మెయిన్ ఫీచర్

‘అకాడమీ’లో అసాహిత్య శక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సహితస్య భావం సాహిత్యం - అని భారతీయులు నమ్మారు. కాని సాహిత్యం ద్వారా అరాజకత్వాన్ని వ్యాపింపచేయాలని మార్క్సిస్టులు విశ్వసించారు. మతానికి వౌలిక లక్షణాలుంటాయి. ఒకే దేవుడు - ఒకే మత గ్రంథం- ఒకే మోక్షమార్గం. ఇస్లాంలో అల్లా ఒక్కడే దేవుడు- మహమ్మద్ ఒక్కడే ప్రవక్త- ఖురాన్ ఒక్కటే మత గ్రంథం- దీనిని కాదనేవారు కాఫిర్లు. అంటే అవిశ్వాసులు. అట్టివారిని జీహాదీ పేరుతో వధించాలి- ఖలీఫా మత రాజ్యం స్థాపించాలి. గత పదిహేను వందల సంవత్సరాలుగా ఈ జీహాదీ ఉగ్రవాద చరిత్రతో భూమి రక్తసిక్తమయింది- బొంబాయి బాంబు ప్రేలుళ్లకు మేమే ఆధికారికంగా కారణం అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌షరీఫ్ (12-5-2018 నాడు) ఆధికారికంగా ప్రకటించాడు. ఇలాగే బైబిలు ఒక్కటే మతగ్రంథం. ఏసును నమ్మని వారు నరకానికి పోతారు అని క్రైస్తవం చెపుతున్నది. అలాగే మార్క్సు ఒక్కడే దేవుడు. దాస్ కాపిటల్ ఒక్కటే నమ్మదగిన మత గ్రంథం. వర్గపోరాటమే ఏకైక మోక్ష మార్గం అని కమ్యూనిస్టు మతం చెపుతున్నది. ఈ విషయాలు ఇప్పుడు ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతరించినా ఇంకా వాటి అవశేషాలు అక్కడక్కడ మిగిలిపోయాయి. బిడ్డపోయినా పురిటికంపు కేరళలో, బెంగాల్‌లో మిగిలి ఉంది. ఆర్థిక లాభాలకోసం తెలుగుకవులు కొందరు ఈ ఆదర్శాలను అభినయిస్తున్నారు. నిత్యజీవితంలో మీరు భ్రష్టులు- నీతులు రాతలు చూపటం తప్పుకదా అని ప్రశ్నిస్తే మమ్మల్ని చూడకండి- మా కవితలను చదవండి అని జవాబు చెపుతున్నారు.
ప్రగతిశీల ప్రజాస్వామ్య లౌకిక అభ్యుదయ లోకాయత చార్వాక హేతువాద బూతువాద విధానం మా ఆదర్శం అంటూ గత నూరేండ్లుగా పడికట్టు పదాలతో జనాన్ని ఊదరకొడుతూ దేశాన్ని విచ్ఛిన్నంచేస్తూ ‘‘లేలే రష్యారాజా రష్యా విమాన బాహువులు విసురుతూ రష్యా అనంత ప్రపంచం అంతటా నీవై నీ వెలుగు నీడల్ని వ్యాపించు’’ అంటూ తాగిన మత్తులో పిచ్చికూతలు కూశారు. ఇవ్వాళ రష్యా విచ్ఛిన్నమైంది. అది గాండ్రించదు- గర్జించదు. కనీసం పిల్లిలా కూడా మ్యావ్‌మ్యావ్ అనలేదు. ఐనా మన దేశద్రోహులకు రష్యా చైనాలే గురుపీఠులు. గతి తార్కిక భౌతికవాదం వారి విలాస జీవితాలకు ఒక మేలిముసుగు.
తిరుపతిలో త్రిపురనేని మధుసూదనరావు అనే వీర కమ్యూనిస్టు ఉండేవాడు. అతడు తినేది గోవిందరాజస్వామివారి సొమ్ము. పాడేవి రంకు పదాలు. కడపలో రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అనే పెద్దాయన ఉన్నాడు. ఆయన కడప గ్యాంగ్‌తో రికమెండేషన్ చేయించుకొని కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం తెప్పించుకున్నాడు. ఈయనకు ‘‘గుజరాత్ గాయం’’ కన్పడింది. గోద్రాలో రామభక్తులను సజీవ దహనం చేసిన సంఘటన కన్పడలేదు. బొంబాయి వీధుల్లో 200మంది అమాయకులను ఉగ్రవాదులు బాంబులు పేల్చి చంపిన సంఘటనలు కన్పడలేదు. కేరళలో పిన్నరాయ్ విజయన్ కన్నూరును శ్మశాన వాటికగా మార్చటం కన్పడలేదు. ‘కన్నూరు గాయం’ అని ఈ మహానుభావుడు ఒక గేయం ఎందుకు రాయలేదు? తెలుగులోకి శివారెడ్డి సాహిత్య అకాడమీ కన్వీనర్ కావటం యాదృచ్ఛికం కాదు. ఇదొక అంతర్జాతీయ కుట్ర. తప్పు ప్రకాశ్ జావదేకర్‌ది. నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన ఐదేళ్లలోను సాహిత్య సంగీత నాటక అకాడమీల ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించలేకపోయాడు. త్రిపురలో మాణిక్ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ, లాల్ బహదూర్‌శాస్ర్తీ వంటివారి పేర్లు పాఠ్యగ్రంథాల్లో లేకుండా చేశాడు. లెనిన్, మార్క్సు, స్టాలిన్, ఎంగెల్స్, చేగుచేరా, మావోసేటుంగ్ వీరి జీవిత చరిత్రలు రెండున్నర దశాబ్దాల పాఠ్యాంశాలుగా పెట్టారు. కనీసం ఇది తప్పు అనేవాడు ఈ దేశంలో లేడు.
