మెయిన్ ఫీచర్

హిందూమత దివ్యత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మతపరమైన ఘర్షణలు మరియు యుద్ధాలు, మత మార్పిడులు మరియు మత ప్రచారము సమాంతరంగా సాగే కలియుగంలో ప్రస్తుతం మనము జీవిస్తున్నాము. మత విశ్వాస ప్రచారం చేయడానికి టీవీ, సమావేశాలు మరిఅయు ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయడం వంటి సాధానాలు అన్నీ ఉపయోగించబడుతున్నాయి. ‘‘ఎందుకీ ఘర్షణలు మరియు యుద్ధాలు జరుగుతున్నాయి’’ అని ప్రశ్నిస్తే, వారి మతం శాంతియుతమైనదని పేర్కొంటూ ఇతర మత విశ్వాసాలను నిందిస్తారు. వేలాది సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్న మతపరమైన యుద్ధాలకి సంబంధించిన కారణాలను మరియు పైన ప్రస్తావించిన అతి ముఖ్యమైన ప్రశ్నకు ఏ ఒక్కరూ కూడా సమాధానం కనుక్కోవడములో ఎందుకు విజయం సాధించలేదన్న విషయాలను పరిగణలోకి తీసుకొని మనం పరిశీలిస్తే బహుశా ఇతర మతాలు అసలు ప్రయత్నించలేదన్న నిర్ధారణకి రావలసి వస్తుంది.
పైన ప్రస్తావించిన వాస్తవము చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సమస్యకి కారణాలను వెలుగులోకి తీసుకురావాలన్న ప్రయత్నంలో ఆధ్యాత్మికంగా ఆలోచించే ఏ వ్యక్తి అయినను ఈ విషయం గురించి పరిశీలించి, విశే్లషించి వారి భావాలను వ్యక్తం చేస్తారు. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ సత్యం మనకు అనుకూలముగా ఉండకపోవచ్చని మనము గుర్తుంచుకోవలసిన విషయం. ఇతర మతాలవారు సత్యాన్ని తెలుసుకోవడానికి భయపడుతున్నారా ?
ఎప్పుడైతే సత్యం మనకు అనుకూలముగా లేదని తెలుసుకుంటామో అప్పుడు రాజకీయ సంబంధిత పరిణామాలు ఉంటాయి. అంటే ప్రజలలో ఆవిశ్వాసం మీద నమ్మకం తగ్గుతుంది. అదే మతపరమైన యుద్ధాల వెనుక ఉన్న నిజమైన కారణాలను ప్రజలు తెలుసుకోనీకుండా నివారించటమే నిజమైన కారణం. ఈ యుద్ధాలకు అంతం లేదన్న బాధాకరమైన నిజం ఈ అభిప్రాయానికి వచ్చేలా చేస్తుంది.
భగవద్గీత పై ఎన్నో వ్యాఖ్యానాలు ఉన్నా ఇప్పటికీ సూక్ష్మమైన, సున్నితమైన ప్రశ్నలకు సమాధానాలు మిగిలి ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానాలు దొరికేంతవరకు ఈ దివ్య సందేశం సంపూర్ణంగా అర్థం కాదు. కనుక గీత, మహాభారతం మరియు వేదాలపై ఉన్న కొన్ని ప్రముఖమైన ప్రశ్నలకు పరిగణలోకి తీసుకొని వాటికి సమాధానాలు ఇచ్చాము. ఈ వ్యాసాలు గీతలో ఉన్న ప్రతి శ్లోకానికి గాని లేక పరిగణలోకి తీసుకొన్న యితర గ్రంథాలపై గాని వ్యాఖ్యానం కాదు. ఇతర మత విశ్వసాల పద్ధతులు పోలిక కోసమై చేర్చబడ్డాయి.
ప్రశ్నలకి సమాధానం మరియు వివరణ కోరుకుంటున్న ఏ పాఠకునికైనా ఈ వ్యాసాలు ఉపయోగకరంగా ఉంటాయ . తల్లిదండ్రులు తమ పిల్లలు లేక మరి ఎవరైనా అడిగే క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం యివ్వడానికి సహాయపడుతుంది. పరమత మూలాధారమైన సిద్ధాంతాలు మరియు పద్ధతులు పరిశీలించనిదే భౌతికవాదం, మతం పేరిట మూలాధారమైన సిద్ధాంతాలు, కప్పిపరచి ఉన్న రాజ్యకాంక్షకు అడ్డుగోడగా కనబడే ఆధ్యాత్మికతని అర్థం చేసుకోవడం మరియు వాటి మధ్య తేడాలు తెలుసుకోవడం కష్టం.
