మెయిన్ ఫీచర్

అభిరుచికి తగ్గ పని చేయని సగటు మనుషులు(ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారు ఒకే వాయిద్యాన్ని, ఒకే నాట్యాన్ని అతి సూక్ష్మ వైవిధ్యాలతో చాలా చక్కగా ప్రదర్శిస్తారు. ఎవరి శైలి వారిదే. కానీ, అది మంచి సహచర్యం కాదు. మరీ ముఖ్యంగా ఆ ధనికుని దృష్టిలో అది కచ్చితంగా మంచి సహచర్యం కాదు. అయితే ఘరానాపై ఆసక్తిలేని అతని కొడుకు తండ్రిమాట వినకుండా సంగీత విశ్వవిద్యాలయంలో చేరాడు. తన మాట వినలేదన్న కోపంతో ఆ ధనికుడు కొడుకును వదిలేశాడు. చదువు ముగిసినా విశ్వవిద్యాలయంలో ఉద్యోగం రాకపోవడంతో వేరే దారిలేక అతను ఒక చిన్న సంగీత పాఠశాలలో ఉపాధ్యాయుడుగా చేరాడు. అతని తండ్రి మళ్ళీ నాదగ్గరకొచ్చి ‘‘చూశారా, నేను చెప్పినట్లే జరిగింది. నా పెద్ద కొడుకు ఇంజనీరు, తరువాత వాడు ప్రొఫెసర్, ఇదిగో, ఈ మూడోవాడు నామాట విననందుకు ఇలా తగలడ్డాడు. నా ఆస్తిలో వాడికి ఒక్కపైసా కూడా ఇవ్వను. వాడు అలా చాలీచాలని జీతంతో ఉపాధ్యాయుడుగా బతకాల్సిందే’’ అన్నాడు ఆవేశంతో.
అయితే అతని కొడుకు తనకునచ్చిన పని చేస్తున్నందుకు చాలా సంతోషంగానే ఉన్నాడు. కుటుంబంనుంచి వెలివేసినా, ఆస్తిదక్కకపోయినా అతడు ఏమాత్రం బాధపడకుండా పేద జీవితానికే సిద్ధపడ్డాడు. పైగా, అతడు ‘‘కుటుంబం పరువు గురించి ఆలోచించే ఇంతవరకు ఘరానాకు వెళ్ళలేదని, ఇప్పుడు నన్ను కుటుంబంనుంచి వెలివేశారు కాబట్టి హాయిగా ఘరానాకు వెళ్ళి అనేక విషయాలు తెలుసుకోవచ్చని, అన్నీ తన మంచికే జరిగాయని’’ ఆనందం వ్యక్తంచేశాడు.
అలా, అతడు సంగీత ఉపాధ్యాయుడుగా పనిచేస్తూనే ఘరానాలోచేరి, అనేక విషయాలు తెలుసుకుని భారతదేశంలోని గొప్ప సంగీత విద్వాంసులలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. అలా పేరుతెచ్చుకోవాలనేది అతని అభిమతం కాకపోయినా, అతని సామర్థ్యంమేరకు అతను కోరుకున్నది సాధించాడు. అదే ఇక్కడ మనం ఆలోచించవలసిన ముఖ్య విషయం. కాబట్టి, మీరు మీ సామర్థ్యాన్ని అనుసరిస్తున్నంతవరకు మీరు ఎప్పుడూ ఉన్నతంగానే ఎదుగుతారు. లేకపోతే, మీరు మధ్యస్థంగా మిగిలిపోయి సగటు మనిషిగా తయారవుతారు.
సమాజంలో దాదాపు అందరూ వారి అభిరుచికి తగిన, వారు చెయ్యగల పని చెయ్యకుండా వేరే పని చేస్తున్న సగటు మనుషులే. అందుకే వారు చేస్తున్న పని ఉత్తమంగా ఉండకపోగా, ఆ పనిలో వారికి ఆనందం, సంతృప్తి లభించదు.
పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనది. అతి సున్నితమైనది. ఎందుకంటే, పిల్లల జీవితం పూర్తిగా దానిపైనే ఆధారపడి ఉంటుంది. అందువల్ల పిల్లలు ఏ పనిచెయ్యాలని ఆశిస్తున్నారో తెలుసుకుని ఆ పనిలో వారికి మీ సహకారాన్ని అందిస్తూ ప్రోత్సహించండి. అంతేకానీ, మీ కోరికమేరకు ఎలాంటి సానుకూల ప్రణాళికను వారిపై రుద్దకండి.
చిన్నతనంలో నాకు చెట్లు ఎక్కి చిటారు కొమ్మనుంచి చుట్టూచూడడం చాలా ఇష్టం. కానీ, మా నాన్నగారు ‘‘కొమ్మలు విరిగి కిందపడితే ఎముకలు విరుగుతాయి. ఏ చెట్లు దృఢమైనవో, ఏ చెట్లు దృఢమైనవి కావో నీకు తెలియదు. కాబట్టి, చెట్లు ఎక్కకు’’అనేవారు. ‘‘నేను చెట్లు ఎక్కడం మానను. అయినా అలా నన్ను అడ్డుకునేకన్నా, ఎలాంటి చెట్లు ఎక్కొచ్చో, ఎలాంటి చెట్లు ఎక్కకూడదో మీరే దగ్గరుండి చూపించండి లేదా ఆ విషయాలు నేర్పే వ్యక్తిదగ్గరకు నన్ను పంపి ఆ విద్య నేర్పించండి. అప్పుడు నా సరదా తీరుతుంది, మీకు ఎలాంటి భయమూ ఉండదు, నాకు ఎలాంటి ప్రమాదము రాదు. ఒక తండ్రిగా అది మీ ధర్మం’’అని నేను ఆయనతో వాదించాను. నా పట్టుదల తెలిసిన మా నాన్నగారు చివరికి చెట్లు ఎక్కడంలో చాలా అనుభవమున్న ఒక వృద్ధుని వద్దకు నన్నుతీసుకెళ్ళి ‘‘మా అబ్బాయికి మీదగ్గర ఉన్న విద్యను పూర్తిగా నేర్పండి’’అన్నారు. ‘‘ఇలా ఒక తండ్రి తన కొడుకును నా దగ్గరకు తీసుకురావడం ఇదే ప్రథమం. మీకోసం తప్పకుండా మీ అబ్బాయికి అన్ని విషయాలు నేర్పుతాను’’అన్నాడు ఆ వృద్ధుడు. అలా ఆయనదగ్గర అన్ని విషయాలు నేర్చుకున్నాను.
పిల్లల విషయంలో తల్లిదండ్రుల పాత్ర చాలా విలువైనది. ఎందుకంటే, వారు ఏమీ తెలియని, ఏదో సామర్థ్యమున్న ఒక కొత్త అతిథిని ఈ ప్రపంచంలోకి తీసుకొస్తున్నారు.
ఇంకావుంది...
ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు ‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్, ఫోన్:040-24602946 / 24655279,
నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్ ఫోన్: 9490004261, 9293226169.

అనువాదం: భరత్