మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇక సంసార భోగముల ననుభవించి, వయసు చెల్లిన తర్వాత కాషాయమును దాల్చువారు చిరకాలము ఇంద్రియ నిగ్రహ మవలంబించినను వారి పూర్వ సంస్కారములు మఱల తల యెత్తుట సంభవించుచుండును.
370. పాపప్రవృత్తులందు చరించు మనస్సును మాలపల్లెలందు వసించు కులీన బ్రాహ్మణునితో బోల్పనగును. లేదా పెద్ద నగరములలో వేశ్యలుండు తావున వసించు పెద్దమనుష్యునితో బోల్పనగును.
371. శ్రీగురుదేవునితో ఒకనాడొక పెద్దమనుష్యుడిట్లనెను: ‘‘నా కుమారుడు హరీశుడు పెద్దవాడు కాగానే వానికి పెండ్లి చేసెదను, అపుడు కుటుంబమును వానికి ఒప్పగించి, సన్న్యసించి నేను యోగాభ్యాసమారంభించును.’’ అందులకుశ్రీ గురుదేవుడిట్లు విమర్శించి పలికెను: ‘‘ఆ పక్షమున భగవద్భక్తి సాధన చేయుటకు నీకెన్నడును అవకాశము చిక్కనే చిక్కదు. అటుపిమ్మట కూడ ఈ హరీశునకును ఆ గిరీశునకును నేననిన ప్రాణము, నేను సన్న్యసించితినా, వారు బెంగపెట్టుకొందురు. మొదట హరీశునకు ఒక కొడుకు పుట్టనిండు, మనుమని పెండ్లి కూడ చూడవలదా?’ అనబోదువు. ఈ విధముగా నీ గొంతెమ్మ కోరికలకు హద్దుండదు.’’ (చూ.544.)
సిద్ధులవలని ప్రమాదమలు
372. మహిమల బ్రకటించువారల -జాలికుల -దరిచేరకుడు. వారు బ్రహ్మపథమును వీడి తిరుగాడువారు. వారి మనస్సు యోగసిద్ధులలో దగుల్కొనియున్నది. బ్రహ్మమార్గమున మాయచే పన్నబడిన వలలివి. వీనిచే మోసపోక మెలకువగలిగి వర్తింపుడు, సిద్ధుల నెన్నడును వాంఛింపకుడు.
373. రోగనివారణ చేయుట, వ్యాజ్యములు గెల్చుట, నీటిపై నడచుట- మొదలగువానికై తోడ్పడు యోగసిద్ధుల కొరకై ప్రాకులాడువారు అల్పబుద్ధులు. పరమేశ్వర చరణారవిందములనుదక్క మరిదేనిని నిజమైన భక్తులు ఆశ్రయింపరు.
374. ఒకప్పడు శ్రీకృష్ణుడు అర్జునకిట్లు తెల్పెను: ‘‘నీవు నన్ను పొందవలయునన్నచో నీకడ అష్టసిద్ధులలో ఏదేని ఒక్కటియైన నున్నంతవరకు కృతార్థుడవు కాజాలవు’’. ఏలన సిద్ధులు మానవుని అంకారమును బెంచి భగవంతుని మరపజేయును.
375. ఒకడు పదునాలుగేండ్లు అడవిలో ఘోర తపస్సు చేసి తుదకు నీటిపైన నడచు సిద్ధిని సంపాదించెను. ఈ సిద్ధి లభించెనని మ్రహ్మానందపరవశుడై గురుసన్నిధికి వెడలి యిట్లు పలికెను. ‘‘గురుదేవా! గురుదేవా! నేను నీటిపై నడుచు మహిమను పొందినాను!’’ అంతట గురువు వాని నిట్లు చీవాట్లు పెట్టెను: ‘‘్ఛ!్ఛ! పదునాలుగేండ్లు పడిన శ్రమకు ఇదియా ఫలము? పదునాలుగేండ్లు పాటుపడి నీవు చేయగలిగిన కార్యమును సామాన్య మానవులు పడవవానికొక కాలణా యిచ్చి చేయగలరు సుమీ!’’
376. సిద్ధులను అశుద్ధమువలె త్యజింపవలయును. పారమార్థిక సాధనలవలనను సంయమమువలన సిద్ధులు వానియంతటనవియే కలుగుచుండును. కాని సిద్దులపై మనసు నిలుపువారు వానియందు దగుల్కొని యిక పురోభివృద్ధి నొందజాలరు.
377. గుటికాసిద్ధి యనబడు అదృశ్యశక్తిని బడసిన చంద్రుడనునాతడొకడుండెను. అతడు ఒక గుటికను తనయొద్ద నుంచుకొని తన యిచ్చవచ్చిన చోటికి పోగలిగి యుండెను. ఇతరులకు ఆగుపడకుండా ఏ తావుననైనను ప్రవేశింపగలిగియుండెను. ప్రారంభమున నాతకు భగవంతుని యందు భక్తికలవాడై సాధనలందు నిష్ఠాపరుడై యుండెడివాడు. ఏమైనను అతడు ఆ శక్తిని సంపాదించిన పిమ్మట క్రమమముగా తన క్షుద్రభోగవాంఛలను సంతృప్తిపరచుకొనుటకై ఆ శక్తిని వినియోగించుకొనసాగెను.
- ఇంకాఉంది
*
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి