మెయిన్ ఫీచర్

సర్వ సంపత్కరాలు (సద్గురు బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రాక్ష అనేది ఒక రకమైన చెట్టు జాతి యొక్క విత్తనం. సహజంగా ఎతె్తైన పర్వతాలలో ముఖ్యంగా హిమాలయాల ప్రాంతంలో పెరుగుతాయి. ఇవి దక్షిణ భారత దేశంలోని పశ్చిమ కనుమలలో కొన్ని ఉన్నాయి. కానీ నాణ్యత కలవి ఎతె్తైన హిమాలయ ప్రాంతంలోనే లభిస్తాయి ఎందుకంటే భూమి, వాతావరణం లాంటి వివిధ కారణాల ప్రభావం చేత. ఈ విత్తనాలకి ఒక విశిష్టమైన కదలికఉంటుంది. సహజంగా పెద్ద విత్తనాలలో అంతగా కదలిక ఉండదు. విత్తనం ఎంత చిన్నదైతే కదలిక అంత బాగా ఉంటుంది.
మాలలు - దండలు
సహజంగా ఈ విత్తనాలు అన్ని కూర్చి ఒక దండ లాగా చేస్తారు సాంప్రదాయకంగా ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు కంటే ఒకటిఎక్కువ గా ఉండాలని భావిస్తారు. ఆ ఒకటి ఎక్కువ ఉన్న రుద్రాక్షయే బిందువు. ప్రతి రుద్రాక్ష మాలకి కచ్చితంగా బిందువు ఉండాలి. లేని పక్షంలో ఆ శక్తి చక్రంలా తయారవుతుంది. దీనివలన సున్నితమైన మనుషులకి మానసిక స్థిరత్వం తగ్గే ఆస్కారం ఉంది. మీరు
రుద్రాక్ష మాలను ధరించినపుడు చన్నీటి స్నానం చేస్తే మంచిది. ఈ రుద్రాక్ష మాలను సిల్క్ దారం లేక ప్రత్తి దారం తో చేస్తే మంచిది. మీరు ఈ మాలను దారంతో ధరిస్తే ప్రతి 6నెలలకి ఆ దారాన్ని మార్చే ప్రయత్నం చేయటం మంచిది మీరు రాగి,వెండి మరియు బంగారం ఉపయోగించినా మంచిదే కాని, ఎక్కువ సందర్భాలలో మీరు ఆ మాల తయారికి స్వర్ణ కారుడి దగ్గరికి తీసుకు వెళ్తారు. ఎప్పుడైతే ఆ స్వర్ణకారుడు బంగారపు దారంతో గట్టిగా ముడి వేస్తె ఆ రుద్రాక్షలు పగిలే ప్రమాదం ఉంది. కనుక వాటిని కాస్త వదులుగా బంగారంతో చుట్టిస్తే మంచిది.
ఒత్తిడి వల్ల లోపల పగుళళు ఏర్పడచ్చు. పగుళ్లు ఉన్న రుద్రాక్షలు ధరించడానికి, ధ్యానానికి పనికిరావు. రుద్రాక్షలు మాలలుగా ధరించేటపుడు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. రుద్రాక్షలు ధరించడం వల్ల సుఖనిద్ర పడుతుంది. శారీరిక శక్తిని పెంచుతుంది.
రక్తశుద్ధికి, మానసిక వ్యాధులను దూరం చేయడానికి రుద్రాక్షలు పనికి వస్తాయ. నరాల జబ్బులను కూడా తగ్గిస్తాయ. ఉద్రేక పూరితమైన మనస్సునకు ప్రశాంతతను చేకూర్చడానికి కూడా రుద్రాక్షలు ఉపయోగపడుతాయ. అధిక రక్తపోటును తగ్గిస్తాయ. సంపదలను ఒనగూరుస్తాయ కూడా.
నీరు విషపూరితమైనవో కాదో తెలుసుకోవడానికి కూడా ఈ రుద్రాక్షలు పనికి వస్తాయ. అదెలా అంటే నీరు ఉన్న ఒక పాత్రను లేక నీరు ఉన్న ప్రదేశానికి కొంత ఎత్తులో రుద్రాక్షను ఉంచినట్లయతే ఆ నీరు సవ్యంగా అంటే (ష్యషరీతీజఒళ) దశలో తిరుగుతుంది. ఆ నీరు విష పూరితమైతే అపసవ్యదిశలో (్ఘశఆజ- ష్యషరీతీజఒళ) దిశలో తిరుగుతుంది. ఏదైనాసానుకూల ప్రాణ పదార్ధం పై ఉంచితే సవ్య దిశలో తిరుగుతుంది. ప్రతికూల ప్రాణ పదార్దం పై ఉంచితే అపసవ్య దిశలో తిరుగుతుంది.
ప్రతికూల శక్తులను నిరోధించడానికి కూడా రుద్రాక్షలు పనికి వస్తాయని అధర్వణ వేదం చెబుతుంది.
అనుకోకుండా జరిగే ప్రమాదాలను నివారించడానికి రుద్రాక్ష ధారణ మంచిది. అపమృత్యుదోషాన్ని దూరం చేస్తుంది.
ఎవరంటే వారు రుద్రాక్షలను ధరించడం అంతమంచిది కాదు అని కూడా చెప్పవచ్చు. రుద్రాక్ష కు ఉండే ముఖాల సంఖ్యను బట్టి జాతకరీత్యా పరీక్షించిన తర్వాతనే ఏ రుద్రాక్షను ఎవరు ధరించాలో అనుభవజ్ఞుల ద్వారా తెలుసుకొని మరీ ధరించాలి కానీ దుకాణాల్లో దొరికే రుద్రాక్షలన్నీ సరియైనవి ఉండకపోవచ్చు.
కొంతమందికే రుద్రాక్ష గురించి తెలిసి ఉంటుంది. వారిని అడిగి వారి సలహామేరకు రుద్రాక్షను ధరించాలి. రుద్రాక్షలో ఉండే ముఖాలను బట్టి వాటి విలువ తెలుసు కొంటారు. ఏకముఖి కొందరికే మంచిని కలుగచేసుందనే అభిప్రాయమూ ఉంది. చాలామందికి పంచముఖి సురక్షితం అని చెప్పవచ్చు. పైగా ఈ పంచముఖిని పురుషులు, స్ర్తీలు, పిల్లలు అందరూ ధరించవచ్చునని పెద్దల అభిప్రాయం. రుద్రాక్షను ఎపుడూ సుఖసంతోషాలకు మానసిక ప్రశాంతతకూ ఉపయోగించాలికానీ వీటిని కూడా అమ్మడం కొనడం అంత మంచిది కాదు. - ప్రేమాశీస్సులతో