మెయిన్ ఫీచర్

ఆధారాలు వేదం లోనివే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక రకం కనిపించేటువంటి భౌతిక ప్రపంచాన్ని పరిశోధించేవాళ్ళు శాస్తవ్రేత్తలు. రెండవ రకంవారు కనిపించే రుూప్రపంచాన్ని నడిపే కనపడని ఆ శక్తిని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు (్భరతీయ తత్త్వశాస్తజ్ఞ్రులు) ఈ సందర్భంలో ‘‘ఇస్రో’’ మాజీ అధిపతి, మాధవన్ నాయర్‌గారి అభిప్రాయాన్ని ప్రస్తావించడం సందర్భోచితంగా ఉంటుంది. గురుత్వాకర్షణ శక్తి గురించి ‘‘సర్ ఐజాక్ న్యూటన్’ (1645 ) 17th Century)) ప్రఖ్యాత శాస్తవ్రేత్త చెప్పడానికంటే 1500 సంవత్సరాల క్రితమే భారతీయ ఖగోళ శాస్తవ్రేత్త ‘‘ఆర్యభట్ట’’కు దాని గురించి తెలుసు. 12వ శతాబ్దపు వాడైన భాస్కరాచార్యుడు తన సిద్ధాంత శిరోమణి అను గ్రంథము ద్వారా గురుత్వాకర్షణశక్తి గురించి సుస్పష్టముగా వివరించాడు. చంద్రునిపై జలరాశి ఉందని వేదాల్లోని కొన్ని శ్లోకాలు ప్రస్తావించాయి. లోహశాస్త్రం, బీజ గణితము, ఖగోళ శాస్తమ్రు, గణితము, జ్యోతిషము, వాస్తు, శిల్ప శాస్త్రాల గురించి, పాశ్చాత్య శాస్తవ్రేత్తలు తెలుసుకోవటానికి చాలాముందే భారతీయ వేదాలు, ప్రాచీన గ్రంథాలల్లోను వాటి సమాచారం ఉంది. ఢిల్లీలో వేదాలపై జరిగిన ‘అంతర్జాతీయ సదస్సు’లో ఆయన ఈ ప్రసంగం చేశాడు. వేదాలలో సమాచారం కుదించిన రూపం (Comdensed Format)) లో ఉందని అందువల్ల ఆధునిక విజ్ఞానశాస్తమ్రు దానిని అంగీకరించడం కష్టవౌతుందని ‘నాయర్’ అభిప్రాయపడ్డారు. చంద్రునిపై నీరు ఉందని వేదంలోని శ్లోకాలు చెబుతున్నాయి. దానిని ఎవరూ విశ్వసించలేదు. ‘చంద్రయాన్’ ప్రయోగం ద్వారా దానిని ఋజువు చేయగలిగాం. అలా ఋజువు చేయగల్గిన మొదటి వ్యక్తులం మనమే. వేదాలు స్వచ్ఛమైన సంస్కృతంలో ఉన్నందున, వాటిలో ఉన్నదంతా అర్థం చేసుకోలేము. పాశ్చాత్య ప్రపంచానికి ఏ మాత్రము తెలియని ప్రాథమిక ఆవిష్కరణలు దీనిలో ఉన్నాయి. వేదాలను చదవాలంటే, సంస్కృతం తెలియాలనేదే ఒక అవరోధం అని ఆయన వివరించారు. సౌర కుటుంబంలోని వెలుపలి గ్రహాల ఉనికి గురించి అయిదవ శతాబ్దానికి చెందిన ఖగోళ నిపుణుడు, గణిత పండితుడు ‘‘ఆర్యభట్ట’’ చేసిన కృషి నిజంగా గర్వకారణమని, చంద్రయాన్ ప్రయోగం కోసం ‘‘ఆర్యభట్ట’’ సమీకరణాలను, ఉపయోగించుకున్నామని తెలిపారు. హరప్పా నాగరికత, కాలంలోనే, నగరాల నిర్మాణానికి రేఖాగణితాన్ని వినియోగించారని, ‘‘పైథాగరస్ సిద్ధాంతం’’ వేదాల కాలంనించి ఉందని చెప్పారు. ఆ రోజుల్లో వేసిన లెక్కలుచాలా అద్భుతమని, ఒక శాస్తవ్రేత్తగా తాను చెప్పగల నన్నారు.్భమి సూర్యుని తిరుగుతోందని చెప్పిన ఈ క్రింది శ్లోకాన్ని పరిశీలించండి.
శ్లో॥ అయంగౌః పృశ్నిరక్రమీత్ అసదన్మాతరం పురః పితరంచ ప్రయస్యః
ఇతి ఋగ్వేదే 10 మం, 189 సూ 1 ఋకం యజుర్వేదే 1-5-3-2
సామవేదే 630 మం. 1376, మం. అధర్వణ వేదే 6 కాండ 31 సూక్తం 1వ మంత్రం పై మంత్రము 4 వేదములలో నున్నది.
అర్థం: ఈ కనబడుతున్న చంద్రుడు (‘గౌః’ శబ్దానికి, భూమి, చంద్రుడు స్వర్గే, వృషభేక్రతే అని నానార్థములు కలవు) (విశ్వకోశమందు) భూమికి ఉపగ్రహ మగుటచేత, మారూపురాలగు భూమి యొక్క ఆకర్షణలో నుండి,్భమి చుట్టూ తిరుగుతూ, భూమితో కలిసి సకల లోక పోషకుడై స్వయం ప్రకాశకుడైన పితృస్థానీయుడైన సూర్యుని చుట్టూ తిరుగుచున్నాడని, వేదములు చెప్పుచున్నవి. ఇదే విషయమును సూర్యసిద్ధాంతాది జ్యోతిష గ్రంథములు కూడ చెప్పుచున్నవి. కానీ మనం విద్యార్థులకు బోధించే పాఠ్య గ్రంథాలలో ‘గెలీలియో’ అనే ఇటలీ శాస్తవ్రేత్త (1564-AD- 1642) సూర్యుని చుట్టూ భూమి తిరుగుచున్నదని కనిపెట్టాడని బోధిస్తున్నాము అంటే సుమారు 370 సం. క్రితం భారతీయుల కట్టి విషయము తెలియదని, అంతటి అజ్ఞానులమనే కదా అర్థం. ఇటువంటివెన్నో విషయాలు మన భారతీయ కుహనా విద్యావిధానానికి మచ్చుతునకలు. అలాగే గణితశాస్త్రంలో మనం తరచూ వాడు "infinity" గురించి ‘పూర్ణమదః పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణముదచ్యతే, పూర్ణస్య, పూర్ణమాదాయ, పూర్ణమేవా వసిష్యతే’’ యేనాడో చెప్పారు మన మహర్షులు. ‘"Hydrozen Isotope'’ ల గురించి కృష్ణ యజుర్వేదంలో చెప్పబడిందని చెప్పారు మన పెద్దలైన మహర్షులు.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ -- 9490947590