మెయన్ ఫీచర్

కాశ్మీర్ సమస్యపై రాజకీయ చొరవ ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు సరిహద్దు భద్రతా దళం మాజీ డిఐజి కేసీ పథి జమ్మూ కాశ్మీర్ మాజీ డిఎస్పీ మొహమ్మద్ అష్రాఫ్ మీర్ సహా ఐదు గురికి ఓ సెక్స్ కుంభకోణంలో పదేళ్ళపాటు జైలు శిక్ష విధించింది. 2006లో జమ్మూ కాశ్మీర్‌లో ఈ సెక్స్ కుంభకోణం సంచలనం సృష్టించింది. మైనర్ బాలికలను ప్రలోభాలకు గురిచేసి పడుపు వృత్తిలోకి దించుతున్నట్టు రెండు సీడీలు పోలీస్‌లకు చిక్కడంతో ఈ కుంభకోణం బైట పడింది. ప్రలోభాలకు గురిచేసిన బాలికలను అత్యున్నత సైనిక, పోలీస్, ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులకు కూడా సరఫరా చేసి లైంగికంగా వాడుకొంటున్నారనే ఆరోపణలు చుట్టుముట్టాయి. కొందరు మంత్రులు కూడా అందులో ఉన్నారనే ఆరోప ణలు రావడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించి, చండీగఢ్ కోర్టుకు మార్చారు. ఈ ఆరోపణలపై అప్పటి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా రాజీనామా చేసినా, గవర్నర్ ఎన్ ఎన్ వోహ్రా ఆమోదించలేదు.
ప్రపంచంలోనే అత్యధికంగా సుమారు ఏడు లక్షల మంది సైనికులు మోహరించిన ప్రాంతం కాశ్మీర్‌లోయ. సుమారు నాలుగు దశాబ్దాలుగా లోయను కలచి వేస్తున్న ఉగ్రవాద సమస్యను పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ పరమైన చొరవ కన్నా సైనికులపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో సమస్య మరింత క్లిష్టంగా మారుతున్నదే గాని పరిష్కారం కనబడటం లేదు. సైనికులు, పోలీస్‌లు సాగిస్తున్న అకృత్యాల గురించి ఎవరు ప్రశ్నిచినా వారిని- ‘దేశ ద్రోహులు, తీవ్రవాదులకు మద్దతుదారులు, పాకిస్తాన్ అనుకూలురు’ అనే ముద్ర వేస్తున్నారు. సెక్స్ కుంభకోణంలో శిక్ష నుండి తప్పిం చుకోవాలని ఆ ఉన్నతాధికారి కోర్టులో చేసిన వాదన గమ నార్హం. ‘ఆమె మైనర్ అని తెలియక అపచారం చేశాను. నేను ఎన్‌కౌంటర్లలో 40 మంది తీవ్రవాదుల్ని చంపాను. గనుక నాకు శిక్ష లేకుండా చేయండి’ అంటూ ఆయన అభ్యర్థించారు.
కాశ్మీర్‌లోయలోని ప్రజలందరినీ ఉగ్రవాదులకు మద్దతుదారులనే విధంగా నేడు చిత్రీకరణ జరుగుతున్నది. ఈ పేరుతో వారి పట్ల వివక్ష పూర్వక ధోరణి ప్రద ర్శిస్తున్నారు. 1980వ దశకంలో మొదటిసారిగా పాకిస్థాన్ నుండి ఇక్కడకు ఉగ్రవాదులు చొరబడటం ప్రా రంభమైనది. అయితే, కేంద్ర ప్రభుత్వం పాకిస్థాన్ ప్రేరేపిత తీవ్రవాదులను అణచివేయడంలో స్థానిక ప్రజల సహకారం తీసుకోకపోవడంతో క్రమంగా పరిస్థితులు అదుపు తప్పుతూ వచ్చాయి. పాకిస్థాన్ నుండి తీవ్ర వాదులు ఇక్కడకు రావడం తగ్గి, స్థానిక యువకులనే పాకిస్థాన్‌కు తీసుకు వెళ్లి, తీవ్రవాదంతో శిక్షణ ఇచ్చి, వారిని తిరిగి మనదేశంపైకి పంపిస్తున్నారు.