గీతలో శ్రీకృష్ణుడు తనను తాను అర్థం చేసుకోవడానికి అర్జునునికి సహాయపడతాడు. అనుసరించేవారికి వారి విశ్వాసాన్ని అర్థం చేసుకోవాలంటే క్లిష్టమైన ప్రశ్నలను ఎదుర్కోవలసి ఉంటుంది. అటువంటి ఆత్మ శోధన లేకుండా, అవగాహన ఎప్పుడూ సంపూర్ణం కాజాలదు.
ఈ ప్రశ్నలు ఎదుర్కోకుండా ఇతర మత విశ్వాసాల గురించి వ్యాఖ్యానించడం సరైనది కాదు. ఈ ప్రశ్నలు హిందువులకు వారి స్వంత మతాన్ని అర్థం చేసుకొని ప్రశంసించడానికి సహాయ పడతాయి. మత మార్పిడులకై అన్ని సాధనాలు అందుబాటులో ఉన్న ప్రస్తుత పరిస్ధితుల్లో పిల్లలకు, స్నేహితులకు మరియు తెలుసుకోవాలనుకునే వారికెవరికైనా వివరించడానికి యువత మరియు పెద్దలు హిందూమత గొప్పతనం గురించి తెలుసుకోవడం ఎంతో ప్రధానం. ఈ విధంగా ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం అందింపజేయవచ్చు.
ఈ పరిస్థితులలో భాష, మత విశ్వాసం మరియు వేర్వేరు ఖండాలలో ఉన్న సంస్కృతి గురించి తెలుసుకోవడానికి సమాజ సేవలో నిరంతరం కృషి చేస్తున్న ప్రొఫెసర్ డి. నికొలస్ వంటి మేధావుల అభిప్రాయాలు గొప్ప ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఎందుకంటే అవి వారి మూల విశ్వాసం యొక్క జ్ఞానముతో పరిశీలించబడి ఉంటాయి. కనుక పండితుడు మరియు పలు గ్రంథాల రచయిత అయిన ప్రొఫెసర్ డి.నికొలస్ యొక్క అభిప్రాయాల ద్వారా గీతా అవగాహన ప్రయాణం ప్రారంభిద్దాము.
పరిచయం
హిందూమతం యితర భారతీయ మతాలైన భౌద్ధమతం, జైనమతం మరియు సిక్కు మతం యొక్క విశ్వాసాల మీద అపారమైన ప్రభావం కల దివ్యమతం. భగవద్గీతలోని కొన్ని సూత్రాలపై తీవ్రమైన అపోహలు ఉన్నాయి.
అదృష్టవశాత్తు పాశ్చ్యాత్యులతో సహా పలువురు పండితులు భగవద్గీతపై పరిశోధనలు చేశారు. పాశ్చ్యాతులు కుల సంబంధితమైన లక్షణాలకు లోబడకుండా ఆలోచిస్తారు. యితర మతాల విశ్వాసాల పట్ల విస్తృత దృక్పధం కలిగియుంటారు. కనుక మనము పాశ్చాత్య దేశాలలో ఉన్న పిన్న, పెద్దలకు ఆసక్తి కలిగిస్తున్న యోగాతో ప్రారంభిద్దాము.
పాశ్చ్యాత్య దేశాలలో
హిందూమత సంప్రదాయాలు
పాశ్చ్యాత్య దేశాలలో హిందూ సంప్రదాయాలు, తత్వ శాస్త్రం మీద ఆసక్తి పెరుగుతోంది.
యోగా
ప్రశ్న. యోగా అంటే ఏమిటి ?
‘‘యోగా ‘యుజ్’ అనే సంస్కృత పదం నుండి వచ్చింది. యుజ్ అనగా చేరిక, ఐక్యం అని అర్థం. దీని అర్థం
వ్యక్తి యొక్క శరీరం మనసుతో, మనసు ఆత్మతో చేర్చి పరమాత్మలో ఐక్యం చేసి సంతోషకరమైన, నియమబద్ధమైన సమతుల్యమైన జీవితాన్ని గడపడానికి చేసే సాధన.’’
