మెయన్ ఫీచర్

ఉద్యమాలు చేస్తే ఏం ఒరిగింది..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ఎన్నో ఇబ్బందులు.. అయినా- అధికార,విపక్ష పార్టీల నాయకులు ఎవరికి తోచినట్లుగా వారు ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సహా విభజన చట్టంలో చెప్పిన చాలా విషయాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కొంతమంది నేతలు ‘అమరావతి’ పేరిట కొత్త రాజధాని కట్టవద్దన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాదులో పదేళ్ల పాటు అసెంబ్లీ భవనాలు, ఇతర నిర్మాణాలను వాడుకోవచ్చు. ఏపీకి రాజధానిగా ఎంపిక చేసిన అమరావతి ప్రాంతం భూకంపాలు రాగల ప్రదేశం అని కొందరు హెచ్చరించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినా, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతే కనీసం ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే సరిపోతుందని తెదేపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి వరకూ అన్నారు. వైకాపా సహా ఇతర విపక్షాలు ‘హోదా’ డిమాండ్‌పై ఉద్యమాలు ప్రారంభించడంతో చంద్రబాబు ఇటీవల మాట మార్చారు. ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు. వైకాపా మొదటి నుంచి ప్రత్యేక హోదాయే కోరుతోంది. ‘హోదా’ డిమాండ్ తెరపైకి తేకుంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గ్రహించి చివరికి చంద్రబాబు ‘యూ టర్న్’ తీసుకోక తప్పలేదు.
చూస్తుండగానే నాలుగేళ్లు గడిచిపోయాయి. రాజధాని నిర్మాణంలో గాని, ఇతర విషయాల్లో గాని ఏ పనులూ అనుకున్నట్టుగా జరగడం లేదు. ఇప్పుడు తెదేపా, భాజపాల మధ్య- ‘కేంద్రం ఇచ్చిన నిధుల’కు సంబంధించి లెక్కలు తేడా వచ్చాయి. ఒకరినొకరు నిందించుకుంటున్నారు. తాము కోరిన విధంగా కేంద్రం నిధులు ఇవ్వలేదని, రాష్ట్ర ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ మోసం చేశారని చంద్రబాబు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల తర్వాత ఇపుడు ప్రత్యేక హోదాయే కావాలన్న నినాదం లేవనెత్తారు. మరోవైపు వైకాపా అధినేత జగన్‌మోహన్ రెడ్డి గత కొన్ని నెలలుగా పాదయాత్ర చేస్తూ ‘ప్రత్యేక హోదా’పై ఉద్యమిస్తున్నారు. తన పార్టీకి చెందిన అయిదుగురు ఎంపీల చేత ఆయన రాజీనామాలు చేయించారు. ఇదంతా చూసి, ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ‘హోదా జపం’ చేయాలని చంద్రబాబు నిర్ణయించుకుని, కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. ఈ విషయమై ఉద్యమించాలని ఆయన తన పార్టీ శ్రేణులను ఆదేశించారు. మరోవైపు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కూడా తమకు తోచిన రీతిలో ‘హోదా’పై పోరాటం చేస్తున్నాయి. అందరూ ఉద్యమం చేస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు, ప్రజలకు కొత్తగా ఒరిగింది ఏమీ లేదు.
తెదేపా ఎంపీ సీఎం రమేష్ కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలంటూ ఆమరణ నిరాహారదీక్ష పేరిట కొన్ని రోజులు హడావుడి చేశారు. ఆ తర్వాత ‘కడప ఉక్కు’ గురించి ఎవరూ మాట్లాడడం లేదు.
