మెయిన్ ఫీచర్

మానవత్వానికి పునాది-13

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశ్న. ఏకలవ్యునికి అస్తవ్రిద్య నేర్పటానికి ద్రోణాచార్యులు ఎందుకు నిరాకరించారు?
ఏకలవ్యునికి మేలు చేయాలన్న ఉద్దేశ్యం లేకనే ద్రోణాచార్యులు అతనికి అస్తవ్రిద్య నేర్పడానికి నిరాకరించాడని అనిపించవచ్చు. ఇందుకు యితర బలమైన కారణాలు ఉన్నాయా అని మరికొన్ని వివరాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి ప్రతిస్పందనగా క్రింద వాక్యాల్లోనే కాక ఇతరులు ఇచ్చిన జవాబు ఈ సూచనలో చూడండి.
ద్రోణాచార్యుడు ఏకలవ్యుడిని తన శిష్యుడిగా స్వీకరించకుండా నిరాకరించడానికి ఆ వ్యక్తి యొక్క నిగ్రహ శక్తి మరియు కురు సామ్రాజ్యం పట్ల అతని విధేయత లేక రాజభక్తి అనేవి కూడా ముఖ్యమైన అంశాలు. అతను తన విలువిద్య నైపుణ్యతను ఉపయోగించి మొరిగే కుక్క నోటిలో బాణాలు దూసుకుపోయేలా కొట్టడం వల్ల అది తన నోరు తెరవలేకపోతుంది. ఇప్పటికీ చాలా దేశాలలో జంతువులను అమానుషంగా హింసిస్తే అందుకు శిక్షించడానికి శాసనాలు, శిక్షలు ఉన్నాయి.
వేదములు
వేదాలంటే శాంతి మరియు సామరస్యానికి సిద్ధాంతాలు
గాయత్రీదేవి
గాయత్రీదేవిని ‘‘వేదమాత’’ అనగా ‘‘బుగ్, యజుర్, సామ, అధర్వ’’ వేదములకు తల్లి అని అంటారు ఎందుకంటే వేదాలకి మూలం ఇదే. మనం అనుభూతి చెందే మరియు తెలిసిన విశ్వం యెక్క వాస్తవికత, ఆధారం ఇదే.
సరస్వతీదేవి
‘‘సరస్వతి (సంస్కృతం- సరస్వతి) జ్ఞానం, సంగీతం, కళలు, తెలివితేటలు మరియు ప్రకృతికి నిదర్శనమైన హిందూదేవత. త్రిమూర్తి స్వరూ పాలైన సరస్వతి, లక్ష్మి పార్వతిలలో ఒకరు ఆమె. వీరు ముగ్గురూ త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుకి విశ్వ సృష్టి, నిర్వహణ మరియు లయలో సహాయపడతారు. జగద్గురు శంకరా చార్యులు స్థాపించిన నాలుగు పీఠాలలో మొట్ట మొదటిది శృంగేరిలోని శారదాపీఠం, సరస్వతి దేవికి మరో పేరు శారద. తరచుగా వల్లించే క్రింద చెప్పబోయే వేద మంత్రాన్ని మానవత్వానికి పునాది అని భావిస్తారు. మానవత్వం పరిరక్షణ ఉద్దేశ్యం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యమైనది ఈ వేదమంత్రంలోని పాటించిన వరుసక్రమం.
1. మాతృ దేవో భవ!
2. పితృ దేవో భవ!
3. ఆచార్య దేవో భవ!
4. అతిథి దేవో భవ !
మొట్టమొదటిది మరియు ప్రధానమైన మంత్రం ‘‘మాతృ దేవో భవ’’ క్రింద కారణాలవల్ల అత్యంత కీలకమైనది. తల్లి సంరక్షణ లేకుంటే ఎన్నో జంతు జాతులు ఇప్పటికి అంతరించిపోయి ఉండేవి. తల్లి తన సంతానంతో చిన్న తనంలో సంభాషించే తీరు బహుశా ఇంకెవరికి అర్థం కాకపోవచ్చు. ప్రకృతిని ప్రకృతిమాతగా సంబోధిస్తారు. తల్లిమొక్క అపారమైన ప్రేమ మరియు పోషణ ద్వారా సంతానానికి యితరులను నమ్మటానికి కావలసిన ధైర్యాన్ని నేర్పిస్తుంది. స్వభావంలో ముఖ్యాం శమైన ‘‘సహనం’’ పెరగడానికి తోడ్పడుతుంది. మానవత్వాలకై రూపొందించిన వైదిక వ్యవస్థాపక సిద్ధాంతం వెనుక ఉన్న రహస్యాన్ని అర్ధం చేసుకోవడానికి, అభినందిచడానికి, స్ర్తీ దేవతలు లేని మతాలకి కష్టంగానే అనిపిస్తుంది. ఆధ్యాత్మి కత యొక్క అంతిమ కోరిక ఇది కాదా? ఇతర మతాలలో పరమతస్థులకై ఎటువంటి బంధనాలు, షరతులు లేకుండా అపారమైన దీవెనలు ఇవ్వగలరా?
‘‘అతిథి దేవో భవ’’ అన్న మంత్రం విశ్వ సామరస్యం సాధించగలిగే గొప్ప వరం. అతిథి అంటే ఎదురుచూడనప్పుడు కలవడానికి వచ్చే వ్యక్తి, మీకు పరిచయం ఉన్నవారు లేదా అపరిచితులు కూడా కావచ్చు. ఉదాహరణికి మీకు తెలియని వారు ఆశ్రయం కోరి మీ ఇంటి తలుపు తట్టినప్పుడు వారికి కావలసిన అవసరాలు అత్యంత దయతో అమరుస్తారు అనుకుందాం ఇది నిజంగా దివ్యసంఘటన.
వారిని మళ్ళీ కలవడం లేదా మీరు చేసిన సహాయానికి వారు బదులు చెల్లించే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నిస్వార్ధ చర్య నిజమైన శాంతికి మరియు సామరస్యానికి ఏకైక ఆశాకిరణం అవుతుంది.

డా॥ గరికపాటి ఆనంద్ 9966059562