మెయిన్ ఫీచర్

కవితాసూరి ‘నోరి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యంతో అంతో యింతో పరిచయమున్న ప్రతి వ్యక్తికీ ‘నోరి’ అనే యింటి పేరు వినగానే వెంటనే తళుక్కున మదిలో ఒక బ్రాహ్మీమయమూర్తి, సదాచార సంపన్నుడు, పరిపూర్ణ జీవనుడూ, గొప్ప చారిత్రక నవలలను తెలుగు ధాత్రికి అందించిన శ్రీ నరసింహశాస్ర్తీగారే మెదులుతారు. ‘నోరి’వారు వృత్తిరీత్యా న్యాయవాది అయినా ప్రవృత్తిరీత్యా గొప్ప సాహితీవేత్త. బహుశా న్యాయవాది వృత్తిలో వుంటూగూడా యింత అపారమైన సేవ తెలుగు సాహిత్యానికి చేసిన వారిలో శాస్ర్తీగారిని మించిన వారు యిప్పటివరకూ కనబడరంటే అతిశయోక్తిగాదేమో? ‘ఉన్నవ’ ‘దిగవల్లి’ లాంటి వారు గూడా సాహిత్యరంగంలో ప్రముఖులు అయినా, న్యాయవాదులే అయినా ‘నోరి’వారి బహుముఖీనత మాత్రం ప్రత్యేకంగా కొట్టవచ్చినట్లు కనబడుతుంది. ‘నోరి’ వారు చేపట్టని ప్రక్రియ లేదు. వీరి రుద్రమదేవి, నారాయణభట్టు, మల్లారెడ్డి, వాఘిరా, ధూర్జటి మొదలైన నవలల గొప్పదనాన్ని పరిశోధకులెందరో వ్యాసరూపాలతో మనకందించినవారే! నోరివారు ‘సాహితీ సమితి’ స్థాపకులు. అలనాటి సాహితీ లోకమార్తాండులైన విశ్వనాథ, రాయప్రోలు, అడవి, దేవులపల్లి మొదలైన వారందరూ ఈ సమితిలో సభ్యులే! కవిత్రయంలో ఒకడైన ‘ఎర్రాప్రగడ’ కాలానికి సంబంధించిన ‘మల్లారెడ్డి’ నవలలో శాస్ర్తీగారు ఆనాటి సామాజికాంశాలను చాలా గొప్పగా చిత్రీకరించారు. అనేక పద్యగేయ నాటికలను తెలుగువారికందించిన ఆధునిక కవులలో అగ్రపంక్తిలో ఉంటారు నోరివారు. శాస్ర్తీగారికి బౌద్ధసాహిత్యంలో అపారమైన పరిచయం ఉంది. బుద్ధుని నాటి చారిత్రక నాటిక ‘్భమాభిక్షుని’ చరిత్ర లాంటివి ప్రదర్శనలకు నోచుకొనలేకపోవడం తెలుగు రంగస్థలం చేసుకున్న దురదృష్టం. మనకు స్వాతంత్య్రం లభించిన సంవత్సరంలోనే అంటే (1947 సం.లోనే) శాస్ర్తీగారు ‘కవి సమ్రాట్’ బిరుదాంచితులు. శ్రీకళ్యాణానంద భారతీ మహాస్వామివారు గొప్ప విద్యత్వభలో ఈ బిరుదును వారికి ప్రసాదించారు. అలాగే 1959 సం.లో రేపల్లెలో అనేక మంది పురప్రముఖుల సమక్షంలో ‘కవిమార్తాండ’ బిరుదునందుకున్న సాహితీమూర్తి శ్రీ నోరివారు. శ్రీ హయగ్రీవ విద్యాపీఠం ఆరోజుల్లో చాలా ప్రశస్తిగన్న పీఠం. ఈ పీఠంవారు శాస్ర్తీగారికి ఆ బిరుదు ప్రసాదించారు. ఈ సభలోనే శాస్ర్తీగారికి ‘పాతూరి మధుసూదనరావు’గారనే విద్వన్మనీషి అద్భుతంగా-
శ్రీమంతం ప్రతనోతు శంకర శరీరార్థాంగ సంశోభితా
దేవీ పండిత రాజహంస సుమనోగేహాభిరామా స్వయం
కళ్యాణీ మధువాగ్విలాస రచిత బ్రహ్మార్ధసారోదరీ
సా బ్రహ్మేంద్రముఖామరుస్తుతపదా శ్రీనారసింహాభిదం!
