మెయిన్ ఫీచర్

మూడు దశాబ్దాల సాహిత్య పునర్వికాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1990 నుండి తెలుగు సాహిత్యంలో నూతన వెలుగులు ప్రసరించాయి. 1980-90 దశాబ్దం విప్లవ, స్ర్తివాద, సాహిత్య దశాబ్దం అని పిలుచుకుంటే 1990-2000 దశాబ్దం దళిత బహుజన, స్ర్తివాదం, సాహిత్య దశాబ్దం అని చెప్పవచ్చు. సామాజిక తాత్విక, సాహిత్య విమర్శ రంగంలో 1985 కారంచేడు ఉద్యమం నుండి అనేక మార్పులు జరిగాయి. కొత్త చూపు ప్రసరించింది. దళిత, రచయితల, కళాకారుల, మేధావుల ఐక్యవేదిక, బహుజన సమాజ పార్టీ, భావజాలం, స్ర్తివాదం, తెలంగాణ వాదం అనేక నూతన కథావస్తువులను శిల్పాన్ని జీవితాన్ని చూసే కొత్త చూపును ముందుకు తెచ్చాయి. 1990నుండి ఈ రంగంలో అనేక తాత్విక, సామాజిక, సాహిత్య వ్యాసాలు, ప్రసంగాలు, గ్రంథాలు వెలువరించాను. గతితర్క తత్వదర్శ భూమిక అంబేద్కరిజం, సోషలిజం, బహుజనతత్వం వంటి గ్రంథాలతో భావజాల చర్చ మలుపు తిరిగింది.
పునరధ్యయనం
1995నుండి నేను సామాజిక తత్వశాస్త్ర రంగాలనుండి తిరిగి కథలు రాయడానికి సుమారు రెండువేల కథలు, వంద నవలలు పునరధ్యయనం చేశాను. చిన్నప్పుడు చదివిన ప్రేంచంద్, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్‌బాబు రచనలు మళ్ళీ చదివాను. ఇలా 1990 తర్వాత జీవితాన్ని, సమాజాన్ని, సాహిత్యాన్ని పునరధ్యయనం చేశాను. కొత్త చూపుతో పరిశీలించాను. కుల సమస్య, కుల వివక్ష, పురుషాధిక్యత, పితృస్వామిక భావజాలం, కులాధిక్యత, నిత్యం ఎన్ని రూపాలు కొనసాగుతున్నదో చిత్రించాను. ‘బంధీ’, ‘రియల్ ఎస్టేట్’, ‘ముగ్గురు మిత్రులు’, ‘దక్షయజ్ఞం’, ‘జీవనయానం’ నవలలో చిత్రించాను.
ఉద్యమ కథలు వేరు, వాటి శైలీ శిల్పం వేరు
ఉద్యమ కథలు వేరు. వాటిశైలీ శిల్పం వేరు. జీవితం ఒక్కటే అయినా దాన్ని ప్రెజెంట్ చేసే తీరు, కథ ప్రారంభం, కొనసాగింపు, ముగింపులు వేరు. ఉద్యమాన్ని ఉన్నతీకరించడం, ఉద్యమాన్ని పురికొల్పడం, ఉద్యమాన్ని రికార్డుచేయడం వాటి లక్ష్యం. బుద్దిస్టు, అంబేడ్కరిస్టు, ఫెమినిస్టు, మానవతా దృక్పథంతో చిత్రించే కథా నవల వేరు. ఇవి సమర్థ వర్ణ, వర్గ, కుల, లింగ, ప్రాంత, వివక్షలను, అసమానతలను వెలికితీస్తూ, సంఘర్షిస్తూ, పరిష్కరించుకుంటూ ఆధునిక అభివృద్ధిని ఎలా గెలుచుకుంటున్నారో, ఎలా గెలుచుకోవాలో స్ఫూర్తినిచ్చే ప్రెజెంటేషన్‌తో, కథావస్తువుతో, ప్రారంభం, కొనసాగింపు, ముగింపు చిత్రించడం జరుగుతుంది.
ఓడిపోయే జీవితాలను ఎందుకు చిత్రిస్తారంటే...:
ఓడిపోయే జీవితాలను, విషాదాలను చిత్రించి అందుకు వ్యతిరేకంగా ఉద్యమించాలని చెప్పడంతో ఉద్యమ కథలు పరిమితమవుతాయి. విషాదాలను, ఓడిపోయే జీవితాలను కాకుండా, గెలుచుకునే జీవితాలను, గెలుచుకోవాల్సిన క్రమాల్ని చిత్రించడం బహుజన, మహిళావాద కథల లక్ష్యం. ఓడిపోయే జీవితాలను బహుజన మహిళావాద, తెలంగాణవాద కథల్లో చిత్రించినప్పటికీ అవి జీవితం గెలుచుకోవడానికి ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెంచడానికి అనుకూలంగా ఉంటాయి. ఉద్యమ కథ నిరాశను, విషాదాలను పెంచి ఉద్యమంలోకి మళ్ళించాలని చూస్తుంది.