వాజపేయి ప్రధానిగా ఉన్న కాలంలోనే ఈ సమస్య పరిష్కారానికి నిజాయతీతో ప్రయత్నం జరిగింది. తీవ్రవాద సమస్య ప్రారంభమైన తర్వాత శ్రీనగర్‌లో భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఏకైక ప్రధాన మంత్రి వాజపేయి కావడం గమనార్హం. సమస్య పరిష్కారంలో మొదటగా కాశ్మీర్ ప్రజలను విశ్వాసంలోకి తీసుకొనే ప్రయత్నం ఆయన చేశారు. ఆయన ప్రయత్నాలు సానుకూలమైన ఫలితాలు ఇవ్వడం ప్రారంభమయ్యాయి కూడా. ఆ తర్వాత స్థానిక యువకులు పాకిస్థాన్ అనుకూల ఉగ్రవాద సంస్థలలో చేరడం తగ్గింది. దాంతో తిరిగి పాకిస్థాన్ నుండి ఉగ్రవాదులను మనదేశంలోకి పంపడం ప్రారంభమైనది. కేంద్ర, రాష్త్ర ప్రభుత్వాలు ఇటువంటి పరిస్థితులలో అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవలసిందే. కానీ భద్రత దళాలే సమస్యకు పరిష్కారం అన్నట్లు వ్యవహరించడం, వారు దేశంలోని చట్టాలకు అతీతులు అని భావించడం, ఉద్యోగ విరమణ చేసిన కొందరు అధికారులకు సమస్యను వదిలివేసి రాజకీయ నాయకత్వం ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉండటంతో సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. భద్రత దళాలపైనే ప్రభుత్వాలు ఆధారపడడంతో వారి అకృత్యాలను ప్రశ్నించే సాహసం చేయలేక పోతున్నాయి. ఫలితంగా స్థానిక ప్రజల విశ్వాసాన్ని కోల్పోతున్నామని పాలకులు మరచి పోతున్నారు.
కాశ్మీర్‌లోయలో పరిస్థితులు విషమించడం పట్ల ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది జనవరిలో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఫ్తీ కలసి సైనిక చర్యను కాకుండా రాజకీయ చర్యకు ఉపక్రమించాలని అభ్యర్ధిం చారు. ఆ తర్వాత పలు సందర్భాలలో ఈ విషయమై ఆమె ప్రధానికి విజ్ఞప్తులు చేస్తూనే వచ్చారు. మొదట్లో అకస్మాత్తుగా లాహోర్‌లో దిగి పాకిస్థాన్ నేత నవాజ్ షరీఫ్ కుటుంబంతో గడపడం ద్వారా ప్రధాని మోడీ దౌత్య పరంగా సంచలనం కలిగించారు. కానీ ఆ తర్వాత ఈ విషయమై ఆయన చెప్పుకోదగిన చొరవ తీసుకున్నట్లు కనబడటం లేదు. పాకిస్థాన్ విషయంలో తమకు మించిన అనుభవం గలవారు లేరని భావించే కొందరు అధికారులు ప్రధానిని తప్పుదోవ పట్టిస్తున్నారనే అభిప్రాయం చాలామందిలో కలుగుతోంది. విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్, విదేశాంగ శాఖ ఉన్నతాధికారులు ఈ విషయంలో ప్రేక్షక పాత్ర వహించవలసి వస్తున్నది. నేడు కాశ్మీర్ లోయలో జరుగుతున్న సంఘటనల గురించి మనం వింటున్న పలు వార్తలు సైనికాధికారులు వ్యాప్తి చేస్తున్నారు. అవన్నీ వాస్తవాలు అని చెప్పలేము.
