మెయిన్ ఫీచర్

అబద్ధమాడకూడదు (ప్రార్ధన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామెతలు -19:5 - ‘అబద్ధములాడువాడు తప్పించుకొనడు’
స్వతహాగా చిన్ననాటి నుండి అబద్ధాలాట మొదలౌతుంది. చిన్నచిన్న విషయాలలో కూడా అబద్ధాలాడతారు. హోంవర్క్ అయ్యిందా?.. ఆ.. చేశా. -చెప్పిన పని అయ్యిందా? ఊ... అయ్యింది -అంటూంటారు. పిల్లల ఆ.. ఊలలో.. ఆహా ఉహూలలో.. లేదు కాదు అనే మాటల్లో ఏది ఎంత వరకు నిజమో పెద్దలకు అర్థమై పోతుంది. స్కూల్ విషయాలలో ఎన్ని అబద్ధాలు, కాలేజీ ఫీజుల విషయాలలో అబద్ధాలు. ఎక్కడెక్కడో తిరిగి కాలేజీకి వెళ్లామని అబద్ధం చాలా తేలిగ్గా చెప్పేస్తారు. తల్లిదండ్రులు కూడా స్కూల్, కాలేజీలలో చదివారన్న సంగతి మరచిపోతారు. కాని తల్లిదండ్రులకు పిల్లలు ఆడే అబద్ధాలు ఇట్టే తెలిసిపోతాయి. ఆలోచనలు - దిగులు, గుండెల్లో బాధ మొదలౌతుంది. కొంతమంది తల్లిదండ్రులు మనసు లోపలనే దిగులుతో కుమిలిపోతుంటారు. కొంతమంది శిక్షిస్తారు. పిల్లల భవిష్యత్ ఏవౌతుందోనన్న భయం. చెడు సహవాసాలు ఎక్కువై ఏమైపోతారో అన్న భయం వెంటాడుతూ ఉంటుంది.
విద్యార్థులైన వారు గ్రహించాల్సిన విషయం ఒకటి ఏమిటంటే - తల్లిదండ్రులకు మీ అబద్ధాలు తెలియక కాదు గాని - ఎలా స్పందించాలో తెలియక. ఏమంటే ఏవౌతుందో?నన్న బాధతో, ఆలోచనలతో గుండె బరువై వౌనులౌతారు. చదువుకునే సమయాలలో ధ్యాసపెట్టి చదివితే అబద్ధాలు ఆడవలసిన అవసరం ఉండదు. మంచి ఉద్యోగాలలో మంచి కుటుంబాలతో సంతోషంగా జీవితమంతా గడపవచ్చు. లేకుంటే అబద్ధాల బతుకు జీవితాంతం బతకాలి. చాలీచాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకోలేక సతమతమవ్వాల్సిందే.
సాధారణంగా మానసిక వైద్యులు అబద్ధాలు 25 రకాలు అంటారు. ఉన్నదానికంటె ఎక్కువగా చెప్పటం.. లేనిది ఉన్నట్టు చెప్పటం.. తెలిసింది తెలియదనటం.. తెలియని దానిని తెలిసిందనటం.. భయంతో ఆడే అబద్ధాలు.. చేసిన తప్పులు కప్పిపుచ్చే అబద్ధాలు.. మనవి కాని వస్తువులు మనవని చెప్పటం.. ఒకచోట ఉండి మరొకరి పేరు చెప్పటం.. సినిమా థియేటర్‌లో ఉండి క్లాస్‌లో ఉన్నానని చెప్పటం, తిని తినలేదనటం.. తాగి తాగలేదనటం.. డబ్బులు ఎన్ని ఉన్నా బిచ్చగాళ్లకు లేవని చెప్పటం... - ఇలా రోజుకు సగటున 4 అబద్ధాలు ఆడుతారట. ఎదుటి వ్యక్తులు రోజుకు ఎన్ని అబద్ధాలు చెప్తారు? అని ప్రశ్నిస్తే.. సుమారుగా 10 నుంచి 20 వరకూ అని సమాధానం వస్తుంది. అదే మీరు? అంటే ఎంతా? ఒకటీ రెండూ అని తేలిగ్గా చెప్పేస్తారు. అది కూడా అబద్ధమే కదా.
‘నూరు అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు’- అబద్ధాలతో వివాహ వ్యవస్థ గట్టి పడుతుందా? అన్నది ఆలోచించరు. అప్పటికప్పుడు ఏదో అబద్ధం ఆడేయటం.. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చటానికి మరో అబద్ధం. ఆ అబద్ధానికి మరో అబద్ధం తోడు - ఇలా జీవితాంతం అబద్ధాల ప్రహసనం కొనసాగుతూనే ఉంటుంది. ఆ అబద్ధాల సంసారం చివరికి నరకప్రాయమవుతుంది. ఇన్ని అబద్ధాలు ఆడి ఆడి ఆఖరికి ‘క్రానిక్ లయ్యర్స్’గా మారిపోతారు.
* * *
దేవుడు సత్యవంతుడు, కృపాసత్య సంపూర్ణుడు.
సాతానుడు అబద్ధమునకు జనకుడు. అబద్ధీకుడు. అబద్ధాలు నేర్పించి ఆడిస్తుంటాడు. అబద్ధాలు చివరకు నష్టాలపాలు, కష్టాలపాలు చేసి జైల్లో పడవేయిస్తాయి. అబద్ధీకులు అగ్నిగుండంలో పడవేయబడతారని బైబిల్ (ప్రకటన 21:8) చాలా స్పష్టంగా తెలియజేస్తోంది. ‘అబద్ధమును ప్రేమించి జరిగించువాడు పరలోక రాజ్యం వెలుపల ఉండవలసిందే’ - ప్రకటన 22:15.
అబద్ధీకులు అందరూ అంటే చిన్నవారైనా.. పెద్దవారైనా.. చిన్నచిన్న అబద్ధాలైనా.. పెద్దవైనా ఆడేవారు ప్రస్తుతానికి ఈ ‘ఆట’ బాగున్నట్టు ఉంటుంది కానీ దేవుని తీర్పు చాలా కఠినంగా ఉంటుంది.
‘కాబట్టి యేసు - మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై యుండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులనుగా చేయునని చెప్పెను’ - యోహాను 8:31
‘నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు’ - నిర్గమ 20:16
దేవునికి అసహ్యమైనవి అబద్ధాలు.
లేని వాటిని చెప్పే అబద్ధ సాక్ష్యులు, అహంకార దృష్టి, కల్లలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు.. దురాలోచనలు చేయు హృదయము.. అన్నదమ్ముల మధ్య జగడములు పుట్టించేవారు.
‘అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి.. సాధ్యమైతే ఏర్పరచిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనుపరచెదరు.’ - మత్తయి 24:24
మనలను నాశనానికి నడిపే అబద్ధాల ఆట నుండి తొలగి సత్యవంతుడైన యేసు మార్గములో నడుస్తూ నిత్య జీవితం పొందుటకు పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక.

-మద్దు పీటర్ 9490651256