కేవలం రాజకీయ ఆధిపత్యం కోసం అధికార, విపక్ష పార్టీలు చేస్తున్న ఇలాంటి ఉద్యమాలు ప్రజలకు అవసరమా? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 71 ఏళ్లు గడిచాయి. వెనక్కి తిరిగి చూస్తే ఏ ఉద్యమం వల్ల కూడా ఆంధ్రులకు అనుకున్నంత మేలు జరగలేదు. పైగా అపారమైన ఆస్తి నష్టం, పనిదినాల నష్టం, జన నష్టం జరిగింది. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని 1938 నుంచే జనం డిమాండ్ చేశారు. ‘ఆంధ్రకేసరి’ టంగుటూరి ప్రకాశం పంతులు ‘మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం’ కావాలని పట్టుబట్టారు. అప్పటి కాంగ్రెస్ నాయకుడు భోగరాజు పట్ట్భాసీతారామయ్య- ‘మనకు మద్రాసుతో కూడిన రాష్ట్రం ఎప్పటికిరాదనీ, తమిళనాడు నేత రాజగోపాలాచారి అందుకు ఒప్పుకోర’ని చెప్పినా ప్రకాశం వినలేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా ఆంధ్ర రాష్ట్రం గురించి ఏ నిర్ణయం జరగలేదు. చివరకు 1953లో పొట్టి శ్రీరాములు 53 రోజులు నిరాహారదీక్ష చేసి ఆత్మార్పణ చేసుకున్నారు. ఆంధ్ర ప్రాంతమంతా భగ్గుమంది. పెద్ద ఉద్యమం జరిగింది. ఆస్తినష్టం, ప్రాణనష్టంతో ప్రజాజీవనం స్తంభించిపోయింది. అప్పుడు ‘జె.పి.పి. కమిటీ’ అంటే- జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్, పట్ట్భాలతో ఏర్పాటైన కమిటీ జస్టిస్ వాంఛూకి ఆంధ్ర రాష్ట్ర సమస్యపై నివేదిక సమర్పించమని కోరింది. చివరికి మద్రాసు నగరం లేకుండా కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. మద్రాసుతోపాటు కొన్ని తెలుగు ప్రాంతాలను ఆంధ్రులు వదులుకోవలసి వచ్చింది. ఈ నిర్ణయం ప్రకాశం పంతులుకు నచ్చలేదు.
1956వ సంవత్సరంలో భాషాప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేశారు. నైజాం పాలనలోని తెలుగు ప్రాంతాలు, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం కలిపి ‘ఆంధ్రప్రదేశ్’గా నూతన రాష్ట్ర అవతరణ 1956 నవంబర్ 1న జరిగింది. ఈసారి బళ్ళారి ప్రాంతం (తెలుగు జిల్లా) కర్ణాటక రాష్ట్రంలో కలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ నుండి తాము విడిపోవాలని తెలంగాణ ప్రాంతం వారు మొదటి నుంచీ కోరుకున్నారు. అప్పుడు వాళ్ళను సంతృప్తి పరచేందుకు నాయకులు ‘ముల్కీ’ నిబంధనలు తెచ్చారు. దీని గురించి ఆందోళన చెందిన ఆంధ్ర ప్రాంతం వారు తాము విడిపోతామని ఉద్యమం చేశారు. ‘జై ఆంధ్ర’ పేరిట ఉద్యమం సాగినా- ఆంధ్రులు విడిపోవాలన్నప్పుడు అలా జరగలేదు. ఆ తరువాత డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమం చేశారు. ఆ ఉద్యమం శాంతిభద్రతల సమస్యను సృష్టించింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ- ‘ఆంధ్ర రాష్ట్రం ఏ మాత్రం విడిపోవడానికి వీలులేద’ని ఆ ఉద్యమాన్ని అణచివేశారు.