కాశ్మీర్‌లో ప్రజలు అనేక అణచివేత చట్టాల పరిధిలో దుర్భర జీవితం గడుపుతున్నారు. తాము వివక్షకు గురవుతున్నామని వారు భావించే పరిస్థితి ఏర్పడింది. ఉదాహరణకు సైనికులపై రాళలు రువవుతున్న యువకులపై పెల్లెట్ తుపాకులను ఉపయోగిస్తున్నారు. దేశంలో మావోయిస్టులపైనా గానీ, హింసకు పాల్పడేవారిపై గానీ ఇటువంటి తుపాకులను ఉపయోగించడం లేదు. ఈ విషయమై నిపుణుల అభిప్రాయం తీసుకోమని సుప్రీం కోర్టుఆదేశించినా ప్రభుత్వం నుండి స్పందన లేదు. పెల్లెట్ తుపాకులను వాడుతున్నందున అనేకమంది కంటిచూపు కోల్పోతున్నారు. వీరికి తగు వైద్య సదుపాయాలు లభించడం లేదు. యువకులను భద్రత దళాలు ఇళ్ళనుండి తీసుకునిపోతున్నా, వారి ఆచూకీ చెప్పే నాథుడే లేడు. గత మూడు దశాబ్దాలుగా కనీసం పదివేల మంది యువకులు అదృశ్యమైన్నట్లు వారి తల్లితండ్రుల సంఘం ఆరోపిస్తున్నది. వారేమయ్యారు? జైళ్లలో ఉన్నారా ? చనిపోయారా ? సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఇంటినుండి బైటకు వెళ్లి ఆచూకీ దొరకని యువకులు మరెంతమందో ఉన్నారు.
ఇక మహిళలపై లైంగిక వేధింపులకు అంతేలేదు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం కారణంగా ఎటువంటి నేరాలు చేసినా న్యాయ పరిధి నుండి సాయుధ దళాలు తప్పించుకొంటున్నాయి. ఆరు దశాబ్దాలకు పైగా ఈ చట్టం అమలులో ఉన్నా ఎలాంటి ప్రయోజనం సాధించింది? ప్రస్తుతం రక్షణ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గతంలో ఈ చట్టం ఎంతగా దుర్వియోగానికి గురవుతున్నదీ, మణిపూర్ తదితర ఈశాన్యరాష్ట్రాలలో సృష్టిస్తున్న అరాచకాల గురించి ఒక వ్యాసంలో వివ రించారు. ఈ చట్టాన్ని తొలగించ వలసిందే అని ఆమె స్పష్టం చేశారు. ఒక విధంగా ప్రజలను ప్రభుత్వానికి దూరంగా చేయడంలో ఈ చట్టం ప్రముఖ పాత్ర వహి స్తున్నదని చెప్పవచ్చు. ఆ చట్టాన్ని ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల నుండి ఉపసంహరించారు. త్రిపురలో గతంలోనే సిపిఎం ప్రభుత్వం ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు కావడాన్ని నిలిపి వేసింది. అస్సాం తదితర రాష్ట్రాలలో కూడా కొన్ని ప్రాంతాలలో అమలు చేయడం లేదు. కాశ్మీర్‌లోయలో ఈ చట్టం అమలును నిలిపివేయగల సాహసం మోదీ ప్రభుత్వానికి లేకపోవచ్చు. కనీసం ఈ చట్టం ఎలా అమలు జరుగుతున్నది ? ఎటువంటి ఫలితాలు కలుగుతున్నాయి ? వంటి అంశాలను అయినా ఉన్నతస్థాయి నిపుణుల కమిటీతో సమీక్ష జరుపవచ్చు గదా ? ప్రపంచంలోనే అత్యంత పాశవికంగా చట్టాన్ని అమలు చేయలేకపోతే దేశ రక్షణ సాధ్యం కాదనే నిస్సహాయ స్థితికి ప్రభుత్వాలు ఎందుకు వస్తున్నాయి ?