అంటూ ఐదు శ్లోకాలు సమర్పించారు. ఇలా ఈ సరస్వతీ మూర్తికి మానరాంధ్రం ఆనాడు నీరాజనాలెత్తింది. నోరి నరసింహశాస్ర్తీగారి బహుముఖీన పాండిత్యాన్ని గురించి చెప్పాలంటే సామాన్యులు సరిపోరు. గేర్వాణాంధ్ర భాషలలో దిట్టలై ఉండాలి. ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానాలు, ముద్రణా యంత్రాలూ, ముద్రాక్షరశాలలూ, వసతులూ, సౌకర్యాలూ ఏమిలేని కాలంలోనే శ్రీ శాస్ర్తీగారు పుంఖానుపుంఖాలుగా రచనలు చేసేవారంటే, ఆ మహనీయుని కవితా తపశ్శక్తి ఎటువంటిదో అర్ధం చేసుకోవాలి. బహుశా అన్ని నవలలూ, అన్ని పద్యకావ్యాలూ, అన్ని వ్యాసాలూ, వ్యాఖ్యానాలూ అందించిన వారిలో ‘నోరి’వారిదే అగ్రస్థానమేమో? పురాణ వాఙ్మయాన్ని ఔపోశన పట్టిన మహాపండితుడు నోరివారు. పద్యాన్ని ఎంత గొప్పగా ప్రౌధసుందరంగా వ్రాశారో, అంతకన్నా లలిత సుందరంగా గద్యాన్ని అందించిన ప్రతిభాసముద్రుడు శ్రీ శాస్ర్తీగారు. వీటన్నిటినీ మించి శ్రీ శాస్ర్తీగారు గొప్ప కథకుడు. ‘నోరి కథాసంహిత’మే దీనికి తార్కాణము. 2007 సం.లో ప్రథమ ముద్రణకు నోచుకున్న ఈ పుస్తకంలో- నరసింహశాస్ర్తీగారి కుమారుడూ, ప్రముఖ ఆధ్యాత్మిక రచయితా, గొప్ప సంపాదకుడూ, వదాన్యుడూ, సనాతన సంప్రదాయ సంస్కారాభిలాషీ నేటి తరంలో నిస్సంశయంగా సాహితీ సేవా రంగంలో పట్టువదలని విక్రమార్కుడూ అయిన శ్రీ సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు ముందుమాట వ్రాస్తూ అనేకమైన, ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. అలాగే మా అన్నగారైన ‘మంజుశ్రీ’గారి ‘తొలితరం ప్రసిద్ధ రచయిత’అనే పీఠిక అదే పుస్తకంలో ప్రతి తెలుగు పాఠకుడూ చదువవలసిందే!- ‘‘ఇన్ని ప్రక్రియలు చేపట్టిన వారు కాని, యింతటి సమగ్ర సాహిత్య వ్యక్తిత్వం కలవారుగానీ ఆ కాలంలో మరొక రచయిత వేరేమోననిపిస్తుంది. కవి, విమర్శకుడూ, సాహిత్య తాత్త్వికుడూ, నాటికా రచయిత, గేయ రూపకశక్తి, నవలా రచయిత, ఉత్తమ సమీక్షకుడూ, సంస్కృతి సంప్రదాయ పరినిష్ఠితమతి, ఉపాసకుడు, సాధన తత్పరుడు, పండితుడు, భారతీయ ఆత్మతత్త్వ సంప్రదాయాభిమాని, శ్రీ విద్యాదీక్షాపరుడు అయిన రచయిత ఆయన సమకాలికులలో లేరు’’- అన్నారు. అనేక ప్రక్రియలలో వారు రచనలు చేసినా ‘‘చారిత్రక నవలా రచయిత’’గా నోరివారు ఆధునిక తెలుగు సాహిత్యంలో సుప్రతిష్ఠితులైనారని గూడా మా అన్నగారు తీర్మానించారు. ‘విద్వాంసులు, కథారచయితలు కాలేదనే లోటు యిటు వంటి వారి వల్ల తీరిం’’దని నవ్యాంధ్ర సాహిత్య వీధులలో ‘కురుగంటి’ వారన్న అభిప్రాయం గూడా మా అన్నగారి పీఠికలో కనబడుతుంది.
