మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అటులనే తాపత్రయ భారముచే క్రుంగిపోవువాడు సంసారమున మునిగిపోవుచుండ, అంతటి తాపత్రయమును ఉబలాటమును లేచివాడు భగవత్పాదారవిందముల నాశ్రయించి ఉన్నతినిబొందును. (చూ.413.)
363. ఇతరుల గుణావగుణములగూర్చి విమర్శించుచు కాలము గడపువాని జీవనము వ్యర్థమైపోవుచున్నది. ఏలన వాని కాలము ఆత్మచింతనమునగాని, పరమాత్మ చింతనమున గాని వినియోగపడుట లేదు, సరికదా, ఇతరుల మంచిచెడుగులను గూర్చి విమర్శించుటలో వ్యర్థమైపోవుచున్నది.
364. మనస్సు ఎట్టి దశలోనున్నప్పుడు భగవత్సాక్షాత్కారము లభించును? మనస్సు ప్రశాంతముగానున్నప్పుడు భగవంతుడు సాక్షాత్కరించును. మనస్సను సరస్సును కోరికలను గాడ్పులు కల్లోల పఱచునెడల అందు దేవుని ప్రతిబింబము గోచరింపదు. భగవత్సాక్షాత్కారము అట్టి స్థితిలో అసంభవము (చూ.536.)
365. కడుపు నిండియున్నను అజీర్ణవాతముచే బాధపడుచున్నను గూడ కమ్మని పిండివంటలును ఊరుగాయలును కంటబడగానె ఎవ్వనికైనను నోరూరును. ఒకడు లేశమును లోభికాకపోవచ్చును, పరమ పవిత్రభావమును గలిగియుండవచ్చును; ఐనను ధనమును ఇతర కామ్యార్థములును కంటబడగానే వాని మనస్సు రెపరెపలాడునుజుమీ.
366. నూతిలోని కప్పవలె నుండకుము. నూతిలోని కప్పకు నూయియే దాని ప్రపంచము. నూతి కంటె పెద్దది కాని, గొప్పది కాని మఱేమియు దానికి గోచరింపదు. ఇటులనే అందఱును స్వమత దురభిమానులే. తమ మతము కంటెను సంప్రదాయముకంటెను ఉత్తమమైన దేదియు వారికి గోచరింపదు.
367. శంకరులయొద్ద ప్రతి విషయమునను ఆతనిననుకరించునొక మూర్ఖశిష్యుడుండెను. శంకఱులు ‘శివో‚హం’అనునప్పుడెల్ల శిష్యుడును ‘శివో‚హం’అనెడివాడు. వానికి బుద్ధిగఱపనెంచి శంకరు లొకనాడు, కమ్మరికొలిమి సమీపమునుండి పోవుచు, మూసలో కరగియున్న సీసమును గైకొని త్రాగిరి, మఱియు శిష్యునిగూడ నటులే త్రాగుమని చెప్పిరి. కాని గురువొనర్చిన రుూ కార్యమును శిష్యుడు చేయజాలకపోయెను. అప్పటినుండియు ఆతడు ‘శివో‚హం’అనుట మానివేసినాడు. క్షుద్రానుకరణము ఎన్నటికిని కూడనిపనియే, కాని పెద్దల నడవడిని జూచి తన లోపములను దిద్దుకొనుట సదా శ్రేయస్కరము.
సంస్కారముల ప్రభావము
368. సంస్కారముల ప్రభావము ఎంత గొప్పదో చూడుడు! ఒకచోట కొందఱు సన్న్యాసులు కూర్చుండి యుండిరి. ఆ దారిని ఒక పడుచుపోవుచుండెను. అందఱును దైవధ్యానమున నిమగ్నులై యుండిరి. ఒక్కడు మాత్రము రహస్యముగా ఆమెపై దృష్టి నిగిడ్చెను. ఇటులా స్ర్తి సౌందర్యముచే ఆకర్షింపబడిన యాతడు గృహస్థుడైయుండి సన్న్యాసమున బ్రవేశించునప్పటికి ముగ్గురు బిడ్డల తండ్రియై యుండినవాడు.
369. ఒకచోట విత్తుకొట్టిన రెండెద్దులను జూచితిని. ఆవు ఒకటి ఆ త్రోవను బోవుచుండగాంచి అందొక యెద్దు ఉద్రేకము పొందినది. రెండవది శాంతముగనుండెను. ఈ విచిత్రవర్తనమునుగాంచి వాని పూర్వచరిత్రను విచారించితిని.
మొదటిది పెద్దదై ఆవులతో మెలగిన పిమ్మట దానికి విత్తు కొట్టిరట. రెండవదానికి చిన్నదూడగా నుండగనే కొట్టినట్లు తెలియవచ్చినది. పూర్వాభ్యాసములచే గలుగు సంస్కారముల బలము అంత గొప్పది. విషయ సుఖములను పొందకుండ సంసారమును త్యజించిన సాధువులు స్ర్తిలు కానిప్చినప్పుడు కామోద్రేకమును బొందరు.

- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి