మెయిన్ ఫీచర్

ప్రాధాన్యం ఆధ్యాత్మికానికే (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాటిని మీరు ఎన్నిటికి గద్దెదించగలరో కచ్చితంగా చెప్పలేరు. ఎందుకంటే వాటి స్థానాన్ని ఏదీ భర్తీ చెయ్యలేదు. పైగా, ఏ నిరంకుశత్వాలు శాశ్వతంగా ఉన్నది లేదు. వాటి రోజులు పరిమితం.
ప్రజల సంకల్పాలను ఎవరూ నాశనం చెయ్యలేరు. నిరంకుశులు తమ అధికార సామ్రాజ్యం కోసం ప్రజలను బానిసలుగా చెయ్యగలరు. ఖైదుచెయ్యగలరు. లేదా చంపగలరు. కానీ వారిని వారి నిరంకుశత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఏదో ఓక రోజు వారికి తెలుస్తుంది. అయినా వారికి ఏమీకాదు. వారిని ఎవరూ ఏమీ చేయలేరు. కాలక్రమంలో నూతన నిరంకుశుడు వస్తాడు. మీరు పాత నిరంకుశత్వం నుంచి సనూతన నిరంకుశత్వానికి బదిలీ అవుతారు. దాని చేతిలో చివరికి బలి అయ్యేది పాత నిరంకుశత్వం పాత నిరంకుశల స్థానాన్ని భర్తీ చేస్తుంది.
ఎవరు ఎలా మరణించారు. ఎవరు ఎలా చంపబడ్డారు అనేది ఒక విషయమే కాదు అందరూ మనుషులే . అందరూ మీ అన్నదమ్ములు తోబుట్టువులే కానీ అలా జరిగేందుకు కూడా తర్కబద్ధమైన కారణముంది. విప్లవకారులుగా మారిన వారందరూ అలాగే ఉండేందుకు అలవాటుపడతారు. కానీ ప్రతీ పాలనాధికారులు విప్లవానికి వ్యతిరేకమే. ఆ పాలనాధికారం విప్లవకారులు స్వయంగా కష్టపడి సాధించుకున్నదే కావచ్చు. కానీ ఒకసారి అధికారం విప్లవకారుల చేతికి చిక్కిన వెంటనే వారు విప్లవానికి వ్యతిరేకులుగా మారిపోతారు. విప్లవం వారి అధికారానికి వ్యతిరేకమవుతుంది. ఒకప్పుడు వారు విప్లవానికి మద్దతినిచ్చిన వారే. విప్లవమే వారికి అధికారాన్ని కట్టబెట్టింది. పాలనాధికారులు మారారు. కానీ పరిస్థితిలో ఎలాంటి మార్పులేదు. అదే పెత్తందారి వ్యవస్థ. అదే నిరంకుశాధికారంతో కూడిన అసహ్యకరమైన మురికి రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఇదంతి ప్రత్యక్షంగా చాలా స్పష్టంగా తెలుస్తున్నా అధికారాన్ని చేజిక్కించుకున్న విప్లవకారులందరూ ఇలాంటి స్వేచ్ఛ కోసమా యుద్ధం చేశాం అని ఎప్పటికీ నమ్మలేరు. పైగా వారు చేసిన విప్లవానికి మద్ధతు సాధించేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అధికారం చేతికి రాగానే మరిచిపోయి అద ప్రజలను దోచుకోవడం ప్రారంభిస్తారు.
అంతేకాదు, అధికారం దక్కిన వెంటనే తమతోపాటు గతంలో ఒకప్పుడు శత్రువుతో బాహాబాహీ పోరాడిన అనేకమంది విప్లవకారులను కూడా పక్కన పెట్టడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, విప్లవం ఎప్పుడూ విశ్వాసఘాతుకానికే గురైంది. అందుకే అధికారంలోకి వచ్చిన విప్లవ కారులందరూ మిగిలిన విప్లవకారులందరినీ చంపడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, వారందరూ పాత పాలకులను పారద్రోలినవారే. అలాగే వారు ఇపుడు తమను కూడా తరిమెయ్యగల అతి ప్రమాదకరమైన సమర్థులే. కాబట్టి, అది చాలా క్లిష్టమైన ఆట. దానికి మీరు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. ఎలాంటి నిరంకుశత్వం నడుస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా మీరు మీ అభివృద్ధికే ప్రాధాన్యత ఇవ్వాలి.
ఎందుకంటే, నిరంకుశత్వం ఎప్పుడూ హత్యాత్మక, నేరపూరిత నిరంకుశత్వమే. కాబట్టి, నిర్దయగా చంపినవారే నిరంకుశలవుతారు. అందుకే నూతన పాలనలో కూడా ప్రజలందరూ అదే భయాలను భరిస్తూ, అదే మురికికూపంలో మగ్గిపోతారు. కాబట్టి, ఎప్పుడూ అందమైన భవిష్యత్తుపై ఎక్కువగా ఆశలు పెట్టుకోకండి.
చరిత్ర ఎప్పుడూ మనకు వేరే ఏదో బోధిస్తుంది. స్వతంత్ర పోరాటానికి నేను వ్యతిరేకిని కాదు. కానీ, దానికే ప్రాధాన్యత ఇవ్వకండి. ఇతరులెవ్వరూ దోచుకోలేని మీ ఆధ్యాత్మిక స్వేచ్ఛే మీకు ప్రాధాన్యం కావాలి. అపుడుకూడా మీరు నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చెయ్యగలిగితే దానిని నేను పూర్తిగా సమర్థిస్తాను. కానీ, అది అంత సులభమైన పనికాదు. నిజానికి అది చాలా కష్టమైన పని. మీరు ప్రభుత్వాలతో పోరాటం ప్రారంభించిన వెంటనే అందులో చిక్కుకున్న మీరు మిమ్మల్ని పూర్తిగా మరిచిపోతారు.
ఏ రకమైన బానిసత్వంలో వున్నా అది అసహ్యకరమైనదే. అసలైన బానిసత్వం ఆత్మకు సంబంధించినది. దానికి గతం నుంచి, దేశం నుంచి, మతం నుంచి స్వేచ్ఛ కలిగించండి. ఎందుకంటే, మీరు అలా పెరిగారు. మీ సత్యానే్వషణే మీకు అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైనదిగా అవాలి. మీకు ఇంకా శక్తి వుంటే రాజకీయ నిరంకుశత్వాలతో పోరాడండి. కానీ, మీకు నిరాశ తప్పదు.

ఇంకావుంది...

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్