కమ్యూనిజాన్ని పొగిడినంతకాలం దాశరథిని మహాకవి అన్నారు. ఆయన నేషనలిస్టు కాగానే ‘ఏమిట్రోయ్ పొట్టికవీ’ అంటూ నీచమైన భాషలో శ్రీశ్రీ వంటివారు తిట్టారు. దాశరథి రంగాచార్య మోదుగుపూలు వ్రాస్తే అభ్యుదయవాది. రామాయణం వ్రాసేసరికి ప్రగతి నిరోధకుడు ఫాసిస్టు అయినాడా? గజ్జల మల్లారెడ్డి ఎర్ర సిరాబుడ్డిగా ఉన్నంత కాలం జేజేలు పలికారు. వివేకానందుని యతిగీతం తెలుగులోకి అనువదించి ఆధ్యాత్మిక భావనతో తృప్తిగా కన్నుమూసేసరికి అతడు అభివృద్ధి నిరోధకుడైనాడు. ఈ ద్వంద్వ ప్రమాణాలు కంపుకొట్టే జీవితాలు కమ్యూనిస్టు రచయితలవి. కట్టుకున్న భార్యకు కూడుపెట్టకుండా తరిమివేసిన శ్రీశ్రీలు, ఆత్రేయలు, శేషేంద్రలు వీరి దృష్టిలో అభ్యుదయ ప్రగతిశీల కవులు. దీనికి రాచపాళెం గ్యాంగ్ ఏం సమాధానం చెపుతుంది? ఇంట్లో సత్యనారాయణ వ్రతాలు, వరలక్ష్మీవ్రతాలు చేసుకుంటూ వీధుల్లో విప్లవాన్ని అభినయించేవారికి కేంద్ర సాహిత్య పురస్కారాలను కన్వీనర్ ఎన్.గోపీ చేత ఇప్పించటం హిపోక్రసీ అంటారు. సాహిత్యం పేరుతో రౌడీ రాజకీయాలు ఎంతకాలం భరిస్తారు?
కనీసం మీరు చెప్పే సిద్ధాంతాలకు మీరైనా కట్టుబడి ఉండాలి కదా! మీకు మీ శరీరం మీదనే స్పృహ ఉండదు. ఇక సామాజిక స్పృహ ఎక్కడినుండి వస్తుంది? బిహెచ్.కృష్ణమూర్తి బలహీనతల గమనించి వాటిని సంతృప్తి పరిచి పురస్కారాలు తెచ్చుకోవటం నిజమా? అబద్ధమా? అక్కిరాజు రమాపతిరావు కేంద్ర సాహిత్య అకాడమీ కన్వీనర్‌గా ఉన్నప్పుడు కేతు విశ్వనాథరెడ్డి అవిశ్వాస తీర్మానం పెట్టించటం నిజం కాదా?? ఎన్.గోపీ కుటుంబానికి సన్నిహితురాలు కావటంవల్ల ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ఆయన హయాంలో ఇప్పించటం నిజం కాదా??
‘‘సాహిత్యం చీపురు వంటిది. దానితో మన సిద్ధాంతానికి సేవ చేయించుకొని రక్తవిప్లవం తీసుకురావాలి’’- అని చెప్పిన ఒక దుర్మార్గపు మూర్ఖ మార్క్సిజాన్ని నమ్మిన రచయితలు దక్షిణాది రాష్ట్రాల్లో ఇంకా ఉన్నారు. వారే సాహిత్యాన్ని ట్రేడ్ యూనియనిజం కిందికి మార్చి పురస్కారాలు వడ్డించుకొని భుజాలు ఎగురవేస్తున్నారు. ఈ ద్వేషాన్ని భారతీయ సాంస్కృతిక వాదులు ఎదుర్కోలేకపోతున్నారు. కాళిదాసు కన్నా కాత్యాయని కాళీపట్నం మహారచయితలు అని ప్రచారం చేస్తున్న దుర్మార్గపు కాలంలో మనం జీవిస్తున్నాము. భరించాల్సిందే. ఆదర్శంగా స్వీకరించాము. అసత్యమేవ జయతే ‘‘సత్యమేవ జయతే’’ అనే ముండకోపనిత్ వాక్యాన్ని మన జాతీయతని రాహుకేతువులు ప్రచారం చేస్తున్నారు. ఆందోళన మా ఊపిరి - అరాజకం మా సిద్ధాంతం - అని చాటిన శ్రీశ్రీ వీరికి కుల గురువు.
