మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సరిగా నడుమ, ముల్లుదగ్గర నిలువక త్రాసుదండి ఎప్పుడు ఒరగిపోవును. ఒకవైపున నున్న సిబ్బి రెండవ దానికంట బరువైనప్పుడేకదా? అటులనే కామినీ కాంచనముల భారము తనపై బడినప్పుడు -వానిచే లాగబడినప్పుడు- మనస్సు భగవంతునినుండి తొలగిపోవుచున్నది.
78.అడుగున సూది బెజ్జమంత చిల్లియున్నను కుండలోనున్న నీరంతయు క్రమముగా కారిపోవును. అటులనే సాధకునియందు ఏ మాత్రపు లోలత యున్నను వాని సాధనలన్నియు బూడిదెలో పోసిన పన్నీరగును.
79.కామమును పూర్తిగా వశమొనర్చుకొన యత్నింపుము. ఇందు కృతార్థుడవైన యెడల ఇంతవరకు బీజావస్థలోనున్న మేధానాడి బలపడుటచే శరీరములో నొక విధమైన మార్పు కలుగును. ఈ నాడి శరీరమునందలి క్షుద్రశక్తులను ఉత్తమశక్తులుగా మార్చు స్వభావము కలది. ఈ మేధానాడి బలపడినంతనే ఆత్మజ్ఞానము అలవడును.
80.కామినీ కాంచన వ్యామోహములో మునిగియున్న మనస్సు లేత పోక కాయవంటిది. పోక పచ్చగా నుండునంతవరకు పై బెరడునకు గట్టిగ నంటిపట్టుకొనియె యుండును. కాని యది పండి యెండినప్పుడు వక్కయు డొల్లయు వేరు పడి కదలించునప్పుడు వక్క లొటలొటలాడును. అటులనే కామినీ కాంచన వ్యామోహము ఇగిరిపోయినప్పుడు ఆత్మ శరీరముకంటె భిన్నమని బాగుగా గోచరించును.
81.మనస్సు భోగములపై ఆశ వీడి, నిర్మలమైనంతనే భగవానునిపై లగ్నము కాగలదు. బద్ధుడు ఈవిధముగా ముక్తుడగుచున్నాడు. భగవంతుని వీడి పెడత్రోవను బోవువాడే బద్ధుడు.
82.కామినీ కాంచన మోహము మనస్సు నుండి నిర్మూలనమైనప్పుడు మిగులునదేమి? కేవలము బ్రహ్మానందము.
కామమును జయించుటెట్లు?
83.పాములకు నిలయమైన ఇంటిలో నివసించువారు వాని వలన ఎప్పుడు ఏ కీడు మూడునో అని జాగ్రత్తగా నుందురు కదా? అటులనే సంసారులగు నరులు కామినీ కాంచనములు తమ్ము లోబరచుకొనకుండా మెలకువ గలిగి మెలగవలయును.
84.పాము కంటబడినప్పుడు ఇటులను నాచారము కలదు. ‘‘తల్లీ! మానసా! నీ తోకను మాత్రము అగపరచుచు, తలను దాచుకొని దూరముగా తొలగిపొమ్ము’’. అటులనే కామోద్రేకమును వురికొల్పు విషయ భోగములనుండి దూరముగా తొలగి వర్తించుటయే తెలివిగలపని. పతితులై తెలివి తెచ్చుకొనుటకంటె వాని సంసర్గము పొందకుండుటయే మేలు.
85.ఒక శిష్యుడు భగవద్ధ్యానము చేయుచు కాలము గడుపుచున్నను దుష్ట సంకల్పములు అపుడపుడు మనస్సులో బుట్టుచునే యున్నవని చెప్పి కామమును జయించుటెట్లని శ్రీరామకృష్ణునడిగెను. అందులకు శ్రీగురుదేవుడిట్లు బోధించెను: ‘‘ఒకని యొద్ద నొక కుక్క యుండెడిది. దాని నెత్తుకొని ముద్దాడుచు, దానితో ఆటలాడుచు, ఆ కుక్కను అతడు చాలా మక్కువతో బెంచుచుండెడివాడు. అది చూచి యొక జ్ఞాని కుక్కపై నంతటి మక్కువ కూడదని యాతని మందలించెను. ఏలన, కుక్క కేవలము జ్ఞానహీనమగు జంతువు గదా?
ఎపుడైనను ఆతని గరచినను కరవవచ్చును. దాని యజమానుడీబోధల నాలకించి యొడిలోనున్న కుక్కను ఆవలికి త్రోసివేసి, దాని నిక చేరదీయుటగాని, బుజ్జగించుటగాని కూడదని నిశ్చయించుకొనెను. కాని యా కుక్క యజమానునకు తనయందు దృష్టి మారినదని తెలియజాలక ఎప్పటివలెనే ఎత్తుకొని ముద్దులాడునను నాశతో తరచు వానియొద్దకు పరుగెత్తుచుండెడిది. ఎన్నియోసార్లు దెబ్బలు తినిన పిమ్మట తుదకు అది తన్ను లాలింపుమని యజమానునిక బాధించుట మానివేసెను. నీ స్థితియు అటులనే యున్నది. నీ యంతరంగమున నీవింతవరకు బుజ్జగించిన కుక్కను నీవు వదలించుకోదలచినను సులభముగా నిన్నది విడువదు. అయినను భయములేదు లెమ్ము. ఆ కుక్క నిక బుజ్జగింపక నీదరి జేరినపుడెల్ల చీకొట్టుచుండుము, కొట్టుచుండుము, నీచే లాలనపొందుటకై నిన్ను పీడించుచున్న యా కుక్క (కామము) కొంతకాలమునకు నిన్ను విడిచివేయుము.
86.కామినియ కాంచనమును లోకమునందతయు సంసార సాగరమున -పాపపంకిలమున- ముంచివేసినవి సుమీ! స్ర్తిని నీవు సాక్షాజ్జగజ్జనని యను భావముతో జూచినయెడల ఆమె వలన నీకెట్టి ప్రమాదమునుండదు.
ఇంకావుంది...
శ్రీ రామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి