మెయిన్ ఫీచర్

నేను శరీరాన్ని కాదు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ భౌతిక శరీరంలో ఈ ప్రశాంతత, మీ చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మీ చుట్టూ వున్న వాటితోటి వచ్చే ఈ వౌలిక ప్రశాంతత ఎంతో ముఖ్యం. ఏది ఏమి జరుగుతున్నా, అప్పుడు ఒకరకమైన నిశ్చలత్వం వస్తుంది. అదే ఎంతో ముఖ్యమైనది.
మీరు ఒక విషయం తెలుసుకోవాలి - ఏదైతే ఒక స్థాయి హాయికి చేరుకోలేదో అది మిమ్మల్ని వదిలి పెట్టడానికి సిద్ధంగా ఉండదు. ఏదయితే హాయిగా లేదో అది ఎప్పుడు మిమ్మల్ని పట్టుకుని ఉంచుకుంటుంది. మీరు ఇక్కడ కూర్చుని ‘నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు’ అన్నా సరే, మీ శరీరం అది వినదు. అది మిమ్మల్ని భౌతికతను దాటి పోనివ్వదు. మీ శరీరం, మీ దేహం ఒక రకమైన హాయిగా ఉన్న స్థితికి చేరుకోవాలి. అప్పుడు మీ శరీరం మీరు ఆవలకి చేరుకోవడానికి సరే అంటుంది. అది సరే అనకపోతే మీకు మరో మార్గం లేదు.
అందుకని ఈ దేహాన్ని ఒక హాయిలో ఉంచడం అన్నది ఎంతో అవసరం. ఈ సమయానికి, అంటే మహాశివరాత్రి వచ్చేవరకు దీనికి ఎంతో ప్రాముఖ్యత చెందింది. ఇది ఈ పంచభూతాలు ఎలా ప్రవర్తిస్తాయి అన్నదాన్ని బట్టి ఈ భూమండలం ఎలా ఉంటుంది అన్నదాన్ని బట్టి మీరు కనుక మీ సాధన సరైన క్రమంలో చేసినట్లయతే అవి ఎంతో ఫలవంతంగా ఉంటాయి. సాధనా సమయం అంటే మీరు నమ్రతతో ఉండాల్సిన సమయం. మీరు ఈ భూమండం మీద మరొక ప్రాణి అంతే. మీరు మీ గురించి ఏదో ఆలోచించుకుంటూ ఉండి ఉండచ్చు. కానీ నిజం ఏవిటంటే మీరు ఈ భూమండలం మీద మరో ప్రాణి మాత్రమే. మీరు కేవలం ఇలా మరో ప్రాణిగా ఉండగలిగితే, ఇది ఎంతో గొప్ప విషయం. ఇది ఎంతో అద్భుతమైన వరం. మీరు ఈ భూమండలం మీద మరో ప్రాణి అంటే ఈ సృష్టి కర్త మిమ్మల్ని సృజించారని అర్ధం. మీరు ఓ చీమైనా, ఓ పురుగయినా, ఓ బొద్దింకయినా సరే, లేదా ఓ మనిషి ఐనా సరే మీరు ఈ భూమండలం మీద ఓ ప్రాణి అంటేనే ఈ సృష్టికర్త స్పర్శ మీకు తగిలిందని అర్థం. మీకు మీరు ఓ భిన్నమైన వ్యక్తి అని మీరు ఆలోచించుకుంటూ ఉండి ఉండచ్చు. మీరు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు నేను ఓ భిన్నమైన ప్రాణినా లేదంటే ఈ సృష్టిలో ఓ భాగాన్నా అని ఆలోచించాలి. మీరు ఒక్కసారి ఇది ప్రయత్నించి చూడండి - మీరు నోరు మూసేసుకొని, మీ ముక్కు మూసి ప్రయత్నించి చూడండి. కొన్ని క్షణాల్లోనే, మీ అంతట మీరు ఇక్కడ జీవించడం లేదు అని మీకు తెలుస్తుంది. ఈ సృష్టి అన్నది ఎప్పుడూ మీకు ఊతాన్ని ఇస్తూ ఉంటేనే మీరు ఇక్కడ ఉండగలరు. లేదంటే, మీరు ఇక్కడ ఉండలేరు. ఒకసారి మీకు ఈ విషయం అర్ధమైదనుకోండి అప్పుడు ఈ వ్యవస్థంతా కూడా ఒక రకమైన హాయిగా ఉండే స్థితికి చేరుకుంటుంది. మీరు ఈ ఉనికిలో అలా హాయిగా ఎప్పుడు ఉండగలుగుతారు..? మీరు ఈ ఉనికిలో ఒక భాగమైనప్పుడు మాత్రమే...!
*