మెయిన్ ఫీచర్

ఆచరించవలసింది నిష్కామ కర్మనే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణపరమాత్మ భగవద్గీత, రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలో అర్జునునికి కర్మయోగ మహిమను ఆచరించవలిసిన విధానమును, దానివలన కలిగే ఫలితమును వివరించిన తీరు అర్జునునికే గాక అన్ని యుగాలకూ అద్భుత సందేశమిది . అన్నివేళలా అందరూ ఆచరింపదగినది కూడా.
అర్జునా! కర్మలనాచరించు వేళల్లో, ఆ కర్మనెట్లు చేయాలనే వివేకమునే బుద్ధి అంటారు. అలాంటి బుద్ధితో గూడి కర్మలనాచరించినచో జీవుడు కర్మబంధనాలలో చిక్కుకొనడు. కర్మచేసిననూ బంధింపబడరాదు. గీతాచార్యుడు 2వ అధ్యాయం 40వ శ్లోకం ద్వారా వివరించారు.
శ్లో॥ నేహాభిక్రమ నాశోస్తి- ప్రత్యవాయోనవిద్యతే
స్వల్ప మప్యస్య ధర్మస్య- త్రాయతే మహతో భయాత్’ అంటూ కర్మయోగం ప్రారంభమైనచో అది నిష్ఫలము కాదు. కానేరదు. అది పూర్తికావడానికి ముందుగా, ఏ కారణం చేతనైనను మధ్యలో నిలిచిననూ దోషములేదు. ఈ కర్మయోగానుష్ఠానము ఒక ధర్మము. ఆ ధర్మమే సంసార భయమునుండి రక్షించుచున్నది.
వివేకముతో గూడిన ఈ కర్మయోగమునుప్రారంభించాలి. ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది సత్ఫలమును గలుగజేస్తుంది.కర్మయోగాన్ని మధ్యలో వదిలేసినా ఏ దుష్ఫలితాన్ని ఇవ్వదు. అది ఎలాగంటే - విత్తనమును నేలలో నాటిన తరువాత చివరి వరకూ నీరు, ఎరువులచే పోషించిన మాత్రముచే ఫలమును చక్కగా అందిస్తుంది. మధ్యలో నీటిని పోయడం మానివేసినా కూడా ఆ మొలక అప్పటి వరకు చక్కగా ఎదుగుతుంది. ఒకవేళ నీరు అసలేమాత్రము దొరకకపోతే ఆ మొక్క కాస్త ఎండిపోయి ఫలితమునివ్వదు. దానివలన దోషమేదీ కలుగదు. ఇదియే నిష్కామకర్మయోగము అని భగవానుడుపదేశించినాడు.
ఒక నిప్పురవ్వ ఒక భయంకరమైన అరణ్యమును బూడిదచేసినట్లుగా, చిన్న ఓడ విశాల సముద్రమును దాటించునట్లు నిష్కామకర్మాచరణమే ఒక పరమార్థ సాధనగా జీవులను కాపాడుతుంది. సాధన చేస్తున్న కొలది ఫలితంలో మార్పు వస్తుంటుంది. కాని సాధనను మానివేస్తే ఫలితం రాదు. అందుకే ఎపుడైనా సాధన మధ్యలో ఆగిపోతే తిరిగి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగాసాధన మొదలెట్టాలి.
సాధనను విడువక ఆచరిస్తూ వుండాలి. కర్మానుష్ఠానంలో పరిపూర్ణ విశ్వాసం వుంచాలి. ఔషధం కొంచమైననూ వైద్యుడు చెప్పిన మోతాదులో సేవించినపుడు రోగమేవిధంగా తగ్గుతుందో, ఆ రీతిలో కర్మలు ఆచరించాలి. కర్మయోగమును ఒక ధర్మంగా స్వీకరించి ఆచరణలో చూపమని కృష్ణుడు చెప్పాడు. కర్మయోగాన్ని మునులకూ, యోగులకూ, ఋషులకే కాదు సామాన్య మానవులు కూడా ఆచరించాలి. చేయంచేవాడు చేసేవాడు కూడా భగవంతుడే ఇందులో నేను ఒక మర బొమ్మను కాని ఈ పని వల్ల వచ్చే లాభం కాని నష్టం కాని నాకు చెందదు. అంతా ఆ పరమాత్మదే అనే విశ్వాసాన్ని పెంచుకుంటే అదే కర్మయోగం.
దైవమందు నిశ్చయ బుద్ధి కల్గినపుడు, మనసెప్పుడు దైవమును తప్ప అన్యమును ఆపేక్షించదు. దైవమను లక్ష్యమందే ఏకాగ్రంగా ఉంటుంది. అదే నిశ్చయాత్మక బుద్ధి అని పెద్దలు చెప్తారు.
లౌకిక ఆనందాన్ని కాక అచంచలమైన ఆనందాన్ని ఇచ్చే పరమాత్మయందే మనసును నిలిపినట్లు అయతే అదే కర్మయోగం. మనసు బహు చంచల స్వభావి. దాన్ని మనం భగవంతునిపైన మాత్రమే నిలిపినట్లయతే మంచి ఫలితాలను చూడగలం. మరికొందరు సర్వమూ భగవంతుడే కనుక ఏ వస్తువు పైన అయనా చంచల మనస్సుతో కాక అచంచలంగా ఏకాగ్రంగా మనసు నిలిపినా కూడా భగవంతుని దయ తప్పక కలుగుతుందంటారు.
కామ్యకర్మ నిరతుల తీపి మాటలను వినరాదు. అలాంటి వారితో సాంగత్యము- సహవాసము చేయరాదు. పరమాత్మ ఈ సమస్యలకు చక్కని పరిష్కార మార్గమును అర్జునునికి వివరిస్తూ, సత్పురుషుల సాధుపుంగవుల- విరాగుల సాంగత్యమును చేసి, మనసును దైవోన్ముఖముగా గావించు కోవాలి. భోగైశ్వర్య ప్రసక్తి వుంటే ధ్యానం నందు మనస్సు నిలువదు. కర్మయోగ ఫలము దక్కదు. విషయాసక్తిని త్యజించవలెనని తెలిపాడు. అర్జునా! కర్మము చేయుట యందే నీకు అధికారం గలదు గాన ఫలమునాశించుటకు అధికారం లేదని చెప్తూ ‘‘కర్మణ్యేవాధికార్తే, మాధలేషు కదాచనా’ అనే శ్లోకం ద్వారా వివరించాడు. నీవు యోగ నిష్ఠలో- - ధ్యానంలోనుండి సంగమును త్యజించి కార్యము ఫలించిననూ- ఫలించకున్ననూ సమదృష్టిలో నుండి కర్మలను చేయుమన్నాడు. అదియే సమత్వబుద్దియనీ, యోగమనీ ఉపదేశించాడు గీతాచార్యుడు.

-చోడిశెట్టి శ్రీనివాసరావు