మెయిన్ ఫీచర్

సత్యం అంటే...8

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న : మహాభారతం యొక్క సారాంశం ఏమిటి ?
మహాభారత సారాన్ని అర్థం చేసుకోవడానికి, సత్యం మరియు ధర్మం అనే రెండు పదాలకు అర్థం తెలుసుకోవాలి.
ధుర్యోధనుడిని దీవించినప్పుడు మహారాణి గాంధారి మహా భారతాన్ని ‘్ధర్మమే గెలవగలదు’ అని మూడు మాటల్లో సంగ్రహంగా చెప్పారు. ఆమెకు, తన కుమారునికి కలిగే నష్టం మరియు తనకు చివరగా కలిగే నష్టం కన్నా ధర్మం గెలవటం చాలా ముఖ్యం. ఇంతకు మునుపు ప్రశ్నలో ‘సత్యం’ అనే పదాన్ని గురించి సంక్షిప్తంగా చర్చించాం. ఇతర విశ్వాసాలు దీనికి వారి విశ్వాస పరంగా సమాధానంగా ఇస్తారు. అంటే వారి విశ్వాసమే సత్యం అని. ఒక నాస్తికునికి లేదా పర మతస్తులకు ఇది ఒక వక్ర సమాధానం మరియు అసంతృప్తికరమైన సమాధానం. విశ్వాసాన్ని పరిగణనలోకి తీసుకొనకుండా ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం సాధ్యమా ?
సత్యం గురించి జగద్గురు శంకరాచార్యులు వ్రాసినప్పుడు, ఆయన తన మాటల్లో ఎక్కడా విశ్వాసం గురించి ప్రస్తావించలేదు. అందువల్ల, ఇది ఒక పరిపూర్ణమైన నిజం, ఎందుకంటే దేనికి విశ్వాసం లేదా రాజకీయాల రంగు లేదు. జగద్గురు నుండి మీరు వేరేది ఎలా ఆశించగలరు ?
సత్సంగత్వే నిస్సంత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్త్వం
నిశ్చలతత్త్వే జీవన్ముక్తి !
ఎప్పుడు మీరు సత్యానికి దగ్గరవడానికి ప్రయత్నిస్తారో, మీరు అసత్యం నుండి దూరమవుతారు. ఇది తిరిగి మిమ్మల్ని తర్కరహిత మరియు తెలివితక్కువ భావోద్వేగాలు మరియు బంధాల నుండి వేరుచేసి తర్కంతో కూడిన మరియు అర్థవంతమైన మార్గంలో మీకు మార్గనిర్దేశం చేసేందుకు కావలసిన భావాలను తీసుకువస్తుంది. అది సంతృప్తి మరియు విముక్తితో కూడిన జీవన్ముక్తికి దారి తీస్తుంది.
పైన పేర్కొన్న ‘సత్యమేవ జయతే’ ‘్ధర్మమేవ జయతే’ అనే సూక్తుల మూలాలను మీరు చూడవచ్చు. ఇతర మతాలు ఎర చూపించి చేస్తున్న మత మార్పిడులు అసత్యానికి దగ్గరయ్యే మార్గాలు.
ప్రశ్న: పలువురు లేక సమూహ స్వార్థంలో ఘర్షణ అంటే ఏమిటి? కారణమేమిటి మరియు దానిని పరిష్కరించేది ఎలా?
ప్రాపంచిక సంబంధమైన వస్తువుల గురించి ఇద్దరు వ్యక్తులు గానీ, రెండు వ్యక్తుల సముదాయాలు గానీ ఘర్షణ పడటం. ఘర్షణ ప్రాణనష్టం కలిగిస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో ఉన్న నైతిక విలువల గురించి చర్చిస్తూ భగవద్గీత ఎంతో అందంగా మరియు లోతుగా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుందని ప్రొఫెసర్ డి.నికొలస్‌అన్నారు. ఇతర ప్రసిద్ధ మతాలు దీని గురించి ఎక్కువగా ప్రస్తావించకుండా వాస్తవానికి మరియు వాస్తవిక ప్రపంచానికి దూరంగా ఉంచేస్తున్నాయి. దీని పర్యవసానముగా ఏకేశ్వరవాదం (ఒకే ఒక భగవంతుడు అన్న సిద్ధాంతం)చివరికి ఎన్నో యుద్ధాలకు కారణమైనది. దేవుణ్ణే కారణంగా తీసుకొని భూవనరులను తమ అదుపులో తీసుకొనే ఆకాంక్ష యుద్ధాలకు దారి తీస్తాయన్న అంతిమ నిశ్చయం అనివార్యం. ఇతర మతాలలో ‘‘్భతికవాదం’’ మరియు ‘‘స్వప్రయోజన భేదాభిప్రాయలు’’ గురించి ఎక్కువ అవగాహన లేకపోవడం వల్ల ఎన్నో సంఘర్ణలకి మూలమైనది. వీటి గురించి ప్రజలని అజ్ఞానంలో ఉంచి వారిని అధ్యాత్మిక పదంలో తీసుకొని వెళ్లగలరనే భ్రమ కలిగిస్తున్నారు.
ఈ పదాల అర్థం తెలియాలంటే హిందూ వారసత్వహక్కుల గురించి తెలుసుకోవాలి. తండ్రి ఆస్థిని తనయుడు వారసత్వంగా పొందలేడు. తన స్వీయ సంపాదనను తనకు నచ్చినవారికి ఎవరికైనా ఇవ్వవచ్చును. అధ్యాత్మికతకు సంబంధించిన విశే్లషనాత్మక భావాలలో ఏ యితర మతం హిందూమతానికి సమీపానికి రాలేదు.
ప్రశ్న: దృక్పథ వైవిధ్యం మరియు సమానత్వం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయా?
‘‘అమెరికాలో వైవిధ్యం ఒక రాజకీయ నినాదం. భారతదేశంలో అది చారిత్రాత్మక వాస్తవం. పాశ్చ్యాత్యులు ఈ నిజాన్ని ఒప్పుకోకపోవచ్చు కానీ పరమత సహనం అంటే ఏమిటో భారతదేశం నుంచి మనం నేర్చుకోవలసింది చాలానే ఉంది’’ అని గారీ వీస్స్ వ్రాసారు. హిందూమతంలో రాజకీయ చర్యలకు మరియు ఆధ్యాత్మిక చర్యలకు తేడాలో స్పష్టత ఉంది. ఇతర మతాలలో ఈ తేడా అస్పష్టంగా అయిపోయి ఆధ్యాత్మికత కన్నా రాజకీయత్వం ఎక్కువగా కనిపిస్తుంది.
పరమత సహనం మరియు పరులపై నమ్మకం ఒకదానికొకటికి పర్యాయ పదాలుగా పై సందర్భంలో పేర్కొనవచ్చు. ఈ విషయంలోనే ఏకేశ్వరవాద మతాలు విఫలమవ్వుతాయి. దీని గురించి తరువాతి విభాగంలో వివరంగా చెప్పబడుతుంది. దృక్పథ లేక విశ్వాస వైవిధ్యంతో నిమిత్తం లేకుండా సమానత్వం గురించి పొగడుకోవటం హేతుబద్ధమైనది కాదు మరియు వంచన పూరితమయింది.
ఇంకావుంది...

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562