మెయిన్ ఫీచర్

యువతకు వైతాళిక మహర్షి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వేచ్ఛ చిన్న చిన్న ముక్కలుగా రాదు. అలాగే, బానిసత్వం చిన్న చిన్న ముక్కలుగా పోదు. గదిలో ఉన్న చీకటి దీపం వెలిగించిన వెంటనే పోతుంది. అంతేకానీ, కొద్దికొద్దిగా చీకటిపోవడం, కొద్దికొద్దిగా వెలుగు రావడం జరగదు.
స్వేచ్ఛ అంటే మీరు అన్ని బంధనాల నుంచి పూర్తిగా బయటపడినట్లు. అంతేకానీ, అది కాలానికో, నిదానానికో సంబంధించిన విషయం కాదు.
బంధనాలన్నింటినీ తెంచుకోవడం తప్ప మీకు మరొక దారి లేదు. వాటిని మీరే మీ చిన్నప్పటినుంచి ‘‘పెద్దల పట్ల అణకువ, తల్లిదండ్రల పట్ల ప్రేమ, పూజారుల పట్ల నమ్మకం, గురువుల పట్ల గౌరవం’’ లాంటి మంచి మంచి పేర్లతో మీ చుట్టూ సృష్టించుకోవడం మొదలుపెట్టారు. మీరు బాగా లోతుగా పరిశీలించి చూస్తే అందమైన పేర్లతో బానిసత్వాన్ని మీకు బాగా అంటగట్టినట్లు తెలుసుకుని ఆశ్చర్యపోతారు.
మా నాన్నతో నాకు ఎప్పుడూ గొడవే. ఆయన చాలా అవగాహన కలిగిన ప్రేమికుడే అయినా ‘‘నువ్వు ఆ పని చెయ్యాల్సిందే’’ అని నన్ను ఆజ్ఞాపించేవారు. అది నాకు నచ్చేది కాదు. అందుకే నేను ఆయనతో ‘‘అలా ఆజ్ఞాపించకండి. అది బానిసత్వ దుర్గంధం కొడుతోంది. ఆ కంపు నేను భరించలేను. కావాలంటే ‘‘నీకు నచ్చితే చెయ్యి, లేకపోతే చెయ్యకు’’ అనండి. ఆ పని చెయ్యాలా, వద్దా అనేది నా ఇష్టం కానీ, మీ ఇష్టం కాదు.
మీరు చెప్పిన పని చెయ్యాలో, వద్దో నన్ను ఆలోచించుకోనివ్వండి. నాకు నచ్చితే చేస్తాను, నచ్చకపోతే చెయ్యను. ఒకవేళ, ఆ పని నేను చెయ్యకపోతే మీరు కోపగించుకోకండి. నేను ‘‘మీ మాట పాటించను అనట్లేదు. అలా ఆజ్ఞాపించకండి, అంటున్నాను. నేను సత్యానికి, స్వేచ్ఛకు, ప్రేమకే తల వంచుతాను. వాటికోసం నేను అన్నింటినీ త్యాగం చేస్తాను. అంతేకానీ, బానిసత్వానికి నేను ఏమాత్రం తల వంచను. ఈ జీవితం నాది. నా బతుకు నన్ను బతకనివ్వండి. నన్ను ఆజ్ఞాపించకండి. ఎలాంటి పరిస్థితిలోనూ నేను ఎవరి నుంచి ఎలాంటి ఆజ్ఞలను స్వీకరించలేను, వాటిని పాటించలేను’’ అనేవాడిని. నేను ఎవరికీ తలవంచనని ఆయన త్వరగానే అర్థం చేసుకున్నారు. దాంతో ఆయన నన్ను ఆజ్ఞాపించడం మానుకుని ‘‘ఈ పని చెయ్యాలి. నీకు నచ్చితే చెయ్యి. లేకపోతే, నీ ఇష్టం’’ అనేవారు నాతో. వెంటనే నేను ‘‘అసలైన ప్రేమ ఇలా ఉండాలి’’ అనేవాడిని ఆయనతో. చాలావరకు ..మనిషి జీవితం చాలా చిన్నది. కాబట్టి, దాని పట్ల చాలా నిర్ణయాత్మకంగా ఉండండి. మీరు మీ ఆత్మలో స్వేచ్ఛగా ఉండాలి. అదే అసలైన స్వేచ్ఛ. మనిషి ఆత్మతో జన్మించాడు కానీ, వ్యక్తిత్వంతో జన్మించలేదు. ఆత్మకు (సోల్), వ్యక్తిత్వానికి (సెల్ఫ్) నిఘంటువులలో ఒకే అర్థం చెప్పడం జరిగింది. కానీ, అది నిజం కాదు. ఆత్మానే్వషణకు అనేక సంవత్సరాల తీర్థయాత్ర చెయ్యాల్సివస్తుంది. అంతవరకు మీరు ‘‘ఒక ఊరు, పేరు లేని, ఎవరో ఏమిటో తెలియని బికారిలా, ఏమీ లేకుండా ఉండడాన్ని’’ ఏమాత్రం భరించలేరు.
