మెయిన్ ఫీచర్

శ్రీగురుభ్యోనమః

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నమోస్తుతే వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయత పత్ర నేత్ర
యేన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః
మహాభారతం అనే తైలముతో జ్ఞానదీపమును వెలిగించి విప్పారిన నేత్రములతో, విశాల హృదయంతో విరాజిల్లు, మనోహర రూప సౌందర్యంతో తనరారే మహాజ్ఞానియైన వ్యాసమునీంద్రులకు నమస్సులు.
వ్యాసమునీంద్రుల నిజ నామం అపాంతరతముడు- ‘అజ్ఞానాన్ని తొలగించేవాడు, ఆత్మభావం కలవాడు’ అని ఆ పేరుకు అర్థం. తల్లి సత్యవతి, పరాశర మహర్షివల్ల యమునా నది ద్వీపంలో ఆమె కన్యాత్వానికి భంగం వాటిల్లకుండా యోజనగంధిగా మార్చి మగబిడ్డను ప్రసాదించాడు. ఆ శిశువే త్రికాల జ్ఞాన సంపన్నుడు, విశేషజ్ఞుడు అయిన వ్యాసదేవుడు.
సత్యవతి పూర్వనామం మత్స్యగంథి. పూర్వజన్మలో చేది దేశ రాజైన ఉపరిచిర వసువు కుమార్తె. శాపవశం కారణంగా మత్స్యరూపంలో ఉన్న అద్రి అనే అప్సరస గర్భంలో జన్మించింది. దాశరాజు (జాలరులరాజు)కు ఆమె దొరికింది. పెంచి పోషించి యవ్వనవతిని చేశాడు. సద్యోగర్భంలో వ్యాసుడు జన్మించాడు. పుట్టుకతో నల్లగా ఉండడంచేత కృష్ణుడని, యమునా ద్వీపంలో జన్మించడం చేత ద్వైపాయనుడనీ, రెంటినీ కలిపి కృష్ణద్వైపాయనుడు అనే పేరుతో ప్రసిద్ధి పొందాడు.
వ్యాసుని తండ్రి, తాత, ముత్తాలందరూ అసామాన్యులు. ముత్తాత వశిష్ఠమహర్షి, బ్రహ్మమానసపుత్రుడు, ప్రజాపతులలో ఒకడు. సప్తఋషులలో ఒకడైన అతడు ఇక్ష్వాకుల కులగురువు. అతని కుమారుడు శక్తి. వ్యాసునికి తాత. శక్తికుమారుడు వ్యాసుని తండ్రి పరాశరుడు. పలు సంహితలు రచించాడు. వేదవ్యాసునిగా నామాంతరం చెందడానికి కారణం- గంపగుత్తగా వున్న వేదరాశిని విభజించి నాలుగు వేదాలుగా రూపొందించిన వ్యక్తి కావడం. అంతేకాక వేద ధర్మాలను సామాన్యులకు అర్థమయ్యేలా చెప్పడంకోసం ఆధ్యాత్మిక, లౌకిక విశేషాలను విశపరుస్తూ పంచమ వేదంగా ప్రఖ్యాతి పొందిన మహాభారతాన్ని, భక్తి మార్గానికి ప్రవచించే మహాభాగవతాన్ని, అష్టాదశ పురాణాలను ప్రస్థానత్రయాన్ని రచించాడు.
వ్యాసుడు ఆర్జించిన జ్ఞాన సంపదను భారతీయ ఆధ్య్మాకత, ఆర్ష సంస్కృతులను పరిరక్షించేందుకు జీవితాన్ని ధారపోసాడు. తాను గతించిన జ్ఞాన విజ్ఞానాలను శిష్యులకు బోధించాడు. ఈ విధంగా గురు పరంపరకు ఆద్యుడుగా నిలిచాడు. ‘తత్త్వం గృహ్ణాతీతి గురుః’ అని గురుశబ్దం వ్యుత్పత్తి. గురువు యొక్క శ్రేష్టత్వం గురించి స్కంద పురాణాంతర్గతమన ‘గురుగీత’లో ఉల్లేఖించబడింది. సాక్షాత్తు శివుడే ఉమాదేవికి గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పినట్లు గురుగీత స్పష్టపరుస్తున్నది. గురువు త్రిమూర్తుల స్వరూపం అంటూనే, ‘గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం నచాన్యోపి తస్మై శ్రీ గురవే నమః’ విశ్వానికీ, గురువుకూ భేదం లేదని గురుగీత చెబుతున్నది. వర్ణాశ్రమ ధర్మాలు, ఆచారాలు, సత్యమార్గాన్ని ఇలా సత్కర్మలన్నిటినీ ఒక్క గురువే బోధించగలడు.
మన సంస్కృతీ సంప్రదాయాలలో గురు శిష్య సంబంధం వెలకట్టలేనిది. పరా - అపరా విద్యల జ్ఞాన ప్రదాత. ఆధ్యాత్మిక జ్ఞానంతోపాటు లౌకిక సంబంధమైన విషయాలను పంచమ వేదంగా చెప్పబడుతున్న మహాభారతంలో వ్యాసుడు చాలా విపులంగా చెప్పాడు. దీనిని భారతీయ విజ్ఞాన సర్వస్వంగా పేర్కొంటారు. వ్యాసుడే మహాభారతాన్ని గురించి చెబుతూ - మానవ జీవితానికి సంబంధించిన విషయాలన్నీ ఇందులో ఉన్నాయి. ఇందులో లేనిది ఎక్కడా ఉండదు.
వ్యాసుడుతాను సముపార్జించిన సమస్త జ్ఞానాన్ని భవిష్యత్తులో మానవాళి అభ్యసించి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్న ఆకాంక్షతో శిష్యులకు బోధించాడు.
గురువును శ్రద్ధగా సేవించి ఉన్నతి పొందినవారిలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఏకలవ్యుడు, సత్యకామ జాబాలి, భక్తకన్నప్ప మొదలైనవారున్నారు. గురువును కాదని తిరస్కరించినవారు పతనాన్ని చవిచూశారు. మనలో ఆత్మజ్యోతి ఉద్దీపనం చేయాలంటే కేవలం సద్గురువు ద్వారానే సాధ్యం అవుతుంది. ఆ సద్గురువులు ద్వారా పొందిన విద్య అసలైన విద్య. అందుకే గురు పరంపరలో మూలపురుషుడైన దేవుని గురుపూర్ణిమ రోజున తలచుకుంటున్నాం, పూజిస్తున్నాం. అలా గురువుని పూజిస్తే జ్ఞాన విజ్ఞాన సముపార్జనా రంగంలో విఘ్నాలుండవని సాక్షాత్ గణపతి ముఖస్థంగా వెలువడిన శ్లోకాన్ని వ్యాసారంభంలోనే ఉటంకించడం ముఖస్థంగా వెలువడిన శ్లోకాన్ని వ్యాసారంభంలోనే ఉటంకించడం జరిగింది. ఈ దివ్యమైన శ్లోకాన్ని వేద విభాగమైన నిరుక్తంలో లిఖించడం జరిగింది. శ్రీ వ్యాస భగవానుని అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు.

-ఏ. సీతారామారావు