మెయన్ ఫీచర్

స్వచ్ఛతకు ప్రతీకలు..మట్టి ప్రతిమలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరం కరం కలసి
కాంతి వలయవౌతున్నది
కణం కణం కలసి విశ్వ
గణం విస్తరిస్తున్నది..
చినుకుచినుకు చేరిచేరి
సరిత పరుగు తీస్తున్నది,
చేయిచేయి చెలిమి చేసి
శక్తి అవతరిస్తున్నది..
నీరు పరిశుభ్రతను కలిగిస్తోంది. నీరు భూమిని శుభ్రపరచడం నిరంతర ప్రక్రియ.. వర్షం నీరు స్వచ్ఛతకు ప్రతీక. మన ఆరు ఋతువులలో వర్ష ఋతువు తరువాత వచ్చేది శరత్ ఋతువు. శరత్ ఋతువులో భూమి ఆకాశం గాలి నీరు పరమ స్వచ్ఛంగా ఉండటం ప్రాకృతిక ధర్మం. ఈ ప్రాకృతిక ధర్మం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆగస్టు 28న ఆదివారం నాడు ఆవిష్కరించిన ఆయన మనసులోని మాటలో మరోసారి స్ఫురించింది. రాజకీయాల గురించి వ్రాయడం విశే్లషించడం నిర్ధారణలను చేయడం అంచనాలు వేయడం జనజీవన గతిని నిర్దేశించడానికి ఏకైక మార్గమన్నది గొప్ప భ్రాంతి. జాతీయ జీవన విలాసంలో రాజ్యాంగ వ్యవస్థ ఒక ప్రధానమైన అంశం. రాజకీయం రాజ్యాంగ వ్యవస్థలో ఒక చిన్న విభాగం మాత్రమే. ‘శకలం’ సకలాన్ని దిగమింగినట్టుగా ‘రాజకీయం’ రాజ్యాంగ వ్యవస్థలోని మిగిలిన అంశాలను మాత్రమే కాక, జాతీయ జీవన వికాసానికి ప్రాతిపదిక అయిన సంస్కృతిని కూడ కబళిస్తోంది. ఈ రాజకీయం కూడ ‘‘ఆయన ఈయనను విమర్శించడం, ఈయన ఆయనను తిట్టడం’’ పరమావధిగా నడిచిపోతోంది. ఈ ప్రక్రియ ఎంత దిగజారితే అంత ఘాటుగా కుతూహలగ్రస్తులైన జనాలకు మత్తెక్కిస్తోంది. ఈ ఘాటు నరేంద్ర మోదీ ప్రవచిస్తున్న స్వచ్ఛతను కాలుష్యగ్రస్తం చేస్తోంది. అధికాధిక రాజకీయవేత్తలకు భిన్నంగా నరేంద్రమోదీ రాజకీయానికి కాక, జాతీయ జీవన వికాసానికి అనాదిగా, నిరంతరం జవసత్వాలను సమకూర్చుతున్న సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఆయన మనసులోని మాటల-మన్‌కీ బాత్- ద్వారా స్పష్టవౌతోంది. పర్యావరణను పరిపుష్టం చేసేవిధంగా వినాయకుని విగ్రహాలను, దుర్గాదేవి ప్రతిమలను మట్టితో తయారుచేసుకోవాలన్నది ఆదివారం ఆవిష్కృతమైన మోదీ మనసులోని మాట..వినాయకుడు భూమికి ప్రతీక, దుర్గామాత ప్రకృతి. భూమికి ప్రాణం ఉంది, ప్రకృతికి ప్రాణం ఉంది. ఈ ప్రాణం నిరంతర చైత న్యం. మాతృభూమి స్వభావమైన ఈ చైతన్యం నిరంతరం పరిమళించడం స్వచ్ఛ్భారత పునర్‌నిర్మాణం..