ఇది మార్క్సిజం కాదు. అనార్కియిజం!! ఆర్థిక అసమానతలు ఉండకూడదు- అని ప్రచారంచేసిన ఈ ప్రబుద్ధులు తమ నిజజీవితంలో పరాయివాడికి ఒక్క రూపాయి అయినా ఇచ్చిన దాఖలాలు లేవు. మద్యపాన నిషేధం- అమలులో లేని దేశంలో మీ వ్యసన పరాయణత్వం మీ ఇష్టం-కాని ఈ విలాసాలను కంట్రోల్ చేసుకొని ఆ డబ్బును దళితులకు నిరుపేద రైతులకు ఎందుకు ఇవ్వటం లేదు??
పుట్టపర్తి నారాయణాచార్యుల నోట్లో మట్టికొట్టి పురస్కారం తెచ్చుకున్నది ఎవరో సాహితీవేత్తలకు తెలియదా? పోతుకూచి సాంబశివరావు సాహితీవేత్త కాదు-చేకూరి రామారావుకు పురస్కారం ఇవ్వండి - అని రికమెండ్ చేసింది ఎవరు? గోపీనాథ్ నారంగ్ కేంద్ర సాహిత్య ఎకాడమీ అధ్యక్షునిగా నియమింపబడినప్పుడు బెంగాల్‌కు చెందిన మహాశే్వతాదేవి అనే ఒక ఉగ్రవాద రచయిత్రి ఇరవై సంవత్సరాల క్రితం చేసిన అల్లరి గుర్తుతెచ్చుకోండి. మధురాంతకం రాజారాం మొదట జాతీయ భావాలుగల రచయిత. అప్పుడాయన ముఖం ఎవరూ చూడలేదు. కమ్యూనిస్టులకు సన్నిహితం కాగానే కేంద్ర సాహిత్య పురస్కారం ఇప్పించారు. చిన్నయసూరి మీద చింతాకంత గౌరవం కూడా లేని బూదరాజు రాధాకృష్ణ చేత మోనోగ్రాఫ్ వ్రాయిస్తే ‘చిన్నయసూరి అపండితుడు- అభివృద్ధి నిరోధకుడు’ అని వ్రాశాడు. ఇదీ మన సాహిత్య అకాడమీ ఘన చరిత్ర.
ఈ దేశంలో జాతీయ రచయితలు కర్మ సిద్ధాంతాన్ని నమ్మినవారు. ‘కమ్యూనిస్టులు వాళ్ల పాపాన వాళ్లే పోతారులే’ అని గుడులు గోపురాల చుట్టూ తిరుగుతూ ఉంటే కసిరెడ్డి వెంకటరెడ్డికి బదులు కె.శివారెడ్డి గాంగ్ సాహిత్య అకాడమీని కబ్జాచేసింది. కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ వెంటనే ప్రస్తుత ఎకాడమీ కార్యవర్గాన్ని రద్దుచేయాలి. ఇప్పటివరకు పురస్కారాల్లో జరిగిన అవకతవకలపై కేంద్ర దర్యాప్తు బృందంలో విచారణ జరిపించాలి. అరుంధతీరాయ్ అనే క్రైస్తవ రచయిత్రి ఉంది. ఈమె సూడో సెక్యులర్. అమెరికా వెళ్లి భారతదేశంలో మత సహనం లేదు అని ప్రచారం చేసి వచ్చింది. అందుకు ఆమెకు బుకర్స్ పురస్కారం ఇప్పించారు. నరేంద్ర మోదీ భారత ప్రధాని అయితే నేనీ దేశమే వదిలిపోతాను అన్నాడు సాహిత్య ఎకాడమీ అధ్యక్షుడు యుఆర్ ఆనందమూర్తి. మోదీ ప్రధాని అయినాడు. యుఆర్ ఈ లోకమే వదిలిపోయాడు. తెలుగులో గత పదేండ్లుగా సాహిత్య ఎకాడమీ పురస్కారాలు కొనుక్కున్నవారి జాబితా చూడండి. దేశ ద్రోహులను ఏరికోరి మరీ వడ్డన చేయించారు. ఇది రౌడీ రాజకీయం.

- సంఘమిత్ర