మెయిన్ ఫీచర్

పరిపూర్ణమైన భాష సంస్కృతం -2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ శాస్ర్తీయ సంగీతం మరియు ఆరోగ్యం
భారతీయ శాస్ర్తీయ సంగీతంలో ఉన్న వైద్య ప్రభావాలను పాశ్చ్యాత్యులు తెలుసుకుంటున్నారు. మైకెల్ బ్రవున్ స్టైన్ వారి వ్యాఖ్య ప్రకారం ‘‘రుగ్మతలను పొగొట్టే ప్రభావం సంగీతానికి ఉన్నట్లు పురాతన భారతీయ వేద గ్రంధాలు పేర్కొన్నాయి. అతి పురాతన వైద్య విధానంగా నమోదైన ఆయుర్వేదానికి అనుబంధమైన గాంధర్వ వేదం ప్రకృతిలోని లయ మరియు సామరస్యానికి ప్రతిరూపంగా సంగీతాన్ని ఉపయోగించినట్లుగా తెలియజేస్తుంది. శరీరం ఈ ప్రకృతి శక్తుల ప్రభావాన్ని గ్రహించగా, ప్రకృతితో ఆరోగ్యాని కి కూడిన సహజ బంధం గురించి మనసు తెలుసు కుంటుంది.
సంస్కృత భాష
సర్ విలియమ్ జోన్స్ ఆంగ్ల న్యాయాధీశుడు మరియు సాహితీవేత్త, భారతదేశంలో పని చేస్తున్నప్పుడు 1786 సంవత్సరం లో రాయల్ ఏషియాటిక్ సంస్థలో ఇచ్చిన ప్రసంగంలో ఇలా పేర్కొన్నారు. ‘‘సంస్కృత భాష అతి పురాతనమైనను అద్భుతమైన నిర్మాణం కలిగినది, గ్రీకు భాష కన్నా ఖచ్చితమైనది, లాటిన్ భాష కన్నా మరింత సమృద్ధమైనది మరియు ఆ రెండింటి కంటే అతి సుందర మైనది...’’
ప్రొఫెసర్ ఆంటోనియో టి.డి. నికొలస్ ఇలా వ్రాసారు ‘‘అస్త వ్యస్తంగా ఉన్న రోమన్ సమీకరణాలు మరియు ఆంగ్ల భాష ఉచ్చారణకు పోలిస్తే సంస్కృత సమీకరణాలు ఖచ్చితంగా ఉంటాయి.’’
‘‘దానికి సమాధానం ఇవ్వాల ంటే సంస్కృత భాష లక్షణాలు తెలుసుకోవాలి. శబ్ధంలో ఉండే అందం, ఉచ్చారణలో ఉండే ఖచ్చితత్వం మరియు విశ్వసనీ యత ఇంకా దాని నిర్మాణం యొక్క ప్రతి అంశంలో సంపూర్ణత వల్ల సంస్కృతం మిగిలిన అన్ని భాషల కన్నా మిన్నుగా నిలుస్తుంది. అందుకే అది ఇతర భాషలలా కాకుండా ప్రాధమికంగా ఎన్నడూ మార లేదు. మానవజాతి యొక్క అత్యంత పరిపూర్ణమైన భాషగా ఉన్న అది, మారవలసిన అవసరం లేదు.’’
అతను అన్నట్లు ‘‘సంస్కృత భాష లక్షణాలు మీ బిడ్డ యొక్క లక్షణాలుగా మారతాయి - అంటే మీ బిడ్డ యొక్క మనస్సు మరియు గుండె అందంగా, ఖచ్చితంగా మరియు విశ్వసనీయంగా మారుతాయి.’’
పైన చెప్పినవి, నిజంగా తన ప్రాంతీయ భాష సంస్కృతం కాని వ్యక్తి నుండి వచ్చిన నిర్దిష్టమైన ప్రశంశలు, అతను తన ఉపన్యాసంలో సంస్కృ తాన్ని యూరోపియన్ భాషలతో పోల్చుతారు. సంస్కృత భాష వైపు చేసే అద్భుత ప్రయాణాన్ని పరిచయం చేయడానికి చాలా ప్రాధమిక స్థాయిలో కొన్ని లక్షణాలను మనం పరిగణనలోకి తీసుకుందాం. పైన పేర్కొన్న ప్రశంశలను వివరించడానికి మరియు ఆంగ్ల భాషతో సోదాహ రణంగా పోల్చి చూడటం కోసమే, కాని భాష యొక్క నిర్మాణానికి సంబంధించి వివరా లలోకి వెళ్ళడం ఈ పుస్తకం యొక్క లక్ష్యం లేదా పరిధి కాదు.
ఈ విభాగంలో ఇంతకు ముందు, మనం సంస్కృతంలో ఉదాహరణల గురించి సర్ విలియం జోన్స్ నుండి వ్యాఖ్య లు గమనించాం. భాషకు ఎప్పుడు చాలా కేసులు ఉంటా యో, ఆంగ్లంలో ‘విభక్తులు’ అని పిలవబడేవి అవసరం లేదు. ఉదాహరణకు, జగద్గురు శంకరాచార్య విరచిత సుందర కూర్పుని పరిగణిద్దాం.
భజగోవిందం భజగోవిందం
గోవిందం భజ మూఢమతే !
భజ మరియు గోవిందం రెండవ పంక్తిలో వరస మారాయి. సంస్కృతంలోనే ఇది సాధ్యం ఎందుకంటే, క్రమంలో మార్పు వల్ల దాని అర్థం మారదు. ఇలాంటి అద్భుతాలు సాధ్యమయ్యే విధంగా ఈ భాష నిర్మించబడింది. అదే విధంగా, ‘నమ: పార్వతీ పతయే’ లేదా పార్వతీ పతయే నమ:’ అన్నా సరిగ్గా అదే అర్థం. వ్యాకరణం లోని ఇతర నిబంధన లకు అనుగుణంగా క్రమాన్ని ఎంచుకోవడం కవులకే వదిలి వేయబడింది. అదే మనం ఆంగ్ల భాషలో అలా చేయడానికి ప్రయత్నిస్తే మనకి అర్ధవిహీ నంగా అనిపి స్తుంది. ఉదాహరణకు, ‘సెల్యూ ట్సులో శివ’ అనే పద సమూహాన్ని పరిగణిద్దాం. పదా ల స్థానం మార్చితే, దాని ఉద్దేశించ బడిన అర్థం పోతుంది. రెండు పదాలను కలపడానికి మధ్యలో ‘టు’ అనే విభక్తి ఉంది. పదాలను అటుదిటు చేసినప్పుడు, వాటి మధ్య సంబంధం మారుతుంది.
పద్యాలలో మరియు పద్యాల వంటి శ్లోకాలలో ‘్ఛందస్సు వ్యాకరణ నియమాలు’ మరొక అంశం. ఒక పదంలో అక్షరాల లయ, శబ్దం, సంఖ్య అక్షరాలు పలికే విధానం అన్నీ వ్యాకరణ నియమాలలో పేర్కొనబడి ఉన్నాయి. సంస్కృతం కేవలం ఒక గొప్ప భాష మాత్రమే కాదు ఇంకా ఒక అద్భుతమైన భాష. ఒక వేళ మీ ఎదుట దేవుడు ప్రత్యక్షమై ఒకే ఒక పదంతో మీ కోరిక ఏమిటి అని అడిగితే, అది ఏమి అవుతుంది? పైన ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సరైన భాష ఎంచుకోవడం వివిధ భాషాజ్ఞానం ఉన్న వారికి క్లిష్టమైనది కాకవచ్చు.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562