16 శీర్షికలున్నా ఈ నోరి కథా సంహిత’ పుస్తకం ఈతరం విద్యార్థులు చదివితే ఆత్మహత్యలు చేసికోరు. ఆత్మస్థైర్యం తెచ్చుకుంటారు. ‘‘పరీక్షా ఫలితములు’’ అనే ఒక శీర్షిక ఒక్కటైనా ఈనాటి విశ్వవిద్యాలయాల వాళ్ళు పాఠ్యాంశంగా పెడితే ఎంత బాగుండునో కదా అని అనిపిస్తున్నది నాకు. సున్నితమైన హాస్యం, వాస్తవికత, సందేశం అన్నీ ఉన్నాయి ఈ కథలో. ఆనాటి ‘మెట్రిక్యులేషన్’ పరీక్ష ఒకాయన పదిహేనోసారి వెళ్ళి కృతార్థుడైనాడుట. అంతేగాని విరక్తితో ‘్ఫ్యను’కు ఉరివేసుకోలేదు. నరసింహశాస్ర్తీగారు తన స్వవిషయాన్ని గూడా చాలా చమత్కారంగా చెప్పుకున్నారు- ‘‘నేను కాస్త ఆరోగ్యవంతులలో ఒకణ్ణిగాబట్టి ప్రతి పెద్దపరీక్షా కొన్ని దండయాత్రలన్నా చేసి దాటేవాణ్ణిగాదు’’- అన్నారు. ఈ పుస్తకంలోనే 6వ కథ అయిన ‘చిలక’అనే శీర్షిక చదివితే శాస్ర్తీగారు యెంత భావుకమర్శజ్ఞుడో, లలితకళాప్రపూర్ణుడో, స‘ర’సజ్ఞుడో, సౌందర్యారాధకుడో యిట్టే తెలిసిపోతుంది.
అలాగే ‘నోరి పద్యగేయ నాటికలు’ గనుక చదివితే అంతో ఎంతో భగవదనుగ్రహం తప్పక పాఠకుడికి కలుగుతుంది. ఆత్మసాక్షాత్కారం తప్పకుండ లభిస్తుంది. ‘గజ్జెలమొలతాడు’ భాగవతావతరణము, అసంగ శస్త్రేణ దృఢేన దృఢేనఛిత్వా’’ మొదలైన నాటికలు చదువుతున్నప్పుడు శాస్ర్తీగారి బహుముఖీన పాండిత్యం, ఆనాటి ఆచార వ్యవహారాలు, హాస్యం, ఒకటేమిటి? అన్నీ కనబడతాయి-
ఒకరి కవిత్వంలో మరొకళ్ళు తప్పులు పట్టడం, ఆక్షేపించడం యివన్నీ ఆనాడూ ఉన్నాయి. ఈనాడూ ఏనాడూ ఉన్నాయి. ‘నోరి సమీక్షలు’ అనే పుస్తకంలో అలనాటి మహాపండితులైన కల్లూరి సుబ్రహ్మణ్యదీక్షితులు, మిన్నికంటి గురునాథశర్మ, నిడుదవోలు వారి ప్రశ్నలకు నోరివారి వినయపూర్వక సమాధానాలు చూడవచ్చు. ఈ సమీక్షలు, వ్యాసాలు, నాటికలు ఆ రోజులలో 1960 సం. ప్రాంతాలలో ‘్భరతి’ పత్రికలో వచ్చినవే! ఇక నోరివారి ‘‘సంపూర్ణ సాహితీ భారతీదర్శనం’’ అనే గ్రంథం,వారి వ్యాసాలపైన లబ్ధప్రతిష్ఠులైన రచయితల అభిప్రాయాలు ఈతరం వారికి పరమప్రామాణికంగా ఉన్నాయి. వ్యాస రచనా ప్రక్రియ ‘కన్నడం’లో అభివృద్ధిచెందినట్లుగా తెలుగులో అభివృద్ధి చెందలేదనే అభిప్రాయాన్ని ఎప్పుడొ నరసింహశాస్ర్తీగారు అంటూండేవారని వారి కుమారులే సుబ్రహ్మణ్యశాస్ర్తీగారు ఈ గ్రంథంలోనే పలికారు.