తమ అకృత్యాలను కప్పిపుచ్చుకోవడం ద్వారా తమ చర్యలు ఎవ్వరికీ జవాబుదారీ కాకుండా చేసుకునేలా భద్రతాదళ ఉన్నతాధికారులుచేస్తున్న ప్రయత్నాలను ప్రశ్నించే సాహసం ఎవరూ చెయలేక పోతున్నారు. ప్రపంచంలో ఎక్కడ కూడా ఉగ్రవాద సమస్యను స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా, వారి మద్దతు లేకుండా కేవలం భద్రత దళాలపై ఆధారపడి పరిష్కరించిన ఉదంతం లేదని గమనించాలి. ఈ విషయమై ఇరాక్, ఆఫ్ఘానిస్తాన్‌లలో అమెరికా చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఆ ప్రభుత్వానికి విషమ సమస్యలుగా పరిణమించడాన్ని చూస్తున్నాము. ప్రపంచం మొత్తంలో ఉగ్రవాద సమస్యను ఒక విధంగా పరిష్కరించిన ఘనత పంజాబ్ పోలీస్‌లకు దక్కుతుంది. అక్కడ ఖలిస్థాన్ ఉగ్రవాదులను అణచడంలో సైనికుల జోక్యాన్ని అనుమతించలేదు. కేపీఎస్ గిల్ సారథ్యంలో పంజాబ్ పోలీస్‌లు ఈ అనితరమైన కార్యాన్ని సాధించారు. అందుకు అప్పటి పంజాబ్ ప్రభుత్వం అండగా నిలిచింది. ఉగ్రవాదంతో బాధపడుతున్న ప్రజలను సమీకరించి, వారు సైతం గళం విప్పేటట్లు చేయడం ద్వారా ఈ విజయం సాధించారని గమనించాలి. శ్రీలంకలో ప్రపంచంలోనే అత్యంత కిరాతకమైన చర్యలు పాల్పడిన ఎల్‌టిటిఇని ఆ దేశ ప్రభుత్వం తుదముట్టించినా అందుకు భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది. లక్షలాది మంది నిరాయుధ ప్రజలపై కిరాతకంగా అణచివేతను ప్రదర్శించ వలసి వచ్చింది. అందుకు చైనా అందించిన వ్యూహాత్మక సహకారం కారణం అని అందరికీ తెలిసిందే.
పాకిస్థాన్ నేరుగా మనతో పోరాటం జరుపకుండా ఉగ్రవాద మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం. మనం కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించకుండా పాకిస్థాన్ ఎత్తుగడలో చిక్కి మన ప్రజలనే మనం దూరం చేసుకొనే పరిస్థితి కల్పిస్తున్నామని గ్రహించాలి. గత రెండు సంవత్సరాలుగా సరిహద్దులో కాల్పులు పెరుగుతున్నాయి. అమాయకులైన గ్రామస్థుల మరణాలు ఆగడం లేదు. పాకిస్థాన్ ఉగ్రవాదులు నేరుగా మన సైనిక స్థావరాలపై దాడులు జరుపుతున్నారు. మనం ఎంతో ఘనకార్యంగా చెప్పుకొంటున్న సర్జికల్ స్ట్రైక్స్ తర్వాతనే పాకిస్థాన్ సైనిక దుశ్చర్యలు పెరిగిపోవడం గమనార్హం. ఈ విషయమై ప్రభు త్వం దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు కనిపిస్తున్నది.
మరోవంక భారత దేశం ఇటీవల కాలంలో అమెరికాకు మరింత దగ్గర అవుతున్నదనే సంకేతం వెళ్లడంతో సరిహద్దులో భారత్‌కు వ్యతిరేకంగా చైనా, పాకిస్థాన్ కుట్రపూరితంగా ఒకటవుతున్నాయి. ఈ పరిస్థితి కూడా కాశ్మీర్ లోయలో పరిస్థితులను ప్రభావితం చేస్తున్నాయ. గతంలో వాజపేయి ప్రారంభించిన పక్రియను కొన సాగించమని మెహబూబా ముఫ్తీ చేస్తున్న విజ్ఞప్తులకు ఇప్పటికైనా ప్రధాని స్పందించాలి. ఒక మాజీ నిఘా అధికారిని చర్చల పక్రియ ప్రారంభం కోసం అంటూ నియమించడం వల్లన ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. వాజపేయి హయాంలో ఎల్‌కె అద్వానీ వంటి సీనియర్ నేతకు కాశ్మీర్ బాధ్యత అప్పచెప్పడం గమనార్హం. గతంలో రాజీవ్ గాంధీ కూడా కేంద్ర మంత్రి రాజేష్ పటేల్‌కు ఇటువంటి బాధ్యత అప్పచెప్పారు. ఉద్యోగ విరమణ చేసిన అధికారులు ఎప్పుడూ ప్రజలను దృష్టిలో ఉంచుకుని వ్యవహరించలేదు. అది కేవలం రాజకీయ నేతలకే సాధ్యం. రంజాన్ సందర్భంగా కాల్పుల విరమణ అమలు జరపాలని అఖిల పక్ష సమావేశం చేసిన చేసిన విజ్ఞప్తి పట్ల కొందరు సీనియర్ బిజెపి నాయకుల స్పందన చూస్తే ఈ సమస్య పట్ల వారిలో స్పష్టమైన అవగాహన లేనట్లు భావించక తప్పదు.

-చలసాని నరేంద్ర 98495 69050