మెయిన్ ఫీచర్

దక్షిణ కోరడం...త్యాగగుణం నేర్పేందుకే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోయే ప్రాణాన్ని నిలిపిన సంజీవని ఊదీ. బాబా ఊదీ ఎటువంటి విపత్కర పరిస్థితినుంచైనా పరిష్కరించి భక్తులకు అభీష్టసిద్ధిని కలుగచేస్తుంది. బాబా ధునినుంచి పుట్టిన ఊదీకి సాధ్యంకానిదేదీ లేదు. విశ్వాసం ఉంచాలే కానీ అది ఊపిరిపోస్తుంది. బాబా ప్రసాదించే ఊదీ మహిమాన్వితమైనది. అది కష్టాలనుంచి గట్టెక్కిస్తుంది. ఇబ్బందులనుంచి బయటపడవేస్తుంది. బాబా సంతోషంగా ఉన్నపుడు పాటలు పాడేవారు. అందులో ఊదీ పాట ఒకటి. ‘కళ్యాణ రామ రారమ్ము.. గోనెలతో ఊదీని తేతెమ్ము’. బాబా మిక్కిలి మధురంగా ఈ పాటను పాడేవారు.
ఒకసారి బాబా తన ఆస్తి మొత్తం ‘‘ఒక కౌపీనం, ఒక విడిగుడ్డ, ఒక కఫనీ, ఒక తంబిరేలు గ్లాసు మాత్రమే’’అని నానాసాహెబు చందోర్కర్‌తో చెప్పారు.
బాబా నోరు తెరిచి ఏం అడిగితే అది తెచ్చివ్వటానికి సదా భక్తులు బాబా చుట్టూ కనిపెట్టుకుని ఉండేవారు. బాబా కోరుకుంటే పంచభక్ష్య పరమాన్నాలు వచ్చిపడేవి. కానీ, బాబా అహాన్ని విడిచి షిర్డీ పురవీధుల్లో ‘్భక్షాందేహీ’అన్నారు. బాబా చేతిలోని భిక్షాపాత్ర స్వయంగా అక్షయ పాత్ర. అది భక్తుల కోరికలుతీర్చే చింతామణి. కానీ, బాబా ఏనాడూ తనకోసం ఏమీకోరలేదు. బాబా ఏం చేసినా, ఏది చేసినా భక్తులకోసమే. భక్తులనుంచి కావాల్సినంత ధనాన్ని బాబా దక్షిణగా స్వీకరించినా ఆ మొత్తాన్ని ఆరోజే ఖర్చుచేసేవారు. మరుసటి రోజుకు మళ్లీ ఉత్తచేతులతోనే మిగిలేవారు. బాబా మహాసమాధి చెందటానికి పదేళ్లముందునుంచీ మాత్రమే దక్షిణ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. ఆ పదేళ్లలో బాబాకు వేల మంది భక్తులు లెక్కలేనంత మొత్తాన్ని దక్షిణగా సమర్పించారు. అయితే, మహాసమాధి చెందేనాటికి బాబా కఫనీలో తొమ్మిది రూపాయలు మాత్రమే ఉన్నాయి. వాటిని కూడా లక్ష్మీబాయి శిందేకు నవవిధ భక్తుల్ని బోధిస్తూ దానంగా ఇచ్చేశారు. దక్షిణ రూపంలో వచ్చిన మొత్తంలో కొంత చిలుముకు ఖర్చుపెట్టేవారు. ధునిలో మండించే కట్టెలకోసం మరికొంత వెచ్చించేవారు. మిగతా మొత్తాన్ని బీదలకు పంచిపెట్టేవారు. రూపాయి మొదలుకుని యాభై రూపాయల వరకు బాబా నిత్యం దానం చేసేవారు. బాబా భక్తురాలు రాధాకృష్ణమాయి సలహాతో భక్తులు బాబాకు ఎనె్నన్నో కానుకలు, విలువైన వస్తువులు సమర్పించేవారు. నిజానికి అవేమీ బాబా కోరనివే. అందుకే బాబా వాటివైపు కనె్నత్తికూడా చూసేవారు కాదు. ఎవరైనా విలువైన వస్తువుల్ని కానుకగా ఇవ్వబోతే వారిని బాబా తిట్టేవారు. ‘‘ఈ భక్తులు అనవసరమైన, నిష్ప్రయోజనమైన వస్తువులు తెచ్చుచున్నారు’’అని బాబా వాపోయేవారు. శ్యామా, తాత్యా తదితర భక్తుల కోరికను మన్నించి, భక్తుల అభీష్టాన్ని అనుసరించి బాబా వాటిని కాదనలేక స్వీకరించి వాడాలో ఉంచమనే వారు. భక్తుల సౌకర్యంకోసం వాటిని వినియోగించమని చెప్పేవారు.
ఒక్కోసారి బాబావద్ద పైసాకూడా ఉండేది కాదు. అవసరం వచ్చిందికదా అని బాబా ఎప్పుడుపడితే అప్పుడు భక్తుల్ని దక్షిణ అడిగి తన అవసరాలు తీర్చుకునేవారు కాదు. పొగాకుకోసం, దీపాలు వెలిగించేందుకు అవసరమైన నూనెకోసం డబ్బులు లేకపోతే కనుక మసీదు చావడికి వెనుక వైపు ఉండే సేఠ్‌వద్ద అప్పుచేసేవారు. నగదు అవసరమైనపుడల్లా మసీదులో లేచి నిల్చుని ‘‘పూనం సేఠ్.. పైసాలావ్’’అని గట్టిగా పిలిచేవారు. సేఠ్ అత్యంత భక్తిప్రపత్తులతో బాబా అడిగిన పైకాన్ని సమకూర్చేవాడు. మర్నాటికి మళ్లీ ఆ మొత్తాన్ని బాకీ తీర్చేసేవారు బాబా. భక్తులకు దానం, త్యాగ గుణాలను నేర్పటానికే బాబా భక్తులనుంచి దక్షిణ అడిగి తీసుకునేవారు.
బాబా శిరిడీ విడిచి ఎప్పుడూ, ఎక్కడికీ వెళ్లిన దాఖలాలు లేవు. శిరిడీకి సమాన దూరంలో ఉత్తరాన నీమ్‌గాం, దక్షిణాన రహతా గ్రామాలు ఉన్నాయి. అప్పుడప్పుడు బాబా ఈ రెండు గ్రామాలకు మాత్రం వెళ్తుండేవారు. ఇవి తప్ప మరెక్కడికీ బాబా వెళ్ళలేదు. కానీ, ఎక్కడెక్కడో జరిగిన, జరుగుతున్న, జరగబోయే విషయాలను మసీదులోనే కూర్చుండి బయటపెడుతుండేవారు. ఒక్కోసారి విచిత్రంగా తననుతానే చరుచుకోవటం, గట్టిగా కేకలువేయటం చేసేవారు. కొద్దిసేపటికి శాంతించేవారు. ఇది చూసినవారికి ఏమీ అర్థమయ్యేదికాదు.

సాయి విద్యా ఫౌండేషన్ ప్రచురించిన ‘సాయి జీవనం మోక్షమార్గం’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు స్థలం ‘సాయి విద్య ఫౌండేషన్, ఫ్లాట్ నెం.4, సాయిబాబానగర్ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23441123. ఎల్.ఐ.జి.49, ధర్మారెడ్డి నగర్, ఫేస్-1, కూకట్‌పల్లి, హైదరాబాద్-72, ఫోన్:040-23445566