మెయిన్ ఫీచర్

భక్త జనవరదుడు శివుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అలంకార ప్రియో విష్ణుః
అభిషేకప్రియః శివః
నమస్కారప్రిః సూర్యః
గణేశః తర్పణ ప్రియః
అలంకరణ అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం. కాసిన్ని నీటితో అభిషేకం చేయడమంటే శివుడికి ప్రీతికరం. నమస్కారాలు చేయడమంటే సూర్యభగవానుడికి ఇష్టం. ఇప్పటికీ ఉదయం పూట, సాయంకాలంపూట సూర్యనమస్కారాలు, సంధ్యావందనం చాలామంది చేస్తుంటారు. శ్రేష్ఠం కూడా. అదేవిధంగా 54 రకాలయిన తర్పణాలు చేయడమంటే గణనాధునికి ఇష్టం.
వీటన్నింటిలోకి సాధారణ మానవునికి అతి సులువైనది, అందుబాటులో ఉండేది ఆ ఆదిశకరునికి అభిషేకం చేయడమే. శివుడి రూపాన్ని లింగరూపంలోనే చూస్తాము. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఎక్కడ ఏ పేరుతో పిలిచినప్పటికీ లింగరూపంలోనే తన భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాడు. ఏ దేవుణ్ణి కూడా అంటే శ్రీ వెంకటేశ్వరస్వామి, సత్యనారాయణస్వామి, కృష్ణుడు, శ్రీరాముడు ఎవరినైనా చూడటం తప్ప స్పర్శించే భాగ్యం ఉండదు. వీరిని అలంకరిస్తేనే, ఆభరణాలు పెడితేనే భక్తుల కంటికి అందంగా, సుందరంగా కన్పిస్తారు. కానీ శివుడ్ని ఎవరూ కూడా అలంకరణలో చూడాలని కోరుకోరు. ఎందుకంటే ఆ పరమేశ్వరుడు నిరాడంబరుడు కావడమే. శివుణ్ణి భస్మం, నీరుతో అభిషేకించి, బిల్వం, మారేడు దళాలు తనపై ఉంచితే ఆ కాస్త భాగ్యానికే పొంగిపోతాడు ఆ భోళాశంకరుడు. మరి అంతటి అదృష్టం లభించిన భక్తుడికి ఇంకెంత సంతోషం ఉంటుంది. నీళ్లు పోసినపుడు శివుడు చిన్నపిల్లోడికి చక్కలిగింతలు పెడితే ఎటువంటి కల్మషం లేకుండా నవ్వుతాడో, అదేమాదిరిగా ఆ ఈశ్వరుడు ఉబ్బిబ్బిబ్బయిపోయి భక్తులకు కష్టాలు కలుగకుండా చేస్తాడు. శివుణ్ణి కొలిచే దంపతులకు దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంటుంది. దంపతుల మధ్య ఎలాంటి అరమరికలు రావు. శివుడికి ఆడంబరం గా, నగలు, పూలతో పూజలు చేయాలనేది ఏమీ లేదు. పట్టువస్త్రాలు, పూలపాన్పులు అవసరం లేదు. కటికనేలపై తిరిగేవాడికి కష్టమెక్కడిది? పార్వతీదేవికి తన శరీరంలో సగ భాగమిచ్చి, గంగమ్మను తలపైన మోస్తూ తాను నడుస్తుంటే అడుగు వేసినపుడల్లా నెత్తిన వున్న గంగమ్మ ఒక్కొక్క బొట్టుగా తనపైన రాలుతుంటే ఆ ఉత్సాహంతో గంగాధరుడు వడివడిగా కదులుతుంటాడు. శివాలయాలన్నీ కూడా ‘ఓం నమశ్శివాయః’ అనే పంచాక్షరి మంత్రంతో మారుమ్రోగిపోతుంటాయి. ఆ మంత్రం పఠించేటపుడు నాభి నుండి శ్వాసను తీసి ఉచ్చరిస్తుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల్లో కూడా ఎంతో మాధుర్యం ఉంటుంది.
భక్తులు విష్ణుమూర్తికిఅలంకరణ చేయడంకన్నా, శివునికి అభిషేకం చేయడంలోనే తనివితీరా తృప్తిని పొందుతారు. ఎందుకంటే ఆ భగవంతున్ని తాకే అదృష్టం ఎవరికుంటుంది? ఎంతటి గొప్పవారైనా అంటే రాజకీయ నాయకులైనా, అధికారులైనా, విఐపిలైనా అలంకారప్రియుడైనటువంటి విష్ణుమూర్తివద్దకు గర్భగుడిలోకి వెళ్లి ఆ మూర్తిని తాకలేడు. కేవలం అటువంటి భాగ్యం మండపం వరకు మాత్రమే పరిమితం. నయనాలతో చూసి సంతోషించాల్సిందే మరి. అదే శివాలయాల్లోకి ప్రతిభక్తుడు కూడా వెళ్లి అభిషేకాలు చేసి, కోరికలు కోరుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి అభిషేకం తన భక్తులను ఇంకా తన దగ్గరికి చేసుకుంటుంది. ఆ లింగరూపుని తాకినంతనే భక్తులు పొంగిపోయి తమ జన్మ సార్థకమైందనుకుంటారు. ఇక ఈజన్మకు ఇంతటి అదృష్టం చాలు అనుకుంటారు. పరమేశ్వరుని ఆలయాలు అవి గ్రామాల్లో కావచ్చు, ద్వాదశ జ్యోతిర్లింగాల్లో కావచ్చు, ఎక్కడైనా ఆ రూపాలను తాకి అభిషేకించి ఆ తృప్తిని పొందే అవకాశం ఉంటుంది. కాస్త నీళ్లు పోసి, భస్మం రాసి, బిల్వపత్రాలు పెట్టినంతనే కష్టాలను పోగొట్టి కోరిన కోర్కెలను తీర్చుతాడు. శివున్ని పూజించేవారు కోటీశ్వరులు కాకపోవచ్చు. కానీ కష్టాలనుండి బయటపడగలుగుతారు. ఇది సత్యం.

-శ్రీనివాస్ పర్వతాల