మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేనతనిని మందలించినను అతడు లక్ష్యపెట్టడయ్యెను. అతడు ఇతరులకుగాన రాకుండా ఒక పెద్దమనుష్యుని భవనమున బ్రవేశించి అందొక యువతితో వ్యభిచరింప మొదలిడినాడు. దానిమూలమున తుదకు తన సిద్ధిని పూర్తిగా పోగొట్టుకొని పతితుడైపోయెను.
378. ఒక్కొక్కప్పుడు సిద్ధులవలన గొప్ప అనర్థములు వాటిల్లును. ఒక గొప్ప సిద్ధుని గురించి తోతాపురి నాతో ఇట్లు చెప్పిరి: ఆ సిద్ధుడు సముద్ర తీరమున గూర్చుండియుండగా పెద్ద తుపాను చెలరేగెను. దానిచే చాలా బాధపడి, ఆ సిద్ధుడు, ‘తుపాను ఆగిపోవుగాక’ అనగానే తుపాను ఆగిపోయినది. సరిగా ఆ సమయమునే నిండారవిప్పిన తెరచాపలతో అతి వేగముగా సమద్రమునొక ఓడ పోవుచుండెను. ఆశస్మికముగా గాలి నిలిచిపోవుటచే ఆ తాకునకు ఓడ మునిగిపోవ, అందున్న వారందరూ సముద్రము పాలైరి! అంతమందికి ప్రాణహాని కల్గించిన పాపము తగులుటచే ఆ సిద్ధుడు తన సిద్ధులనన్నిటినీ కోల్పోవుటయేగాక నరకమును గూడా పొంది పాప ఫలమనుభవింప వలసివచ్చెను.
379. నేను పంచవటి క్రింద తీవ్ర సాధనలు చేయుచుండు కాలము గిరిజుడు అను నతడచటికి వచ్చెను. అతడు గొప్ప యోగి. ఒకసారి రాత్రి చీకటిలో నేను నా గదికిపోవలసి వచ్చెను. అంత నాతడు తనచేతిని పైకెత్త నాతని బాహుమూలమునుండి గొప్ప వెలుగు బయల్వెడలి మార్గమునంతయు ప్రకాశమానమొనర్చెను. నా హితవాక్కును విని యా మహిమను వినియోగించుట మనస్సు మరల్చుకొనెను. కొన్నాళ్లకాతని కాశక్తిపోయినను ఆత్మోన్నతిని బడయగల్గెను.
380. యాచకుడు మహారాజాంతఃపురమును బోగల్గియు గుమ్మడికాయ, పుచ్చకాయ వంటి క్షుద్ర వస్తువుల కొరకు యాచించునేని చాలా తెలివితక్కువగా వర్తించినవాడగును. రాజరాజేశ్వరుడగు సర్వేశ్వరుని ద్వారముకడ నిలిచి, అమూల్యమైన భక్తిజ్ఞానములను విడిచి, భక్తుడు సిద్దులకై అర్థించునేని అవివేకముగా వర్తించినవాడగును.
381. శ్రీగురుదేవుని బాలశిష్యులలో నొకడు, ఇతరుల మనోభావములను ముఖము చూచినంతనే గ్రహించు శక్తిమంతుడయ్యెను. పరమానందభరితుడై యాతడు తన సిద్ధిని గూర్చి గురుదేవునితో ముచ్చటింప, గురుదేవుడు మందలించి యిట్లు వచించెను: ‘‘సిగ్గు! సిగ్గు! నాయనా! నీశక్తి సామర్థ్యములను ఇట్టి క్షుద్ర విషయముల నిమిత్తము వ్యర్థము చేసికొనకు’’’.
382. ఒక శిష్యుడు దూరమున జరుగు సంగతులు తనకు ధ్యాన సమయమున ప్రత్యక్షముగ గోచరించునియు, ఆ సమయమున గొందరు ఏమి చేయుచుండునదియు జూడగల్గుదుననియు, విచారింపనయ్యని వాస్తవములని ఋజువగుచుండెననియు శ్రీ గురుదేవునితో జెప్పెను. అంతట శ్రీ గురుదేవుడాతనికిట్లు తెల్పెను. ‘‘నాయనా! కొన్ని దినముల వరకును ధ్యానమును ఆపివేయుము, బ్రహ్మసాక్షాత్కారమునకు ఈ శక్తులు అడ్డుతగులును జుమీ!’’
దానధర్మములు
383. జనులకు సమారాధనలు చేయుటెందులకు? సర్వభూతములందును వైశ్వానరరూపుడైయున్న భగవంతునకు ఆహుతి నొసకుట యనియేకదా మీయభిప్రాయము? ఐనను దేవునియందు భయభక్తులు లేని దుర్మార్గులు, వ్యభిచారులు మొదలైన వారిని అట్టి సమారాధనలకెన్నడును పిలువరాదు. వారు కూర్చుండుతావున ఎన్నియో బారల లోతు వఱకును భూమి మైలపడిపోవునంతటి మహాపాపములను జేసియుందురు.
384. ఒకప్పుడొక కసాయివాడు ఒక ఆవును దూరముననున్న గోవధశాలకు తోలుకొని పోవుచుండెను.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి