మెయిన్ ఫీచర్

సానుకూల తిరుగుబాటు( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేనితో వ్యతిరేకంగా చేసే పోరాటాన్ని సూచించే ‘రెబెలేర్’అనే లాటిన్ పదం నుంచి వచ్చి ‘రెబెల్’అనే పదం గురించి మీరు ఎప్పుడూ సానుకూలంగానే మాట్లాడతారు. అంటే, మీరు ఆ పదం అర్థాన్ని మార్చేస్తున్నారా?
లేదు. నేను ఆ పదం అర్థాన్ని మార్చట్లేదు. దాని అర్థాన్ని మీకు పూర్తిగా వివరిస్తున్నా. ఎందుకంటే, ఇంతవరకు ఆ పదం ప్రతి కూలార్థాన్ని మాత్రమే మీకు చెప్పారు. అది కేవలం సగం అర్థం మాత్రమే. మిగిలిన సగం అర్థాన్ని అనేక శతాబ్దాలుగా ఎవరూ చెప్పలేదు. చెప్పాలని ఇంతవరకు ఎవరూ ప్రయత్నించలేదు. అందుకే మీకు ఆ పదం ప్రతికూలార్థం మాత్రమే తెలిసింది కానీ, సానుకూలార్థం తెలియలేదు. కాబట్టి, మిగిలిన సానుకూలార్థాన్ని నేను మీకు పూర్తిగా వివరిస్తున్నా. ఎందుకంటే, సానుకూలత లేని ప్రతికూలతకు ఉనికి లేదు. దేనికో వ్యతిరేకంగాచేసే పోరాటం కేవలం ప్రారంభం మాత్రమే. కానీ, ఆ పోరాటం దేనికోసం?
‘రెబెల్’ అనే పదం ‘రెబెలేర్’ అనే లాటిన్ పదం నుంచి వచ్చిన మాట నిజమే. కానీ, అది ఆ ఒక్క పదానికి సంబంధించిన నిజం మాత్రమే కాదు. అది అనేక పదాలకు సంబంధించిన నిజం.
స్వేచ్ఛ అంటే ‘‘దేనినుంచో స్వేచ్ఛ’’ అనే దురభిప్రాయమే మనుషుల మనసుల్లో ఉంది. అందుకే వారు ‘‘దేనికోసమో స్వేచ్ఛ’’గురించి ఎప్పుడూ అడగరు. ‘‘దేనినుంచో స్వేచ్ఛ’’అవసరమే. కానీ, అది ప్రతికూల భాగం మాత్రమే. మీకు సానుకూల లక్ష్యం లేకపోతే ‘‘దేని నుంచో స్వేచ్ఛ’’ అర్థరహితమవుతుంది. ‘‘దేని కోసం పోరాడుతున్నారు? దాని లక్ష్యమేమిటి?’’ అనే విషయాలు మీకు స్పష్టంగా తెలియాలి.
‘‘తిరుగుబాటు, తిరుగుబాటుదారుడు’’ గురించి భాషాశాస్తవ్రేత్తలు నిఘంటువులలో ప్రతికూలార్థం రాసినందువల్లనే అవి ఖండనకు గురయ్యాయి. ‘‘తిరుగుబాటు దేనికోసం?’’అని అడిగినవారు ఎవరూ లేరు. అదే అడగవలసిన అసలైన ప్రశ్న. నా దృష్టిలో ప్రతికూల భాగం కేవలం ప్రారంభంమాత్రమే కానీ, ముగింపుకాదు. సానుకూల భాగం మాత్రమే నా దృష్టిలో ముగింపు. వృత్తాన్ని పూర్తిచేసేది అదే.
మూఢ నమ్మకాలకు, మరణించిన వాటికి, జీవిస్తున్న వాటికి వ్యతిరేకంగా మీరు తిరుగుబాటు చేశారు. అలాగే మీరు సత్యంకోసం కూడా తిరుగుబాటు చేశారు. లేకపోతే, మీరు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చెయ్యవలసిన అవసరమేమిటి? ప్రతికూలమైన ప్రతి తిరుగుబాటు అసంపూర్ణమే, వృథాయే. సానుకూలమైన తిరుగుబాటు మాత్రమే అర్థవంతమైన ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.
గుర్తుంచుకోండి. సమాజం కొన్ని పదాలకు ప్రతికూలార్థం మాత్రమే ఇచ్చిందంటే అర్థం వాటికి అది వ్యతిరేకమని. అది అసలైన తిరుగుబాటుకు మాత్రమేకాదు, ‘‘తిరుగుబాటు’’ అనే పదానికి కూడా వ్యతిరేకమే. ఎందుకంటే, ఆ పదానికి సమాజం అలాంటి ప్రతికూల రంగులద్దింది. సానుకూల సౌందర్యమొక్కటే ఆ పదానికి సానుకూల రంగులద్దగలదు.
‘‘తిరుగుబాటు’’ పదానికున్న అర్థాన్ని నేను మార్చట్లేదు. చాలా కాలంగా దాని అర్థం అసంపూర్ణంగానే ఉంది. తుది మెరుగులతో దాని అర్థాన్ని పూర్తిచేసినప్పుడే పోగొట్టుకున్న సౌందర్యాన్ని అది మళ్ళీ సంతరించుకుంటుంది. అందుకే నేను ఆ పదానికున్న అర్థాన్ని పూర్తిచేస్తున్నా.
జీవన విధానాలన్నింటి పట్ల సమాజం చాలా మోసపూరితంగానే ఉంది. అది మాటలను, భాషను, అన్నింటినీ చాలా తెలివిగా మోసం చేస్తుంది. అందుకే అది ఇంకా స్థిరంగాఉంది. కాబట్టి, భాష కూడా గత కాలపు బంధనాల నుంచి బయటపడాలి. తిరుగుబాటు, విప్లవం, స్వేచ్ఛలాంటి అందమైన పదాలు వాటి ప్రతికూలార్థాలనుంచి బయటపడాలి. అది సాధించేందుకు ఏకైకమార్గం ప్రపంచ కేంద్రాన్ని సానుకూలంగా మార్చడమే.
సానుకూలతను సాధించేందుకు చేసే సన్నాహమే ప్రతికూలం. చక్కని తోటను తయారుచెయ్యాలంటే ప్రతికూల భాగమైన కలుపుమొక్కలను వేర్లతోసహా పెకలించాలి. అది చేసినంతమాత్రాన చక్కని తోట తయారవదు. సానుకూల భాగమైన చక్కని చెట్లను, పూల మొక్కలను నాటాలి. కాబట్టి, సానుకూలమైనది సంభవించేందుకు రంగాన్ని సిద్ధంచేసేది ప్రతికూల భాగం మాత్రమే.
ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్