మెయిన్ ఫీచర్

బాధ్యతా రాహిత్యమా? ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘దేనినుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ పూర్తిస్వేచ్ఛ కాదు. ఆ ‘నుంచి’అనేది మీరు గతంలో ఇరుక్కుపోయేలా చేస్తుంది. అందువల్ల ‘‘దేనినుంచో స్వేచ్ఛ’’ ఎప్పటికీ అసలైన స్వేచ్ఛకాదు.
**
అడ్డంకులను అధిగమించే సోపానాలు
సామాజిక, రాజకీయ, ఆర్థిక-ఇలా అనేక రకాల స్వేచ్ఛలున్నాయి. కానీ, అవన్నీ పైపైవి మాత్రమే. అసలైన స్వేచ్ఛకు పూర్తి భిన్నమైన పార్శ్వముంటుంది. అది ఏమాత్రం బయట ప్రపంచానికి సంబంధించినది కాదు. అది మీలో ఉదయిస్తుంది. అన్నిరకాల నిబద్ధీకరణలు, ధార్మిక సిద్ధాంతాలు, రాజకీయ వేదాంతాలనుంచి బయటపడేదే అసలైన ‘స్వేచ్ఛ.’
ఇతరులు మీపై విధించినవన్నీ మిమ్మల్ని ఆధ్యాత్మిక బానిసత్వంలో బంధించేందుకు వేసిన సంకెళ్ళే. వాటినుంచి విముక్తికలిగించి మిమ్మల్ని స్వేచ్ఛావిహారిగా చేసేదే ధ్యానం. అప్పుడే మీరు మళ్ళీ అస్తిత్వపు నీడలో, నక్షత్రాల వాడలో హాయిగా విహరించగలరు.
ఎప్పుడైతే మీరు అస్తిత్వానికి అందుబాటులో ఉంటారో అప్పుడు అస్తిత్వం మీకు అందుబాటులోకి వస్తుంది. మీ ఇద్దరి కలయికే పరమానందానికి పరాకాష్ట. అది కేవలం స్వేచ్ఛలో మాత్రమే జరుగుతుంది. అందుకే స్వేచ్ఛ అత్యంత విలువైనది. అంతకన్నా విలువైనది ఏదీ లేదు.
***
చెయ్యాలనుకున్నది చేసేటంత పూర్తిస్వేచ్ఛ మనకు ఉండాలని ఒకపక్క మీరు సూచిస్తూనే, దాని బాధ్యతను కూడా మనం స్వీకరించాలని మీరంటున్నారు. బాధ్యతను స్వీకరించే పక్షంలో కోరుకున్నంత స్వేచ్ఛగా నేనుండలేను. మీరు చెప్పేది అర్థమైనప్పుడు మాత్రం నాలో మీపట్ల కృతజ్ఞతాభావం కలుగుతోంది. కానీ, చాలావరకు నేను స్వేచ్ఛను విచ్చలవిడి తనానికిచ్చిన అనుమతి పత్రంగానే భావిస్తున్నాననిపిస్తోంది.
‘‘స్వేచ్ఛ దాని పట్ల బాధ్యత’’- తరతరాలుగా మానవాళిని వెంటాడుతున్న శాశ్వతమైన ప్రశ్నలలో ఇది ఒకటి. ‘‘బాధ్యత లేకపోవడమే స్వేచ్ఛ’’అని మీరు అనుకుంటున్నారు.
ఒక శతాబ్దం క్రితం ఫ్రెడరిక్ నీషే ‘‘దేవుడు మరణించాడు, మనిషి స్వేచ్ఛ పొందాడు’’అంటూనే ‘‘ఇప్పుడు మీరు ఏమైనా చెయ్యొచ్చు. ఎలాంటి బాధ్యత లేదు’’అని కూడా అన్నాడు. అదే అతను చేసిన పెద్ద తప్పు.
దేవుడే లేనప్పుడు మొత్తం బాధ్యత మీపై పడుతుంది. ఒకవేళ దేవుడు ఉన్నట్లైతే ‘ఈ ప్రపంచాన్ని నువ్వే సృష్టించావు. పాప చింతనలు, అవినీతి విత్తనాలు మొదటినుంచి నువ్వే నాలో నాటావు. నువ్వే నన్ను అలా తయారుచేశావు. కాబట్టి, అన్నింటికీ బాధ్యత నీదేకానీ, నాది కాదు. నేనొక చిన్న జీవాన్ని. నువ్వు సృష్టికర్తవు. కాబట్టి, బాధ్యత నాదెలా అవుతుంది?’’అంటూ మీ బాధ్యతను ఆయనపైకి నెట్టేస్తారు. నిజంగా దేవుడు ఉన్నట్లైతే మీరన్నట్లు మీ బాధ్యతను ఆయన పంచుకోక తప్పదు. ఒకవేళ ఆయన లేకపోతే ఎవరు చేసే పనులకువారే బాధ్యులవుతారు. ఎందుకంటే, మీ బాధ్యతలను మరొకరిపై వేసేందుకు వేరే దారిలేదు.
మీరు స్వేచ్ఛగా ఉండండని నేనంటున్నానంటే అర్థం ‘‘మీరు చేసే పనిపట్ల బాధ్యతాయుతంగా ఉండండి’’అని. ఎందుకంటే, ఆ పని చేసేది మీరే కాబట్టి, దాని బాధ్యత కూడా మీదే అవుతుంది. అంతేకానీ, ఆ బాధ్యతను మీరు ఇతరులపై వెయ్యలేరు.
మీరు ఏ పనిచేసినా దాని బాధ్యత కూడా మీదే. అంతేకానీ, ఎవరో బలవంతంగా మీచేత ఆ పని చేయించారని మీరు చెప్పలేరు. ఎందుకంటే, మీరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరూ మిమ్మల్ని బలవంతపెట్టలేరు. ఒక పని చెయ్యాలో, వద్దో నిర్ణయించేది మీరే.
స్వేచ్ఛతోపాటే బాధ్యతకూడా వస్తుంది. నిజానికి, స్వేచ్ఛే బాధ్యత. కానీ, మనసు మహామోసకారి. అది ఎప్పుడూ దాని ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది. అలాగే అది ఎప్పుడూ ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకుని దానినే వింటుంది కానీ, సత్యాన్ని అర్ధం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు.
‘‘ఆపుకోలేని కోరికతో వేగలేని నేను రహస్యంగా అమ్మాయిలతో తప్పుచేసిన సిగ్గుతో చస్తున్నా’’అన్నాడొక రోగి మానసిక వైద్యునితో.
‘‘మీ బాధ అర్థమైంది. మీ కోరిక తగ్గిస్తాలెండి’’అన్నాడు వైద్యుడు.
‘‘కోరిక కాదయ్యా బాబూ, సిగ్గు తగ్గించు’’అన్నాడు ఆ రోగి కంగారుగా.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్