మెయన్ ఫీచర్

ఓ దేవా..! మమ్మల్ని క్షమించు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేరళలో జీసస్ ప్రభువును ఓ ‘ఆర్థడాక్స్ చర్చి’ శిలువపైకి ఎక్కించింది. ఆ రోమన్ కాథలిక్ ఆర్థడాక్స్ చర్చికి చెందిన ఆర్చిబిషప్ పేరు ఫ్రాంకో ములక్కాడ్. ఇటీవల ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో మార్మోగింది. భారతదేశంలో ‘తప్పిపోయిన గొర్రెల’కు మోక్షం ప్రసాదించ వలసిన నైతిక దైవిక ఆధ్యాత్మిక బాధ్యత ‘వాటికన్’ మీద ఉంది. అందుకని ఇక్కడికి విదేశాల నుండి మత ప్రచారకులకు భారీ మొత్తంలో ధన సంపత్తి రావడం జరుగుతున్నది. ఈ ఏడాది జనవరిలో ‘వాటికన్’ అధిపతి పోప్ మాట్లాడుతూ- ‘భారతదేశంలో ఇటీవలి కాలంలో ఇండియన్ నేషనలిజం విజృంభిస్తున్నది. ఇది మనకు ఆందోళన కలిగించే విషయం’ అని అన్నారు. అందుకని పెద్దసంఖ్యలో భారత్‌లో చర్చిల నిర్మాణం చేయటం, మత మార్పిడులు జరపటం ప్రోత్సహించారు. క్రైస్తవుల సహాయం లేకుండా భారతదేశంలో ఏ ప్రభుత్వమూ ఏర్పాటు కావటానికి వీలులేదని పోప్ స్పష్టంగా ఆదేశాలు జారీచేశారు. అంతేకాదు, ఈ విషయమై కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం స్పష్టమైన ఆదేశాలు అందాయట! ‘్భరతదేశంలోని రాజకీయాధికారాన్ని నీవు చేజిక్కించుకోవాలి’అని ఆమెకు సూచించారట! అందుకు సామదాన భేద దండోపాయాలు ప్రయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అహమ్మదాబాద్, న్యూఢిల్లీల్లోని బిషప్పులు నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఓటు వేయండంటూ ఫత్వాలు జారీచేయటం ఇటీవలి చరిత్రయే. మతంతో పాటు ఇందులో ఒక రాజకీయ కోణం కూడా ఉంది.
అమెరికా, బ్రిటన్ వంటి సామ్రాజ్యవాద దేశాలకు తమ సరుకులను మార్కెటింగు చేసుకునే నిమిత్తం వలస దేశాలు కావాలి. ఇండియా అలాంటి అతిపెద్ద ‘కాలనీ’! బ్రహ్మజెముడులా అజ్ఞానం వ్యాపించిన ఈ దేశాన్ని జయించటం చాలా తేలిక అని అలనాడు రాబర్ట్ క్ల్రైవ్‌కు తెలుసు. గజినీ మహమ్మద్‌కు తెలుసు. బిషప్ కాల్డ్‌వెల్‌కు తెలుసు. ఫ్రాంకో ములక్కల్‌కు తెలుసు. అందుకే కేరళ మొత్తం చర్చిలతో నింపివేశారు. లక్షలాది స్ర్తిలను క్రైస్తవ సన్యాసినులుగా మార్చారు. విద్యాలయాలు, వైద్యాలయాలు నిర్మించి సేవాకార్యక్రమాల ద్వారా మతం మార్పిడులు జరిపించారు. ఏసును నమ్మని వారికి పరలోక రాజ్యం లేదన్న వ్యాఖ్యానాలు సైతం కొందరు చేశారు. ఇంకొందరు ఓ అడుగు ముందుకేసి- రాముడు, కృష్ణుడు వంటి వారిని పూజిస్తే నరకానికి పోతారని చెప్పారు. ఈ విధంగా బ్రిటీషు వారు ఇండియా విడిచి వెళ్లిన తర్వాత కూడా ఇక్కడ రామరాజ్యానికి బదులు రోము రాజ్యమే కొనసాగింది.
