మెయిన్ ఫీచర్

బుద్ధిస్వరూపిణి, జ్ఞాన ప్రదాయిని!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవీ భాగవతంలో నారాయణమూర్తి భక్తుడైన నారద మహర్షికి సరస్వతీదేవి చరితమును చక్కగా తెలియజేశాడు. గణేశుని జనని, దుర్గ, రాధ, లక్ష్మి, సరస్వతి-సావిత్రి దేవీమణులు సృష్టికి ప్రకృతులని చెప్పారు. వీరి ప్రభావములు- పూజలు అద్భుతములు. వీరి చరిత్రలు ప్రఖ్యాతములు.
భగవంతుడైన శ్రీకృష్ణపరమాత్మ ఆ సరస్వతీదేవిని పూజించినాడు. కామ స్వరూపిణియైన దేవి శ్రీకృష్ణుని పొందు కోరికను తెల్పింది. సర్వజ్ఞానయైన శ్రీకృష్ణుడు ఆమె ఆలోచనను గమనించి ప్రశాంతంగా ఆమెతో యిలా తెలిపినాడు. సాధ్వీ! నీవు నారాయణుని సన్నిధిని చేరుకో. ఆయన నా అంశయే. ఆయన చతుర్భుజుడు. సుందరుడు. సద్గుణ సంపన్నుడు. లీలామయుడు. నేను సమస్తమునకు యజమానిని. నీవు వైకుంఠమునకు వెళ్ళుము. నీవచట నుండుట శ్రేయస్కరము. విష్ణువును స్వామిగా చేసికొని ఆనందమనుభవింపుము. ఆయనకు లక్ష్మియను భార్యయున్నది. విష్ణువు మీ యిరువురును సమంగా ఆదరిస్తాడు.
ప్రతి బ్రహ్మాండమునందు మాఘ శుక్ల పంచమి విద్యారంభమునకు శుభప్రదమని సర్వులు గౌరవంతో పూజిస్తారు. నా వరప్రభావంతో నేటినుండీ ప్రళయకాలంవరకు ప్రతికల్పమునందు మానవులు- మునులు- వసువులు- యోగులు- సిద్ధులు- నాగులు- గంధర్వులు- రాక్షసులు అందరు భక్తితో నిన్ను షోడచోపచారములతో పూజిస్తారు. కణ్వశాఖలో వున్నవారు జతేంద్రియులుగాన నిన్ను ధ్యానించి తరిస్తారు.
విద్వాంసులు సమగ్రముగా భక్తిశ్రద్ధలతో నిన్ను స్తోత్రం చేస్తారు. త్రిమూర్తులతోబాటు సకల దేవతలు, రాజులు మునులు భగవతి సరస్వతిని ఉపాసించారు. నాటినుండి రుూ సరస్వతీ దేవి సకలప్రాణులచేత సుపూజిత అయినది.
మాఘశుక్ల పంచమి విద్యారంభమునకు శుభమైన తిథి. శరన్నవరాత్రులలో మహాకాళీ-మహాలక్ష్మీ-మహాసరస్వతులను పూజిస్తారు.
పుస్తక రూపిణియైన సరస్వతీదేవి పూజ మూలానక్షత్రంలో ప్రారంభించి శ్రవణంతో ముగిస్తారు. ఈమె విద్యలకు అధిష్ఠాన దేవత. ఈ దేవి పరాశక్తికి సాత్త్వికాంశ. ఈ పరశక్తే మహాసరస్వతి అవతారాన్ని ధరించినది. ఈ దేవి చరిత్ర మార్కండేయ పురాణంలోనూ వున్నది. ఈ దేవి శుంభాదిదైత్యులను సంహరించినది. పూర్వం శుంభ నిశుంభులనే రక్కసులు త్రిలోకాలను ఆక్రమించగా దేవతలు పరాశక్తిని స్తోత్రం చేశారు. ఆ సమయంలో పార్వతి గంగానదిలో స్నానం చేయడంకోసం వచ్చింది. ఆమె శరీరకోశంనుండి పరాశక్తి వచ్చింది. ఈమెను కౌశికి అన్నారు. పిదప పార్వతి కాళికగా మారింది. బ్రహ్మాది దేవతలనుండి బ్రాహ్మి-మహేశ్వరి-వైష్ణవి మున్నగు దేవశక్తులు దేవీ సైన్యంలో చేరాయి. దేవి శివుని దూతగా పంపి శంభునికి హితవు బోధించినది. వారు వినలేదు. యుద్ధంలో మరణించాడు. ఆ తల్లిని దేవతలు స్తుతించగా కరుణామయి అయిన ఆ పరాశక్తి శుంభాదులను సంహరించినది. ఆ పరాశక్తియే మహాసరస్వతిగా పేరొందినది.