బహుజన స్ర్తివాద
సాహిత్య ప్రత్యేకత
బహుజన కథ, స్ర్తివాద కథ, తెలంగాణ వాద కథ నిరాశకు బదులుగా ఆశను, విశ్వాసాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితాన్ని గెలుచుకోవడానికి ముందుకు నడిపిస్తుంది. అందువల్ల వస్తువు ఎంపికలో, శైలీ శిల్పంలో సమూలమైన మార్పులు అవసరమవుతాయి. ఉద్యమ కథల ప్రభావంనుండి యువతరాన్ని ఈ నూతన దృష్ఠికోణంతో ఎదిగించడానికి తిరిగి నేను కథలు రాయడం అవసరమైంది. అలా యువతరానికి ప్రత్యక్ష పాఠ్యాంశాలుగా ఉండే విధంగా కథలు రాయాల్సిన అవసరం ఏర్పడింది. అట్లా రాసినవే ‘బందీ’, ‘రియల్ ఎస్టేట్’, ‘చేయూత’, ‘వారసత్వం’, ‘విలువలు’, ‘మైత్రీవనం’, ‘వయస్సు పిలుపు’, ‘వేదవతి’, ‘మమతలు వారసత్వం’, ‘బతుకుపయనం’, ‘ఇంటల్లుడు’, ‘పంజరం’ మొదలైన కథలు.
సమగ్ర, సామాజిక, వికాస చిత్రణతో
‘చూపు’, ‘జీవనయానం’ నవలలు
1990ల నుండి సమగ్ర, సామాజిక, వికాసమే సమగ్ర సామాజిక విప్లవమని విశే్లషిస్తూ వచ్చాను. సమగ్ర సామాజికత 50 ఏళ్ళ తెలుగు కథ తీరుతెన్నులు గురించి 1986నుంచి రాసిన వ్యాసాలను 2003లో పుస్తకంగా వెలువరించాను. సమయం లేక పత్రికలు సహకరించక పోవడంవల్ల, నవలగా రాయాల్సిన వాటిని కథలుగా రాయాల్సి వచ్చింది. చాలా కథలు నవలంత జీవితం చిత్రించడానికి కారణం ప్రధాన కారణం ఇదే. తెలంగాణ ఉద్యమంలో కర్తవ్యాల నిర్వహణ మరో ప్రధాన కారణం.
నవలలు రాయడం ఎప్పటికైనా అవసరమే
ఆ తర్వాత నవలలు రాయాల్సిందేనని ఆ లోటు తీర్చాల్సిందేనని నిశ్చయించుకున్నాను. 2011లో ప్రారంభించి మొత్తానికి ‘చూపు’ నవలను 2014లో ప్రచురించాను. ‘సమగ్ర సామాజిక వికాసం’ ఎలా చిత్రించాలో సైద్ధాంతిక చర్చలు సమాజంలో ఎలా కొనసాగుతాయో జీవితంలో అనేక ఉప నదులు కలిసి జీవనదిగా సమాజం ఎలా సాగుతుందో ‘చూపు’ నవలలో తాత్వికతను, జీవితాలను, సంస్కృతిని, సంశే్లషించి చిత్రించాను. అదే క్రమంలో 1998లో రెండు కథలుగా విడగొట్టి రాసిన నవలా అంశాన్ని విస్తరించి 2017లో ‘జీవనయానం’ అనే నవలగా ప్రచురించాను. ఇలా ‘చూపు’, ‘జీవనయానం’ నవలలు ఒక సమగ్ర సామాజిక పరిణామాల్ని మనముందుకు తేవడానికి ప్రయత్నించాయి. ఇలా 1990 తర్వాత విప్లవోద్యమంలోని చీకటి వెలుగులను చిత్రించి, ఆ తర్వాత గెలుచుకోవాల్సిన జీవితాలను వర్తమానంలో ఆధునిక అభివృద్ధి అందుకోవాల్సిన ఆవశ్యకతను చిత్రించాను. ఇవాల్టి అభివృద్ధి మాకు, రేపటి అభివృద్ధి మీకు, రేపటి అభివృద్ధికోసం ఉద్యమాలు చేయండి అనే మధ్యతరగతి మేధావులను, రచయితలను, కళాకారులను గిరిగీసి నిలబెట్టి, ఖండించి, పూర్వపక్షం చేయడం జరిగింది. ఈ వర్తమానంలోనే అభివృద్ధిలో తమ వాటా తమకు అందాలని, నిలదీసిన తాత్విక భూమిక వ్యాసాల్లో, కథల్లో, నవలల్లో ఆయా పాత్రలు, సంఘటనల్లో, సన్నివేశాల్లో రికార్డుచేయడం జరిగింది. అదే నిజమైన అభివృద్ధి అని కూడా చెప్పడం జరిగింది.