ఫ్రాంకో ములక్కల్ బిషప్పు అయినంత మాత్రాన కామక్రోధాలను జయించగలడా? మామిడి పండ్ల బుట్ట ముందుపెట్టి తినవద్దు అంటే ఎలా? వేలాది అవివాహిత స్ర్తిలు ఎదురుగా ఉంటే ఫ్రాంకో వంటి వారికి అది కన్నుల పండుగ కాదా? అందువల్లనే తన అధీనంలోని చర్చిలను వ్యభిచార కేంద్రాలుగా మార్చాడు. తన కామవాంఛ తీర్చినవారికి మోక్షమార్గం సుగమవౌతుందని చెప్పాడు. ఇలా ఎందరో ‘నన్స్’ను తన వాంఛల కోసం వాడుకున్నాడు. ఐతే ఆర్ధడాక్స్ చర్చిలోని కఠోర క్రమశిక్షణ దృష్ట్యా ఈ లైంగిక అనైతిక కార్యకలాపాలకు సంబంధించిన వార్తలు బయటకు పొక్కకుండా చూశాడు.
అయినా ఎప్పుడో ఒకప్పుడు పాపం పండక మానదు. ఒక నన్ బజారుకెక్కింది. తనను ఫ్రాంకో ఇప్పటికి ముప్పదిసార్లకు పైగా లైంగిక వాంఛల కోసం ఉపయోగించుకున్నాడని కోర్టులో అభియోగం నమోదు చేసింది. దీంతో క్రైస్తవ వర్గాలు రహస్య సమావేశం జరిగి సామదాన భేద దండోపాయాలు ప్రయోగించాయి. డబ్బు సంచులతో ఆ సన్యాసిని యొక్క సోదరుని వద్దకు వెళ్లి ఈ వార్త పత్రికలకు ఎక్కకుండా చూడవలసిందిగా కోరారు. ఐతే ఇలా డబ్బు పంపించిన వార్తకూడా పత్రికలకు ఎక్కింది. దానితో ఆ నన్‌పై ‘వేశ్య’ అని ముద్రవేసి దుష్ప్రచారం మొదలుపెట్టారు. కేరళ కోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకొని ఫ్రాంకోతోబాటు ఐదుగురు క్రైస్తవ మత ప్రచారకులను అరెస్టు చేయించింది. దీనితో అందరికన్నా ఎక్కువగా క మ్యూనిస్టులు బాధపడ్డారు. ఎందుకంటే కేరళలో ముస్లిం లీగ్, కేరళ కాంగ్రెసు మద్దతులేకుండా కమ్యూనిస్టు ప్రభుత్వం నిలువదు. కేరళ అసెంబ్లీలో పి.సి.జార్జి అనే సభ్యుడు బహిరంగంగా ఫ్రాంకో ములక్కల్‌ను సమర్ధించాడు. బాధితురాలైన ఆ క్రైస్తవ సన్యాసిని దుర్మార్గురాలు అని జార్జి ప్రచారం మొదలుపెట్టాడు. కేరళ హైకోర్టు ములక్కల్‌కు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
ఈ ఏడాది జనవరి 20వ తేదీన ఆ సన్యాసిని వాటికన్‌కు ఒక లేఖ వ్రాసింది. ‘పోప్ అంటే తండ్రి అని అర్థం. ఇక్కడ బిషప్పులు మామీద పడుతున్నారు. మీరు రక్షణ కల్పించకపోతే నన్స్ ఎవరూ సౌశీల్యంతో మిగలరు’ అన్నది ఆ లేఖలోని సారాంశం. దీనిని వాటికన్ వర్గాలు చెత్తబుట్టలో వేశాయి. సరికదా.. అదే జనవరిలో వాటికన్ నుండి ఒక ఆదేశం భారతదేశానికి అందింది- ‘ఇండియాలో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఓడించండి’ అని! ఈ విషయాలు వెలుగులోకి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. చాలా వౌలికాంశాలు మానవాళి దృష్టికి వచ్చాయి. సీపీఎం నాయకుడు సునీల్ చోప్రా ఒక ప్రముఖ ఇంగ్లీషు టీవీ చానల్‌లో మాట్లాడుతూ ఆశారాం బాపు, రాం రహీం బాబాల లైంగిక కార్యకలాపాలను గుర్తుచేశాడు. ఫ్రాంకో మొలక్కల్ ఎందుకు దుర్మార్గానికి పాల్పడ్డాడు? అని ప్రశ్నిస్తే హిందూ మతాధిపతులు కూడా ఇలాంటి చర్యలు చేస్తున్నారు కదా అనేది సునీల్ చోప్రా వాదం. నిజమే! కాని రెండు తప్పులు ఒక ఒప్పు అవుతుందా? ఆశారాం బాపు విషయంలో ఇల్లెక్కి కూసిన ఆయన ఫ్రాంకో విషయంలో ఎందుకు వౌనం పాటించాడు? ముఖ్యంగా సోనియా గాంధీ గొంతు ఎందుకు మూగపోయింది? అవార్డులు వాపస్ చేసిన ‘సెక్కులరిస్టు నేతల బృందం’ ఏమయింది? మహిళా హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు ఈ దురదృష్ట క్రైస్తవ సన్యాసినిని ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రాలేదు?
కేరళలోని శబరిమలై ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతించాలంటూ ఢిల్లీ నుండి గల్లీ వరకు ఆందోళనలు చేసిన మహిళా ఉద్యమ నేతలు ఇప్పుడెక్కడ దాక్కున్నారు? కాంగ్రెస్ సహా ఉభయ కమ్యూనిస్టు పా ర్టీలు ఎందుకు నోరు మెదపటం లేదు? హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న కంచె ఐలయ్య వంటి రచయితల కలాలకు ఇప్పుడు పక్షవాతం వచ్చిందా? చాలా ప్రాం తాల్లో క్రైస్తవ మత ప్రచారకులు ఇలా లైంగిక నేరాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఐతే అవి వెలుగు చూడటం లేదు. ఘనత వహించిన మన ‘ఎల్లో జర్నలిస్టులు’ ఈ వార్తలు వెలుగుచూడకుండా తొక్కిపెట్టారు. అమెరికాలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోపు మహాశయుడు బాధితురాలికి నష్టపరిహారం ఇచ్చి క్షమాపణ కూడా చె ప్పారు. మరి ఇండియాలో ఇలా జరిగితే పోప్ మాత్రం ఎందుకు మాట్లాడలేదు? గతంలో జెస్మీ అనే క్రైస్తవ సన్యాసినిపై లైంగిక దాడి జరిగితే ఆమె అధికారులకు మొరపెట్టుకుంది. ‘తెల్లదుస్తులతో అర్ధరాత్రి నీకు కన్పడినది సాక్షాత్తు ప్రభువే’ అని ప్రచారం చేసినా ఆమె నమ్మలేదు. ఇక లాభం లేదని భావించి, ‘మీ అమ్మాయికి పిచ్చి ఎక్కింది’ అని కథ అల్లి ఆమెను తల్లిదండ్రుల వద్దకు పంపారు. ఆ తల్లిదండ్రులు ఆమెను ఆదరించలేదు సరికదా ‘నీవు చేస్తున్న ఈ ఆరోపణల వల్ల మన మతం అపఖ్యాతిపాలవుతున్నది’ అని సొంత కూతురునే మందలించారు. దీంతో జెస్మీ నిస్పృహతో ఇల్లువదిలి ఏకాంతంగా జీవించసాగింది. ఈ కథను ఒక గ్రంథంగా పెంగ్విన్ పబ్లికేషన్ వారు రెండు దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదల చేశారు. ఇప్పుడు ఫ్రాంకో మొలక్కల్ అరాచకాలు ఏకంగా నవల రాయడానికి సరిపోయేటంత సమాచారం ఇస్తుందేమో?