ఫోర్బ్స్ పత్రికలోని నివేదిక ప్రకారము
‘‘2012 సంవత్సరంలో యోగా పత్రిక తరపున క్రీడా క్రయ విక్రయాల సమీక్ష చేసిన పరిశోధన ద్వారా తేలినదేమిటంటే 2008 సంవత్సరంలో 15.8 మిలియన్ల మంది యోగా సాధన చేస్తే, అదే గత సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది అమెరికన్లు, దాదాపు 8.7% శాతం వయోజన జనాభా అంటే 18 సంవత్సరాలు పైబడినవారు, యోగా సాధన చేశారు’’.
‘‘రహదారి ప్రక్కన తమ రంగు రంగుల చాపలు పరిచి యోగా గురువు తమేక లాసన్ శిష్యులు ఆమె చేసిన బోధనలను అనుసరించడానికి ప్రయత్నిస్తున్నారు. శ్వాస మీద ఏకాగ్రత పెట్టమని మరియు వారి పరిసరాల సౌందర్యంపై దృష్టి కేంద్రీకరించమని. ‘‘ఈ ప్రయత్నం పోలీసు వారి దృష్టిని కూడా ఆకట్టుకొంది. హింసని అరికట్టేందుకు ఆ ప్రాంతంలోని యువత కోసం నిర్వహించే హింసావ్యతిరేకపు కార్యక్రమములో భాగంగా ఒక రక్షణాధికారి లాసన్ క్లాస్‌ను చేర్చాడు.
పిల్లలకు యోగా వలన ప్రయోజనాలు
‘‘పిల్లలకు యోగాద్వారా విస్తృతమైన ప్రయోజనాలు కలుగుతాయి. శారీరకంగా, ఇది దృఢత్వాన్ని, చురుకుదనాన్ని, సమన్వయమును, శరీర అవగాహనను పెంచుతుంది. పైగా వారిలో ఏకాగ్రత, ప్రశాంతత, సడలింపు లక్షణాలను పెంచుతుంది. యోగా ద్వారా పిల్లలకు వ్యాయామం, క్రీడలు, ఆత్మావలోకనం మరియు పరిసర సహజ ప్రపంచంతో సన్నిహిత బంధం కలుగుతుంది. పిల్లల్లో అంతర్గతంగా ఉన్న ఆత్మ జ్యోతిని యోగా వెలికి తీస్తుంది.
ఇల్లినాయిస్‌లో పరిశోధన
యోగా ద్వారా మెదడులో చురుకుదనము పెరుగుతుందని విశ్వవిద్యాలయం వారుచేసిన అధ్యయనంలో కనుక్కున్నారు. ‘‘ఇల్లినాయిస్ విశ్వ విద్యాలయపు పరిశోధకులు 30 మంది యువ స్నాతక విద్యార్ధినులను నియమించుకుని రోజు వారి చేత ఒక విడత 20 నిమిషాల పాటు యోగాభ్యాసం మరియు వేరే సమయంలో 20 నిమిషాల పాటు తీవ్ర మోతాదులో ఏరోబిక్ వ్యాయామ శైలిలో నడక లేదా వారి గరిష్ట గుండె కొట్టుకొనే వేగం 60 నుండి 70 శాతంలో ట్రెడ్ మిల్‌పై చిన్నపాటి పరుగు అభ్యాసం చేయించారు. ప్రతి చర్య తరువాత వారి ధారణశక్తి యొక్క వేగాన్ని లేదా ఖచ్చితత్వాన్ని మరియు స్పందన నిరోధక నియంత్రణను పరీక్షించారు.6
‘‘ఇతర అధ్యాయనాలతో పోలిస్తే తీవ్ర మోతాదులో ఏరోబిక్ వ్యాయామం చేసిన తరువాత కంటే యోగాభ్యాసం చేసిన తరువాత మానసిక పరీక్షల్లో పాల్గొన్న విద్యార్ధినులు గణనీయంగా మెరుగుతనం చూపడం పరిశోధకులను ఆశ్చర్యపరిచింది.

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562