ఇక, విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలని పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడు ఉక్కు శాఖామంత్రిగా ఆంధ్రుడైన నీలం సంజీవరెడ్డి ఉన్నారు. అయినా ఉక్కు ఫ్యాక్టరీ సులభంగా రాలేదు. ఉద్యమం తీవ్రరూపం దాల్చాక ‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ నినాదం సాకారమైంది. ఆందోళనలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే తప్ప పాలకులు స్పందించడం లేదు. ఇందుకు విశాఖ ఉక్యు ఫ్యాక్టరీ ఓ ఉదాహరణ. కానీ, తమిళులు ఆంధ్రుల కంటే ముందు సేలం ఉక్కు ఫ్యాక్టరీని సునాయాసంగా సాధించారు. కాలక్రమంలో తెలంగాణలో మళ్లీ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం మొదలైంది. ఈసారి కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమం కొత్తపుంతలు తొక్కింది. తెలాంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో జరిగిన ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీలు బాసటగా నిలవడంతో చివరికి 2014లో ఆంధ్రప్రదేశ్‌ను విభజింపక తప్పలేదు. పటిష్టమైన ఉద్యమంతో తెలంగాణ వాసులు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ‘సమైక్య రాష్ట్రం’ అంటూ ఆంధ్ర ప్రాంతం వారు చేసిన ఆందోళన విఫలమైంది.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో- కాపు కులస్థులకు ‘బీసీ’ హోదా గురించి ఉద్యమం మొదలైంది. తెదేపా అధినేత చంద్రబాబు గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే కాపులను బీసీ జాబితాలో చేరుస్తామని ప్రకటించారు. ఆ హామీ కార్యరూపం దాల్చకపోవడంతో కాపులు ఉద్యమించారు. ఈ ఉద్యమం సందర్భంగా తుని వద్ద విధ్వంసక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంత జరిగినా కాపులకు రిజర్వేషన్ల హామీ ఇంకా అమలుకు నోచుకోలేదు. గత నాలుగు సంవత్సరాలుగా కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏ పార్టీ వారూ మాట్లాడలేదు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం ప్రకటించడంతో నేతల్లో కదలిక వచ్చింది. ఆ నివేదిక రాకుంటే కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎలాంటి ఆందోళనలూ ప్రారంభమై ఉండేవి కావు. ఎన్నికలు సమీపిస్తున్నందున అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఉక్కు ఫ్యాక్టరీపై పోరాడతామని ప్రకటిస్తున్నాయి.
అప్పుడప్పుడు జరిగే ఇలాంటి ఉద్యమాలు ప్రజలకు అవసరమా? పరిపాలనా వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులు, మున్సిపాలిటీలు, పంచాయితీలు ఉన్నాయి. సమస్యలు తీర్చవలసిన బాధ్యత ప్రజాప్రతినిధులది, రాజకీయ నాయకులది, పార్టీలది. విద్యార్థులను, ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, సామాన్యులను కలుపుకొని ఉద్యమాలు చేయాలా? జనం ఆకాంక్షలు తీర్చకపోవడం ప్రజాప్రతినిధుల వైఫల్యం కాదా? నిజంగా ప్రజల క్షేమం ఆలోచించే వారైతే పాలకులు మాత్రమే ఉద్యమాలు, ఆందోళనలు చేయాలి. జన జీవనాన్ని స్తంభింపజేసి ఆస్తినష్టం, జన నష్టం కలిగించాలా? ప్రజల బాగోగులు చూస్తూ, వారికి పాలకులు రక్షకులుగా ఉండాలి. ఒకవేళ ఉద్యమాలు అనివార్యమైతే రాజకీయ నాయకులే ముందుండి పోరాడాలి. రాజకీయ కోణంలో ప్రాంతీయ ధోరణులను రెచ్చగొట్టడం సబబు కాదు. మనం భారతదేశంలో భాగం కానట్టు ‘కేంద్రంపై పోరాటం చేద్దాం’ అని కొందరు నేతలు రెచ్చగొడుతున్నారు. జాతీయవాదానికి భంగం కలిగించడం చాలా ప్రమాదకరమైన పోకడ. ‘యుద్ధం’ అంటే మన సైన్యం చేస్తుంది. ప్రజలంతా కత్తులు, కర్రలు పట్టుకోరు కదా! అన్ని ఉద్యమాలు ప్రజాప్రతినిధులే చెయ్యాలి. దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా ధర్నాలు, రాస్తారోకో, రైల్‌రోకో, రోడ్లపై వంటవార్పూ వంటి ఆందోళనలను నిషేధించాలి. ఆందోళనల కోసం ప్రత్యేకంగా ‘్ధర్నాచౌక్’లు ఏర్పాటు చేయాలనడం విడ్డూరం. మనం ఎక్కడికి పోతున్నాం? ఉద్యమాల పేరిట జన జీవనాన్ని ఇక్కట్లకు గురి చేయడం సరికాదు. ‘ప్రత్యేక హోదా’ కోసం ఢిల్లీలో ఉద్యమిస్తేనే ఫలితం ఉంటుంది. ఏ స్థాయిలో జరగాల్సిన పోరాటాలు ఆ స్థాయిలోనే జరగాలి.

-ఎ.పట్ట్భారామం 98663 48976