మెయిన్ ఫీచర్

ధర్మాచరణ దృక్పథం-3

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ్ఞాన శాస్తవ్రేత్తల అభిప్రాయాలు
రాబర్ట్ ఓప్పెన్ హీమర్ అనే అమెరికన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్ర వేత్త వ్యాఖ్య ప్రకారం: ‘‘వేదాలతో సంధానం మునుపటి శతాబ్దాల కంటే ఈ శతాబ్దానికి లభించిన గొప్ప వరం.’’
రాజకీయ నాయకుల అభిప్రాయాలు
1961 సంవత్సరంలో అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనెడీ తన తొలి ఉపన్యాసంలో అన్న వాక్యం ఈ నాటికి విస్తృత ప్రచారంలో ఉంది: ‘‘మీ దేశం మీకు ఏమి చేయగలదని అడగకండి. మీ దేశం కోసం మీరు ఏమి చేయగలరని అడగండి. ఈ ప్రసిద్ధ వాక్యానికి మూల కారకులు వేరెవరోనని సూచిస్తూ వాదనలు మరియు నివేదికలు ఉన్నాయి. ప్రధానంగా మేము అడగాలనుకున్న ప్రశ్న ఏమిటంటే: భగవద్గీతలో శ్రీ కృష్ణుడు ‘‘్ఫలాపేక్ష లేకుండా నీ ధర్మాన్ని నిర్వర్తించమని’’అర్జునునికి చేసిన బోధ కంటే ఈ సందేశం ఎలా భిన్నంగా ఉంది ?
అమెరికన్ల వేద పఠనం
జెఫ్ప్రీ ఎర్హార్డ్, రాబీ ఎర్హార్డ్ అనే అమెరికన్లు శ్రీ రుద్రం నమ్మకం యొక్క మొదటి అనువాకంతో నాలుగవ వార్షిక హిందూ- అమెరికన్ సేవా సముదాయ సభ ప్రారంభించారు. అమెరికన్లు ఆసియా ఉచ్చారణలో వేదం జపించడం కొందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు. మీ సందేహం తీర్చుకోవడానికి ఈ వీడియో చూడండి.
పాశ్చ్యాత్య సాహితీవేత్తల గీతానువాదాలు
ప్రొఫెసర్ ఆంటోనియో టి.డి.నికొలస్ వ్రాసిన ‘ది భగవద్గీత అండ్ ది ఎథిక్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ 10 పుస్తకం నుండి కొన్ని సందేశాలు - ఈ ప్రఖ్యాత అనువాదంలో ప్రొఫెసర్ డి. నికొలస్ పుస్తక శీర్షికతో మొదలెట్టి ఉపోద్ఘాతం ద్వారా అనేక దురభిప్రాయాలను మరియు అపోహలను తొలగించే ఎన్నో రహస్యాలను వెల్లడించారు.
ఈ అద్భుతమైన పుస్తకం యొక్క ప్రభావం ఎంతో ఉపోద్ఘాతం నుంచి కొన్ని ఉల్లేఖనాలు తెలుపుతాయి. తమకే గాక యావత్ ప్రపంచానికి కనువిప్పు కలిగించేదిగా పాఠకులు గ్రహిస్తారు. ఇది ప్రతి హిందువు సంపూర్ణంగా చదవవలసిన పుస్తకం.
‘‘అవాస్తవికములు, అసహజములైన పరిస్థితుల ను దృష్టిలో ఉంచి యుద్ధానికి మద్దతుగా లేక వ్యతిరేకమనే నైరూప్య విలువలకు ప్రతీకగా భగవద్గీతని భావిస్తే పెద్ద తప్పే. అనుభవాతీతమైన పరిస్థితుల ఆధారంగా ఒక నైరూప్య దృక్కోణం ఏర్పరుచుకోవడం గీత యొక్క ఉద్దేశ్యాన్ని ప్రారంభం నుంచి తప్పుగా అర్థం చేసుకున్నట్లు అవుతుంది. గీత యొక్క అత్యంత ప్రధానమైన సందేశం ఎప్పటికీ మారదు. కారణం సందర్భానికి అతీతమైనది. ఎందుకంటే అప్పుడు అర్జునుడు రథముపై నుండి బాణాలతో పోరాడితే ఇప్పుడు మన తలలపై థెర్మోన్యూక్లియర్ యుద్ధాల ప్రమాదం ఉంది. ఇక్కడ మనం సంభవించదగిన మార్గాలు, అవకాశాలు, వాటి విచక్షణలనే అంశంపై నిమగ్నమై ఉన్నాము. ఇక్కడ సమస్య ఏమిటంటే పాఠకులుగా మనల్ని మనం క్లిష్ట పరిస్థితులలో ఎలా చూడదల్చుకున్నామో లేక ఎలా స్పందిస్తామో అనేది నిర్ణయించుకోవడమే.
మనల్ని తడబాటు పడేలా చేసేది, శంకించేలా చేసేది, కార్యాచరణకు దారికడ్డంగా నిలిచేది ఏమిటి? తీవ్రమైన సంక్షోభ పరిస్థితి ఎదురురైనప్పుడు మనల్ని నిరాశ, నిక్షేపణ, సోమరితనం, కడకు పరిత్యాగం వైపు తీసుకువెళ్ళేది ఏమిటి? వాటిని విధి నిర్ణయాలకు వదిలివేసి, యాదృచ్ఛిక నిరాశలపాలు చేసుకుంటున్న మనస్సుతో వ్యవహరించే మనం ఎటువంటి మనుష్యులం?
గీతలో అర్జునుని ప్రారంభ దశ పూర్తిగా శూన్యం. అతను తమోగుణం, నిరాసక్తత, జడత్వంతో నిండి యుంటాడు. యోధునికి ప్రతిదీ ప్రాణాపాయము కలిగించేదే. ప్రతీ ద్వారం, పొద, కొమ్మ వెనుక ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ యోధుడు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. మానవ దౌర్బల్య విమోచనానికి గీతాపఠనం తప్పనిసరి. అర్జునుని సంక్షోభం మన సంక్షోభం లాంటిదే. మనము కూడా కృష్ణుని సలహా పాటించాలి. ప్రాగ్దేశ లేక పశ్చిమం కానీ, అర్జునుడుదైన లేక ప్రస్తుత అనువాదకుడు లేక, ఎవరిదైనా కానీ - మానవ జీవితమంటే ప్రపంచాన్ని నిజ ప్రపంచంగా వాస్తవాలతో చూడగలగట మని అర్థం. ఇది అనుభవాతీతమైన స్థితిలో కాకుండా సంక్షోభంలో ఉన్నప్పుడు మన స్థితిగతుల గురించి అందోళన పడుతున్నప్పటికీ, ధర్మాచరణ దృక్పదంతో నిర్ణయాన్ని తీసుకొనవలసిన స్పష్టమైన పరిస్థితిలోనే జరుగుతుంది .అర్జునుని మాత్రమే కాపాడటము కాదు, అర్జునుడిని యిచ్చిన సంస్కృతిని కూడా కాపాడటం మనం ఎదుర్కోవలసిన సమస్య.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562