మెయిన్ ఫీచర్

అసలైన స్పందన ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏదైనా ఛలోక్తిని మీరు ఒక ఆంగ్లేయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. వెంటనే ఆ ఛలోక్తిని మీరు అతనికి మళ్ళీ వివరిస్తారు. అప్పుడు కూడా అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ఎప్పుడూ చాలా మర్యాదగా ప్రవర్తించేలా ఆంగ్లేయులందరికీ శిక్షణ ఇస్తారు. అర్థరాత్రి నిద్రాభంగమైనప్పుడు ఆ ఛలోక్తి అతనికి మళ్ళీ గుర్తుకొస్తుంది. అప్పుడు కూడా అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలా ప్రతి ఆంగ్లేయుడు మూడుసార్లు నవ్వుతాడు.
అదే ఛలోక్తిని మీరు ఒక జర్మనీయునికి చెప్పినప్పుడు అతను చాలా మర్యాదపూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. అలాగే దానిని మీరు వివరించినప్పుడు కూడా అతను రెండవసారి మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వుతాడు. కానీ, ఏ జర్మనీయుడూ మూడవసారి నవ్వడు. ఎందుకంటే, ఆ విషయం అతనికి గుర్తుంచదు. ఆ రకంగా వారు నిబద్ధీకరించబడతారు.
అదే ఛలోక్తిని మీరు ఒక అమెరికన్‌కు చెప్పగానే అతను చాలా మర్యాద పూర్వకంగా చిరునవ్వు నవ్వు నవ్వి వెంటనే దాని గురించి పూర్తిగా మర్చిపోతాడు. అందుకే ఏ అమెరికన్ రెండవసారి నవ్వడు. అదే ఛలోక్తిని మీరు ఒక యూదునికి చెప్పినప్పుడు అతను ఏమాత్రం నవ్వకపోగా ‘‘పాత ఛలోక్తిని కూడా మీరు చాలా తప్పుగా చెప్తున్నారు’’అంటాడు. అది అతనికి కేవలం ఛలోక్తే కావచ్చు లేదా గొప్ప వేదాంతమో లేదా అతి చిన్న విషయమో లేదా చివరికి దేవుడైనా కావచ్చు. ఏదేమైనా పెద్ద తేడా ఏముండదు.ఎందుకంటే, అందరూ పెద్దల కోరిక ప్రకారం తమ సహజత్వాన్ని కూడా అణచుకుంటూ, వారు బోధించిన నిబద్ధీకరణలను పాటిస్తూ, పెరిగి పెద్దవారై, వారు ఆశించినట్లుగానే ప్రవర్తిస్తారు. వాస్తవానికి, ఎవరైనా తమ సహజత్వాన్ని మాత్రమే పనిచెయ్యనివ్వాలి. కానీ, ఎవరూ అలా చెయ్యరు. పైగా, తమకు నూరిపోసినదానే్న అందరూ అనుసరిస్తారు. అందుకే అలాంటివారిని నేను ‘బానిసలు’ అంటాను.
మీకు బోధించిన నిబద్ధీకరణలన్నింటినీ పూర్తిగా విడిచిపెట్టిన మరుక్షణం వాటి ప్రభావం మీపై ఏమాత్రం ఉండకపోవడంతో మీకు పూర్తిస్వేచ్ఛ లభిస్తుంది. వెంటనే మీరు తొలిసారిగా మీ జీవితాన్ని నూతన దృక్పథంతో దర్శించడం ప్రారంభిస్తారు. అందువల్ల మీరు ఎలా ప్రవర్తిస్తారో, తరువాత ఏమి జరుగుతుందో ఎవరూ ఏమాత్రం ఊహించలేరు. ఎందుకంటే, అస్తిత్వం మీ ద్వారా స్పందిస్తోంది. అందువల్ల మీరు ఇప్పుడు మునుపటిలా లేరు. ఇంతవరకు కేవలం సమాజం మాత్రమే మీద్వారా స్పందిస్తూ వచ్చింది. కాబట్టి, ఎలాంటి ప్రణాళికలు, స్థిరమైన పూర్వనిశ్చితాభిప్రాయాలు లేకుండా, ఏ క్షణంలో ఏమి జరిగినా అప్రమత్తతతో స్పందించేందుకు సిద్ధంగా ఉన్నట్లైతే, మీరు ప్రామాణికంగా, వాస్తవంగా మారినట్లే. కాబట్టి, ‘‘అధికారికత, ప్రామాణికత’’అనే పదాలను మీరు ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. మామూలుగా మీరు మతాచార్యుడు, రాజకీయ నాయకుడు, తల్లిదండ్రుల అధికారిక నిబద్ధీకరణల ప్రకారమే స్పందిస్తారు. సవాలుచేసే పరిస్థితి ఎప్పుడు ఎలాంటిది ఎదురైనా, స్వేచ్ఛాపరుడు ఎప్పుడూ తన ప్రామాణికతకు అనుగుణంగా పూర్తిగా స్పందిస్తూ ప్రవర్తిస్తాడే కానీ, ఏ అధికారానికీ తలవంచి ప్రవర్తించడు. కనీసం అలా జరుగుతుందని కూడా అతను ఏమాత్రం ఊహించలేదు. ఎందుకంటే, అతనికే తెలియకుండా అంతా జరిగిపోతుంది మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏ సమాధానం చెప్తానో నాకే తెలియదు. నేను సమాధానం చెప్పిన తరువాత మాత్రమే ‘‘ఓహో, ఇదా మీ ప్రశ్నకు నా సమాధానం’’అని నాకు తెలుస్తుంది. నేను ఉన్నాను, మీరు అడిగిన ప్రశ్న ఉంది. కాబట్టి, మీ ప్రశ్నకు సమాధానం తప్పక లభిస్తుంది.
అడిగిన దానికి వెంటనే చక్కగా స్పందిస్తూ సమాధానం చెప్పడమనేది ఒక ప్రామాణికమైన బాధ్యత. చైతన్యరహితులైన వ్యక్తులు-పిరికిగా, ధైర్యంగా, సహనంగా, అసహనంగా- ఇలా ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మీకు తెలుస్తూనే ఉంటుంది. కానీ, పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో మీరు ఏమాత్రం ఊహించలేరు. ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్