కేవలం ప్రేమ వల్లనే వ్యక్తిత్వాన్ని సృష్టించడం జరిగింది. అందుకే ఆది నుంచి మీరొక వ్యక్తిగా భావించడం ప్రారంభించారు. లేకపోతే, మీరెలా జీవిస్తారు? మిమ్మల్ని ఎలా సంబోధించాలి? వ్యక్తిత్వ భావనను సృష్టించిన వారందరూ సదభిప్రాయాలున్నవారే. ఎందుకంటే, వారి ఆత్మల గురించి వారికి ఏమాత్రం తెలియదు. అందుకే వారు అవాస్తవ వ్యక్తిత్వాన్ని సృష్టించి అలాంటి వ్యక్తిత్వంతోనే మరణించారు. అందుకే ఈ అస్తిత్వం వారిని ఎందుకు అలా తయారుచేసిందో వారు ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు. మీ ఆత్మ ఈ అస్తిత్వంలో ఒక భాగం. మీ వ్యక్తిత్వం ఒక సామాజిక వ్యవస్థ.
కాబట్టి వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎఫ్పటికీ పూడ్చలేమని ముందుగా మీరు గుర్తుంచుకోవాలి. మీరెవరో నిజంగా తెలుసుకోవాలనుకుంటే మీ వ్యక్తిత్వాన్ని మీరు సమూలంగా నాశనం చెయ్యాల్సిందే. మీరు ఒక్కొక్కప్పుడు ఆత్మగానూ, ఒక్కొక్కప్పుడు వ్యక్తిత్వంగానూ ప్రవర్తిస్తారు. అలా విభజించబడడంవల్ల మీరు నిరంతర ఒత్తిడిలో ఉంటారు. అందువల్ల మీ జీవితం చాలా ఆదుర్దాగా, బాధాకరంగా తయారవుతుంది. అలాంటి జీవితాన్ని మీరు ఎప్పటికీ జీవించలేరు, భరించలేరు. అందుకే తల్లిదండ్రులు, విద్యావిధానం, పూజారులు- సమాజం- ఇలా మీ చుట్టూ ఉన్నవన్నీ మీరు మీ లోపల దాగిఉన్న ఆత్మను ఎఫ్పటికీ తెలుసుకోకుండా ఉండేందుకు కావలసిన దృఢమైన వ్యక్తిత్వాన్ని సృష్టించేందుకు అన్ని రకాల మార్గాలలో ప్రయత్నిస్తారు.
ఆ ప్రయాణం ఏమంత దూరం కాకపోయినా, అది కచ్చితంగా చాలా ప్రయాసతో కూడుకున్న ప్రయాణమే. వ్యక్తిత్వమనేది చిన్న విషయం కాదు. అది చాలా క్లిష్టమైనది. వ్యక్తిత్వం అధిక ధనాన్ని, అధికారాన్ని, పరువు, ప్రతిష్టలను పోగుచేస్తూనే ఉంటుంది. దాని ఆశలకు అంతుండదు. అలా మీరు మీ వ్యక్తిత్వానికి అనేక హంగులు తగిలిస్తూనే ఉంటారు. మనిషిని ముఖ్యంగా బాధపెట్టేది అదే.
‘‘తాను ఇది, తాను అది’’ అని మనిషి నమ్ముతూనే ఉంటాడు. మీరు అనుకొన్నవేవీ నిజాలు కావు అవి మీరు చేసే పనులే తప్ప మీ వాస్తవాలు కాదు. మీరు పుట్టిన మరుక్షణం నుంచే మీ తల్లిదండ్రులు మిమ్మల్ని వారికి కావలసినట్లుగా తయారుచేయడం ప్రారంభిస్తారు.
ఉదాహరణకు, మీరొక వైద్యుడు, ప్రధానమంత్రి, చివరికి రాష్టప్రతి అయినా ఎవరు ఎవరైనప్పటికీ వారికి వారి వాస్తవ స్వరూపాలు తెలియవు. అలా అవాస్తవ అహం, అవాస్తవ వ్యక్తిత్వాలు మీలో ప్రవేశించి మిమ్మల్ని అలాగే తయారుచేస్తాయి. అందువల్ల మీరు మీ వాస్తవాన్ని మరచిపోవడం జరుగుతుంది.

- యర్రమిల్లి విజయలక్ష్మి