మెయిన్ ఫీచర్

సాధనే ముక్తిమార్గం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవునిలో నియంత్రణాశక్తి అవసరం. మనస్సును నియంత్రణలో ఉంచితే ప్రశాంత హృదయం సిద్ధించి ఇంద్రియములను జయించడానికి దోహదకారి అవుతుంది. యోగం అనగాకలయిక. జీవ బ్రహ్మైక్యం . యోగసిద్ధి కలవానికి మట్టిగడ్డరాయి, బంగారం మొదలైన వాటిని సమానంగా చూసే అలవాటు వుంటుంది. అదే ఆత్మజ్ఞానము. వేరు వేరుగా వున్న సమస్త ప్రాణులందు ఏకమై నాశనరహితమై అవిభక్తమై ఉండే ఆత్మవస్తువును చూడడానికి సాత్త్విక జ్ఞానం అవసరం. తద్వారా మాత్రమే ఆత్మదృష్టి దైవదృష్టి కలగటానిక ఆస్కారం ఏర్పడుతుంది.
‘బీజం మాం సర్వభూతానాం’’ ప్రాణుల యొక్క బీజం పరమాత్మ. ఎక్కువ తక్కువ అనే భేదం లేదు. ‘అనంత వీర్యామిత విక్రమః’ విశ్వరూప సందర్శనచే భగవానుని అపరిమిత శక్తి సామర్థ్యాలను , విశేషాలను మమత, అనురాగ రసితుడై ప్రార్థనలో లీనమైనవాడు అర్జునుడు.్భఊలోక రాజ్యం, ముల్లోకముల రాజ్యాధిపత్యం తనకు వద్దని తెలియ జేశాడు. నాకు మమకారం, బంధుప్రీతి లేదు.రాజ్యం, భోగం నశ్వరమైనవి. అని తన శారీరిక మానసిక వికారాలను వ్యక్తపర్చటమే ఆయన అంతరంగ వికాసం. భగవద్గీత పుట్టుకకు అటువంటి భావనే నాందీ వాచకం.
ప్రేమ, ఆప్యాయత, కరుణ, దయ, వాత్సల్యం , అనురాగం మొదలైన గుణాలను నయం చేసే ఏకైక చికిత్స ఆత్మజ్ఞానం. సుఖదుఃఖాలను సహజం. మానవ ప్రకృతిలో అవి అంతర్భాగాలు. వాటిని అనుభవించడంలో సమదృష్టి అవసరం. జ్ఞానం మోక్షకారకం. ‘రహస్యం హ్యేతదుత్తమమ్’ నిష్కామ కర్మ మానవునిలో భక్తిని ప్రేరేపిస్తుంది. దానిని సాధించాలంటే ప్రేమ, భక్తి, నిశ్చలత ఎంతో అవసరం.
ఆత్మజ్ఞానం మానవుని నరనరాలలోను వెలుగులు నింపుతుంది.అజ్ఞానాన్ని నశింప చేస్తుంది. చిద్రూపస్వరూపమైన ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఉపనిషత్తులలో ఉంటేవి గూఢ సిదాధంత తత్త్వాలను సామాన్య మానవునకు అర్థం కావు. అందువల్లనే సమస్త జనులకు ఉపయుక్తమైన గ్రంథము భగవద్గీత.
సర్వ మానవ కోటి కి చాలా తేలికగా సులభంగా అర్థమయ్యే రీతిలో వేదం, వేదాంతము, ఉపనిషత్తులు, తత్త్వము, బ్రహ్మజ్ఞానం మున్నగు అనంతమైన విశేషాలను శ్రీకృష్ణుడు చక్కగా విశదపరిచాడు. గీతాశాస్త్రం ఎల్లపుడూ వింటూ, పఠిస్తూ ఉంటే మానవ జన్మకు దైవ సహాయం లభించినట్లే. అట్టి మానవుడు దేవునితో సమానం.
కార్యసిద్ధి, విఘ్ననాశము, సుఖప్రాప్తి యోగక్షేమం సంతాన యోగము, భూతప్రేత బాధానివారణ, శారీరిక బాధా నివారణ వైభవప్రాప్తి లాంటి అనేక సుగుణాలు ఆత్మజ్ఞానం ద్వారా ఉద్దీప్తం చెందుతాయి. అట్టి అద్భుత సుగుణాల సమూహమే మహామంత్రం. శ్లోకములతో కూడికతో ఒప్పారే భగవద్గీత.
జీవిత రథాన్ని విషయ మార్గములనే బంధనాల నుం విముక్తం చేయాలి. దైవమార్గం వైపు మళ్లించాలి. కౌరవులు అనగా కామ, క్రోథ, లోభ, మోహ, మద,మాత్సర్యాలు పాండవులు అనగా నిర్భయత్వం, భక్తి, శ్రద్ద అనే సద్గుణాలు.
కురుక్షేత్రమే హృదయం. అర్జునుని రథం శరీరంతో సమానం. మమకారంతో యుద్ధ్భూమిలోగల బంధగణాన్ని అర్జునుడు చూసి మానసికవైకల్యం చెందాడు. అర్జునునితో కర్మజానాన్ని ఆత్మజ్ఞానాన్ని తన చక్కని సందేశంతో ప్రవేశింపచేశాడు పరమాత్మ.
పరమాత్ముని సందేశ పూర్వక సలహా అధైర్యాన్ని పోగొట్టింది. పిరికి తనం నశించింది. నీచమగు హృదయదౌర్భల్యాన్ని పోగొట్టుకుని కర్తవ్యోన్ముఖుడిని చేసింది.
యుద్ధ క్షేత్రంలో సమగూడిన బంధుజనులుచూసి నా అవయవములు పట్టు దప్పుచున్నవి శరీరంలో వణుకు మొదలైంది. గాండీవం చేయి జారి పోతున్నది మనస్సు గిర్రున తిరుగుచున్నది అనే మాటల అంతరార్థం స్వజనం స్వజనం అని పలవరించిన అర్జునుని అంతరాత్మ ఘోష.
కాలంతో పాటు మనిషి మారుతాడు.కాల గర్భంలో కలిసిపోయిన గతం కాలంలో జీవించిన వ్యక్తుల పట్ల ప్రేమానురాగాలు అభిమాన పూర్వక స్మృతులు గత స్మృతులు మేలు కలయిక గతజల సేతు బంధనమే/
నొసటి వ్రాతను తుడిచి వేసి, కర్మాతీత, జన్మాతీత కైవల్య పదవీ జీవునకు అనుగ్రహించే కైవల్య ప్రదాయిని సాధించాలంటే మానసిక న్యూనతను పోగొట్టుకుని జ్ఞాన సముపార్జన ద్వారా ఆత్మ తృప్తి పొందటమే ఏకైక మార్గం

- నిమ్మగడ్డ కాశీ విశే్వశ్వర శర్మ 99599080203