నేడు మనం ఆలోచించవలసిన వౌలికాంశం ఏమంటే- అసలు మత ప్రచారం కోసం నన్ వ్యవస్థ అవసరమా? లోగడ భారతీయ సమాజంలో దేవదాసీ వ్యవస్థ భ్రష్టుపట్టింది. కొన్ని పవిత్ర పదాలు సైతం తిట్లుగా మారాయి. ఈరోజు నన్ వ్యవస్థ అస్తిత్వమే ప్రశ్నార్థకంగా మారింది. స్వస్థతా కూటములలో క్లోరోఫారం నీళ్లు ముఖాన చల్లి స్పృహ తప్పించిన దృశ్యాలు మనం ఇటీవల టీవీ చానళ్లలో చూశాం. మత ప్రచారం కోసమని స్టెరాయిడ్స్ ఇచ్చి అమాయకులను గెంతించటం తగునా? ‘మతం ఓ మత్తుమందు’ అని ప్రచారం చేసే వామపక్ష నేతలు ఏచూరి సీతారాం, ప్రకాశ్ కారత్ వంటి వారు కేరళలోని ఈ అకృత్యాలను ఎందుకు ఖండించలేదు? ఎందుకంటే ‘మతం’ అంటే వారి దృష్టిలో వైదిక మతం అని అర్థం. అదే మత్తుమందు. అంతేకాని ఇస్లాం, క్రైస్తవాలు కాదు. ఎందుకంటే ‘లాల్ నీల్’ ఉద్యమంలో భాగస్వాములుగా ఉన్నవారు దళిత క్రైస్తవులు.
కేరళలో ఇటీవల జలప్రళయం వచ్చింది. అది జీసస్ కార్చిన కన్నీరు. మోసెస్ జాషువా జీసస్‌లు చెప్పిన బోధలకు ఇవ్వాల్టి క్రూసేడర్ల ఉన్మాదానికి ఎటువంటి సామ్యమూ లేదు. ఈ సందర్భంగా ఒకటి, రెండు చరిత్రకాంశాలను మనం విశే్లషించుకోవాలి. మహాభారత యు ద్ధానంతరం మధుర నుండి యాదవుల శాఖ ఒకటి మధ్యప్రాచ్యం చేరింది. వీరినే యదూస్ జూస్ అని పిలిచారు. జీసస్ క్రైస్తు, ఐన్‌స్టీన్ కారల్ మార్క్సు వంటి మేధావులు ఈ యూదు జాతికి చెందినవారు. ఇప్పుడు క్రైస్తవ వర్గాలవారు- ‘మాకు ఓల్డ్ టెస్ట్‌మెంట్‌తో సంబంధం లేదు. యహోవా మోసెస్‌లు మా దేవుళ్లు కాదు. క్రీస్తు ప్రభువు మాత్రమే మా దేవుడు’ అని ఇటీవలి దశాబ్దాల్లో ప్రచారం చేయటం అందరికీ తెలిసిన విషయమే. క్రీస్తు ప్రభువు గొప్పవాడని అనడానికి ఎవరికీ అభ్యంతరం లేదు. కాని ఫ్రాంకో మెలక్కల్‌లూ, పాలకొల్లులోని కొందరు ‘పరిశుద్ధ బాబులు’ కూడా గొప్పవారు అంటే ఎలా?