బహుగ్రంథకర్త అయిన శ్రీ శాస్ర్తీగారి ‘‘దేవీ భాగవతం’’ మరో అద్భుతమైన రచన. నిజంగానే దివ్యగ్రంథం. ‘దేవీ భాగవతాన్ని’ అటు కొంచెం ముందుతరం వారు, ఈతరం వారు యెందరెందరో వ్రాశారు. ‘దాసు’వారు, తి.వేం.కవులు ఈనాటి ‘బేతవోలు’వారు యిలా చెప్పుకుంటూపోతే చాలా మంది కనబడతారు. నోరి నరసింహశాస్ర్తీగారి దేవీ భాగవతం సాహితీ సమితి, రేపల్లెవారే జమ్ములమడక మాధవరామశర్మగారి అభిప్రాయంతో ‘వికృతి’ నిజాషాఢతో ప్రచురించారు. ‘‘ఈ గ్రంథ ప్రచురణకు నన్ను ప్రోత్సహించిన శ్రీ జమ్ములమడక మాధవరామశర్మకును, దీనిని నిర్దుష్టముగ సిద్ధము చేయుటకు నాకు సర్వవిధముల సహాయపడిన శ్రీ గట్టి లక్ష్మీనరసింహశాస్ర్తీకిని నేను కృతజ్ఞుడను’’- అనే మాటలు తొలి పుటలోనే మనకు కనబడతాయి. కల్యాణీప్రెస్, తెనాలిలో యిది ముద్రితమైంది. జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ మహాస్వామి పూజ్యపాదుల చిత్రం అద్భుతంగా దివ్యాకర్షకంగా మొదటి పుటలోనే కనబడుతుంది. 403 పేజీలతో ప్రథమ, ద్వితీయ, తృతీయస్కంధాలు ఈ గ్రంథంలో కనబడతాయి. ఈ దేవీభాగవతంలో, యింతమంది మహామహా కవులు సంస్కృతంలో ఉండగా, వ్యాసుణ్ణి గురించి మాత్రమే అద్భుతమైన శైలిలో ‘కలిస్తుతి’చేశారు-
వేదంబుల్ విభజించి, దుర్గముములౌ వేదాంతమార్గంబులన్
బేదా ధ్యాసలు తీర్చి సూత్రములచే నిర్భీకముల్ చేసి, శు
ద్ధా దర్శంబఉన నట్ల భారతమునందా మర్ధముల్ సూపిమున్
శ్రీదేవీ శ్రుతి విస్తరించు ఋషిమూర్తిన్ వ్యాసుసేవించెదన్!
(5.పద్యం)
అలాగే మహామహా పోటుగాండ్లు, నీటుగాండ్లు, కనకాభిషేకాలు నిండు పేరోలగాలలో గొన్న మహాకవులెందరో ఉంటే విచిత్రం ఒక్క బ్రాహ్మణ రైతు కవికే అగ్ర తాంబూలం యిచ్చి అతిభక్తితో స్తుతించారు-
కవుల వాక్సుధ తెలుగున జవులుగొలుప
మొదల దొరకొన్న ఋషి నన్నపదముమ్రొక్కి
హరికథా కీర్తనాలాపనామృతాప్తి
దర్శముండయి వెలుగు ‘‘పోతన్న’’గొలుతు! (7 పద్యం)
ఎంతో వినయంగా శ్రీ శాస్ర్తీగారు తనను గురించి-
గంగను సముద్ధరించిన ఘటము లెంత
పిన్న వయ్యును, మహిమలో పెద్దవనుచు
నేను నా చిన్ని దోయిట నించి కొలువ
గడగువాడ శ్రీదేవి భాగవత గంగ!