ఈ దేవి మంత్రం జగద్వ్యాపకమైనది.
శ్లో॥ సరస్వతీ నమస్త్భ్యుం- వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి- సిద్ధిర్భవతు మేసదా!
పద్మపత్ర- విశాలాక్షీ- పద్మకేసర వర్ణినీ
త్వాం విద్యాలయాదేవి- సామాంపాతు సరస్వతీ॥
జ్ఞాపకశక్తికీ, స్ఫూర్తి- మేధాశక్తి వృద్ధికీ ఈ తల్లి ధ్యానం ఆలంబనగా వుంటుంది.
శ్లో॥ మేధాం విద్యాబల ప్రజ్ఞాం సం పదం- పుత్ర పౌత్రికాం
దహిమే శారదేదేవీ స్మరామ ముఖ సంస్థితాం॥
శ్లో॥ నమస్తే శారదేదేవి- కశ్మీర పురవాసినీ
త్వా మహం ప్రార్థయేన్నిత్యం- విద్యాదానంచ దేహిమే॥
ఈ దేవి శారద- భారతి-వాగ్దేవి- వీణాపాణి- నలువరాణిగా ప్రసిద్ధనామాలు ధరించినది. ఈ దేవికి పూజానంతరము వేదాల్లో చెప్పబడిన రీతిగా అప్పుడే తీసిన వెన్న- పెరుగు పాలు- పేలాలు- నువ్వుల లడ్లు- తెల్లని చెఱకు గడలు- బెల్లంతో చేసిన మధుర పక్వాన్నములు- పటిక బెల్లము తెల్లని తీపి పదార్థాలు- నేతి పిండివంటలు- అటుకులు- హవిష్యాన్నము- జొన్నలు- గోధుమ పిండితో నేతిలో వేయించిన పదార్థాలు- పండిన అరటి పండ్లు- పరమాన్నము- టెంకాయలు దేశకాలానుగుణంగా ఆయా ఋతువులలో దొరికే పండ్లు నైవేద్యానికి అమ్మవారికి ఉపయోగించే పదార్థాలు.
ఈమె శుక్లవర్ణ ‘చిన్మయ వస్తధ్రారిణి’. ఒక చేతిలో వీణ-వేరొక చేతిలో పుస్తకం ధరించి యుంటుంది. మూల మంత్రమైన ‘‘శ్రీం హ్రీం- సరస్వత్యైస్వాహా’’అను వైదిక అష్టాక్షర మంత్రధ్యానానంతరం సాష్టాంగ నమస్కారం చేయాలి. శ్రీ సరస్వతీ కవచము విన్నను- పఠించినను విశ్వవిజేతలు కాగలరని పురాణోక్తి. కుటుంబాలలో అందరూ సరస్వతీ మాతను ఆరాధించిన జ్ఞానులు కాగలరు.
బుద్ధిమంతులౌతారు. మాత శారద అధిష్ఠాత్రిదేవి సర్వవర్ణాత్మిక. జగన్మాత. ప్రాచీన కాలంలో మహా కవి కాళిదాసు ఈ దేవి ఆరాధనతో విఖ్యాతిగాంచినాడు. కవులకు ఈ దేవి కవచము బుద్ధిప్రదాతగా నిలుస్తుంది. గ్రంథ బీజ స్వరూపాదేవి బ్రహ్మమంత్రములకు ఇది ఆకారం దాల్చిన విగ్రహం. బ్రహ్మ స్వరూపం ఈ దేవి కవచం. ఈమె విధాత రాణి- హంసవాహిని. ఆనంద దాయిని. సిద్ధి బుద్ధి ప్రదాయిని, కాల సంఖ్యా స్వరూపిణి. స్మరణశక్తి విజ్ఞానశక్తికి- బుద్ధిస్వరూపిణి. జ్ఞాన ప్రదాయిని, శారదాదేవి సరస్వతి.
నవరాత్రులలో ఆబాలగోపాలం శ్రీ సరస్వతిని ధ్యానించి పూజించి- స్తుతించి ఆమె అనుగ్రహానికి పాత్రులౌదురు గాక!
‘సామాంపాతు సరస్వతీ భగవతీ- నిశే్వష జాడ్యాపహా’అంటూ స్తోత్రం చేద్దాం, తరిద్దాం.

- పి.వి.సీతారామమూర్తి