమణం ప్రభావం వల్ల సూర్యుడు ‘నక్షత్ర’ సహప్రస్థానంలో ప్రతిరోజు వెనుకపడిపోతున్నాడు. పదమూడు పదునాలుగు రోజులలో అశ్వని నక్షత్రం పూర్తిగా ముందుకెళ్లిపోతుంది. భరణితో కలిసి సూర్యుడు ఉదయించడం మొదలైపోతుంది. అది భరణి కార్తె! ఇలా రేవతి వరకూ!! ఇరవై ఏడు నక్షత్రాలు లేదా సమూహాలు పనె్నండు రాశులుగా ఖగోళంలో విభక్తమై ఉన్నాయి. అది మరో విజ్ఞాన వ్యవహారం! పనె్నండు సంక్రాంతుల కథ అది...
*

-హెబ్బార్ నాగేశ్వరరావు 2013hebbar@gmail.com