కేరళలోని కొచ్చిన్, ఎర్నాకుళంల నుండి కొద్దిరోజుల క్రితం వచ్చిన సమాచారం ప్రకారం బాధితురాలైన నన్ వాటికన్ రాయబారికి ఒక లేఖ వ్రాసింది. జలంధర్ డియోసిస్‌కు చెందిన ఫ్రాంకో మెలక్కల్ ఆర్థికంగానూ రాజకీయంగానూ బలవంతుడు. ఇతడు క్రైస్తవ మతానికి మచ్చతెచ్చాడు. కాబట్టి తక్షణమే ఆయనను ఆర్చి బిషప్ పదవినుండి తొలగించండి అంటూ ఆమె మొరపెట్టుకున్నది. విచిత్రమేమంటే స్వామి నిత్యానంద, ఆశారాం బాపుల ఉదంతాలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలలో లభించిన ప్రచారం ఈ నన్ వ్రాసిన లేఖకు లభించకుండా క్రైస్తవ వర్గాలు జాగ్రత్త వహించాయి. ఇటీవల ఒక గృహిణి బిషప్ ముందు కనె్ఫషన్ చేసింది. ఇంకేం.. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి అతడు లైంగికంగా లొంగ దీసుకున్న ఉదంతం కేరళలో వెలుగుచూచింది. సిద్ధాంత రీత్యా కనె్ఫషన్ ఏసు ప్రభువు ప్రతిమ వద్ద చేయాలి కాని నరమానవులతో కాదు.
2014-16 సంవత్సరాల మధ్యకాలంలో ఫ్రాంకో ఇంకా ఐదుగురిని లైంగికంగా వాడుకున్నాడన్నట్లు ఆరోపణలున్నా ఆ విషయాలు వెలుగులోకి రాకుండా కొందరు అణచిపెట్టారు. ప్రస్తుతం పోలీసులు ఈ కేసు విషయంలో ముందుకు రావటం లేదు. తాము కేరళ వరద బాధితుల సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నామని సాకు చూపిస్తున్నారు. అసలు విషయం ఏమంటే పీసీ జార్జిని కాని, ఫ్రాంకోను కాని శిక్షించడానికి ప్రభుత్వం మానసికంగా సిద్ధంగా లేదు. ఓ రకంగా చూస్తే రోమన్ కాథలిక్ వ్యవస్థ భారతదేశంలో నేడొక సంక్షోభంలో ఉంది. ‘మిషనరీ ఆఫ్ జీసస్’ ఈ గొడవల్లో ముందుకు వచ్చింది. 70 ఎకరాల భూమి, 10 కోట్ల రూపాయల నిధి ఇస్తామని, కేసును ఉపసంహరించుకోవాలని బాధిత నన్ మీద ఒత్తిడి తెస్తున్న వార్త సైతం వెలుగు చూసింది.
జీసస్ జీవించి ఉన్న కాలంలో మానే్టలీనా అనే ఒక స్ర్తిని యూదులు రాళ్లతో కొట్టినట్లు బైబిలులో ఉంది. సరిగ్గా ఇవ్వాళ కేరళలో ఆ చరిత్ర పునరావృత్తమైంది. నన్‌పై కాథలిక్ చర్చి పెద్దలే ‘వేశ్య’ అనే ముద్రవేసి నిందితుడైన ఫ్రాంకో ములక్కల్‌కు మద్దతునిస్తుంటే ఈ దేశంలో క్రైస్తవ మతం మన కళ్లముందే ఎంతలా ఒత్తిడికి గురవుతోందో మనకు తెలుస్తున్నది. వాటికన్ పోపు, సోనియా, రాహుల్ గాంధీ, కేరళ మాజీ సీఎం ఏకే ఆంటోనీ వంటి నేతల బహిరంగ మద్దతు కేరళలోని క్రైస్తవ వర్గాలకు బలంగా ఉంది. అందుకే ఆర్థడాక్స్ చర్చి ఇంతలా బరి తెగించింది. చీకటి సమయంలో తప్పు చేసి, ఉదయం నిద్ర లేచి- ‘ఓ దేవా! మేము పాపులం.. మమ్మల్ని క్షమించు’ అని కొందరు ప్రార్థిస్తున్నారు.

-ప్రొ. ముదిగొండ శివప్రసాద్