తెలంగాణ దృక్పథంతో కథలు, నవలలు
ఉద్యమంలోని వెలుగు, నీడలో దళితుల జీవితాల చిత్రణతోపాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత, తెలంగాణ ఉద్యమం గురించి ‘దక్షయజ్ఞం’ కథలో 1997లో రాయడం జరిగింది. ‘వయసు పిలుపు’, ‘ఓయు కథలు’, తెలంగాణ జీవితం ఉద్యమాల గురించి చిత్రించాయి. 1987-1998 కాలానికి సంబంధించి కథావస్తువు తీసుకుని సామాజిక పరిణామాలను నవ తెలంగాణ ఉద్యమ తొలి దశ, తెలంగాణ సంస్కృతిని ‘చూపు’నవలలో రాసి నాలుగేళ్ల తర్వాత 2014లో ప్రచురించాను. ఆ తర్వాత ‘జీవనయానం’ నవల ప్రచురించడం జరిగింది. ‘బతుకు పయనం’ ‘కామన్ విడ్త్’, ‘ప్రశాంతం’, ‘సంబంధాలు’, ‘సహజీవనం’, ‘మైత్రివనం’, ‘చికాగోలో నానమ్మ’, ‘గెలుచుకున్న జీవితం’ తదితర కథల్లో... ‘జీవనయానం’, ‘చూపు’ నవలల్లో ప్రపంచీకరణ తర్వాత జీవితాల్లో వచ్చిన మంచి, చెడు మార్పులను అనేక కోణాల్లో చిత్రించాను.
స్ర్తివాద దళితవాద పరిణామాలు
ఇలా 1985నుంచి దళిత స్ర్తివాదాలు తెలుగు సాహిత్యంలో మహోన్నతమైన పరిణామాలు తెచ్చాయి. వర్గవాదం, విప్లవవాదం వాదనలో ఏంచెప్పినా సాహిత్యంలో మనిషిని, మానవ సంబంధాల్ని వదిలేసి, వారి జీవితాల్ని వదిలేసి దృక్పథాన్ని ప్రాథమికం చేశాయి. జీవితం ప్రాథమికం అన్న కొ.కు.ను విమర్శించారు. వర్గ దృక్పథం రీత్యా పనికొచ్చే అంశాల్ని మాత్రమే చిత్రించి మిగతా జీవిత చిత్రణను వదిలేయడంతో విప్లవ పాత్రలు అసమగ్రం అయ్యాయి. ఒకే తీరుగా కనపడడం మొదలైంది.
1997లో ‘స్మృతి’ కథల సంపుటి వెలువరించాను. అంబేద్కర్, మార్క్సిజం భౌతికవాద ప్రాపంచిక దృక్పథం అంబేద్కరిజం, సోషలిజం, ‘బహుజనతత్వం, 60 ఏళ్ల తాత్విక సామాజిక పరిణామాలు భారతీయ సాహిత్యం రాజకీయ సామాజిక పరిణామాలు తదితర గ్రంథాలను ప్రచురించాను. వాటి ఆధారంతో వందలాది సిద్ధాంత శిక్షణా తరగతులు నిర్వహించబడ్డాయి. జాషువా స్ఫూర్తి ముందుకు తీసుకువెళ్ళడం జరిగింది. 1990-2000 దశాబ్దం దళిత బహుజన సాహిత్య దశాబ్దంగా స్థిరపడింది. 2001-2010 దశాబ్దం తెలంగాణ దశాబ్దంగా ముందుకు రావాల్సింది. ఉద్యమం ముందుకువచ్చింది కానీ, వచ్చే 2020-2030 దశాబ్దమైనా తెలంగాణ సాహిత్య దశాబ్దంగా విస్తరించడం అవసరం.

-బి.ఎస్.రాములు