అంటూ చెప్పుకున్నాడు. శాస్ర్తీగారు ఈ దేవీ భాగవత గ్రంథంలో ప్రౌఢులైన పూర్వకవుల ధోరణులు బాగానే కనబడతాయి. నాకైతే ‘హుళక్కి భాస్కరుడు’ ఎక్కువగా కనిపించాడు-
లంకేశుండ నరాళకుంతల! త్వతర్థం బీమతీశ స్వరూ
పాంకంబుల్ ధరియించితిన్, దెలుపనేలా కొంకు, మండోదరీ
పంకేజాక్షి విభుండ, శూర్పణఖ చెప్పంగా ఖరాదుల్ రణా
హంకారుల్ తెగు టెల్లవింటి,నదెనీకైపోవ ప్రేరేచెనన్!
(389 పేజీ)
బేలా! యేటికి నీకు గేవలనరుంబ్రేమింప? వాడందునీ
లీలన్ సంహృత రాజ్యుడున్ వ్యపగత శ్రీకుండు, నుగ్రాటవీ
వ్యాలోలాత్ముడు దుర్బలుం, డతనితో బాటీవునిట్లుండగా
నేలా? వీడుము, నన్ను గొమ్ము పతిగా, నీశుండనాశాళికిన్!
(389 పేజీ)
ఇవన్నీ ‘్భస్కరుని’ పోకడలే! భామలే! - దేవీ భాగవతంలో రామాయణ, భారతగాథలు రెండూ వస్తామనేది జగద్వితం. రెండు కథలకు సంబంధించిన పద్యాలను శ్రీ శాస్ర్తీగారు మహాకవుల మార్గంలోనే నడిపారు. ‘వేదక్రత దేవీస్తోత్రం’ చేస్తూ శక్తిమాతను, బ్రహ్మదేవుణ్ణి, తదితరులను స్తుతిస్తూ- ‘హయగ్రీవుణ్ణి’ ఒక చిన్నకందం పద్యంలో స్తోత్రం చేయడం, అందునా, భావం లేశమంత గూడా ప్రక్కకు పోకుండా చేయడం బహుశా ‘నోరి’వారికి ఒక్కరికే సాధ్యమయిందేమో? ఎంతైనా శ్రీ విద్యావిశారదుడు గదా!
జ్ఞానానందమయా! దే
వా! నిర్మలమైన స్పాటికాకారునినున్!
ధ్యానింతుము కొలుతుము, వి
ద్యానీకాధారుడనని, సయవదన హరే! (48 పేజీ)
నిజానికి శాస్ర్తీగారిని గురించి వ్యాసం వ్రాయాలంటే కనీసం ‘ముప్పై’ పేజీలు కావాలి. మూడు పేజీలు చాలవు. అంతటి విద్వన్మణి నోరి వారు. ఎంతో మహనీయుడుగాబట్టే ఉడుతాభక్తిగా ఒక వేదిక మీద శాస్ర్తీగారిని గురించి, నా పొడిపొడి మాటలతో నేను యిలా ప్రశంసించాను-
శ్రీ విద్యనెరిగిన సిద్ధపూరుషుడన
నుతులందెబుధుడైన ‘నోరి సూరి’
బహుకావ్యకర్తయై- ప్రఖ్యాతిగనినట్టి
సారమతి భువిని ‘నోరిసూరి’
ధర్మజ్ఞుడును చాల కర్మిష్ఠియను చు-స
న్నూతుల నందెనుగాదె ‘నోరిసూరి’
రతనంబులనుబోలు సుతులకు జనకుడై
భూరి పుణ్యుండయ్యె ‘నోరిసూరి’
అరిభయంకరుడైన ఆ ‘హనుమ’సాక్షి
భువన సంస్తుత్యుడైన ‘షణ్ముఖుని’ సాక్షి
‘సర్వమంగళ’మగు నగజాతసాక్షి
సార్థకత చెందె ‘నరసింహశాస్ర్తీ’సుకవి!
‘కవి సమ్రాట్టు’గ నంధ్రవలయమున్ ఖ్యాతింగన్న సర్వజ్ఞుడున్
భువన స్తుత్యుడు వ్యాళభూషణుడు సంపూజ్యుండు విశే్వశుడే
శివునర్ధాంగి వరాల తల్లి నగజన్ చెల్వంపు భక్తిన్ మదిన్
పవలున్ ఱేలు భరించినట్టి ఘన విద్వద్వంద్యుడిద్ధాత్రిలోన్!

- డా. అక్కిరాజు సుందర రామకృష్ణ