స్వచ్ఛత భౌతికమైనది, శారీరకమైనది. స్వచ్ఛత మానసికమైనది కూడ, ప్రవృత్తికి సంబంధించినది..బౌద్ధికమైనది, జీవన స్వభావానికి సంబంధించినది. ఈ మనందరి సమష్టి స్వభావం సంస్కృతి...్భమి జాతికి శరీరం, ప్రజలు ప్రాణం, సంస్కృతి జాతికి ఆత్మ, బుద్ధి! అందువల్లనే మాతృభూమి అస్తిత్వ భూమికపై వికసించే సంస్కృతికి సమానబద్ధులైన ప్రజలు, ప్రాంతీయ, భాషా మత జన సముదాయాలు ఒకే జాతిగా ఏర్పడుతున్నారు, ఏర్పడి ఉన్నారు. భౌతిక స్వచ్ఛత నీటితో భూమిని కడగడం, ‘చెత్త’లేని వీధులను నిర్మించడం, మురికిలేని వాడలను ఏర్పాటు చేయడం..నదీ తీరాలలో తటాకాల సమీపంలో మలమూత్రాలను విసర్జించకపోవడం.. బౌద్ధిక స్వచ్ఛత ఈ భూమిపట్ల మమకారం, ఇంటిపట్ల మమకారం, జాతీయ కుటుంబం పట్ల మమకారం, ప్రకృతి పట్ల మమకారం. ఈ మమకారం పెరిగినవారు, ఈ మమకారం కలిగినవారు ఈ భూమికి కన్నాలు పెట్టి గాయపరచలేరు. ఈ మాతృభూమి సంస్కృతిని ద్వేషించలేరు. ఈ జాతీయ కుటుంబంలోని ఇతర ప్రజలను దోచుకోరు, ఈ మాతృభూమిని ఆవహించి ఉన్న ప్రకృతిని పాడుచేయరు..‘గుట్కాల’ పొగాకు నమిలి వీధులపై, ఇళ్లపై, వీధులలో నడుస్తున్న మనుషులపై, భరతమాత గుండెలపై ఎఱ్ఱగా ఉమిసి జీవన స్వభావాన్ని, స్వరూపాన్ని ఎంగిలి చేయరు.. ‘‘ఎక్కడ పడితే అక్కడ ఎంగిలి ఉమియడం.. తినకూడని పదార్ధాలు తినడం, చెడ్డపనులు చేయడం వంటి అపరిశుభ్రతలను-నీరు-శుభ్రము చేయుగాక’’ అన్నది యుగయుగాల భారతీయుల ఆకాంక్ష, వేద ద్రష్టల అంతరంగం..‘‘ యదుచ్చిష్టం అభోజ్యం యద్వా దుశ్చరితం మమ సర్వం పునస్తు..’’ ఇలా భూమిని శుభ్రపరచవలసిన నీరు మురికిపట్టి ఉండడం నరేంద్రమోదీ మనసులోని మాటకు నేపథ్యం, వైపరీత్యం.
‘‘అకర్దమం ఇదం తీర్థం సన్ముష్య మనోఇవ..’’- ‘‘మంచి మానవుని మనస్సువలె ఈ కొలనులోని నీరు స్వచ్ఛంగా ఉంది’’- అని ఆదికవి వాల్మీకి ‘స్వభావ’ స్వచ్ఛత ప్రాతిదికగా ‘స్వరూప’ స్వచ్ఛతను వివరించాడు. స్వభావ స్వచ్ఛత వౌలికమైనది. మన జాతీయ స్వభావ స్వచ్ఛత కల్తీ అవుతోంది. అందువల్లనే మన భౌతిక స్వచ్ఛత భంగపడుతోంది. వినాయక ప్రతిమలను దుర్గామాత విగ్రహాలను కలుషిత జలాలలో, మురికి నీటి గుంటలుగా మారిన చెఱువులలో నిమజ్జనం చేయవలసి వస్తోంది. ఇందుకు కారణం పర్యావరణ పరిరక్షణకు భంగకరమైన మన జీవన విధానం. మన జీవన విధానం ప్రకృతితో పరిసరాలతో సమన్వయం కావడం సహజమైన ప్రవృత్తి. మట్టితో గణపతులను చేయడం వల్ల సహజమైన మట్టి సుగంధాలు ఇంటింటా సభలు తీరుతున్నాయి. సమస్త శుభంకరమైన పదార్ధాలు పరిమళాలు మట్టినుంచి పుట్టుకొని వస్తున్నాయి. మనం, సమస్త జీవజాలం మట్టినుండి రూపుదిద్దుకొంటున్నాము. వినాయకుడు మట్టికి ప్రతీక. మట్టితో కాక ప్లాస్టిక్‌తోను ప్లాస్టర్లతోను విష రసాయనాలతోను వినాయకుని బొమ్మలు, విగ్రహాలు చేయడం ప్రకృతితో మనం సాధించిన యుగయుగాల సమన్వయానికి భంగకరమైన పరిణామం. ఈ భౌతికమైన సాంకర్యానికి-కల్తీకి- కారణం సాంస్కృతికమైన సాంకర్యం. మన మేధావులలో అత్యధికులకు భారతీయమైన ఉదాహరణలు, పూర్వ నిర్ధారణలు లభించడంలేదు. అమెరికా ఉదాహరణలను ఉన్నత న్యాయమూర్తులు సైతం ఉటంకిస్తున్నారు. బ్రిటన్ పూర్వ నిర్ధారణలు మనకు మార్గదర్శకాలవుతున్నాయి. ఈ సాంస్కృతిక సాంక ర్యం ఈ దేశపు నీటిని, మట్టిని, ప్రకృతిని పరిసరాలను కల్తీ చేస్తోంది. అందువల్ల మట్టి గణపతులను కాక ప్లాస్టిక్, ప్లాస్టర్ గణపతులను నిర్మించాలన్న వికృతి మన స్వభావాన్ని ఆవహించింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనం వల్ల నీరు కలుషితం కావడం సముద్రమంత సమస్యలో ఒక బిందువు. నీరు కలుషితమై ఉండడం సముద్రమంత సమస్య...కలుషితమైన నీటిలో మట్టి విగ్రహాలను కానీ, విష రసాయన విగ్రహాన్ని గానీ నిమజ్జనం చేయవలసి రావడమే సముద్రమంత సమస్య. నీరు మాత్రమే కాదు మట్టి, భూగర్భం కూడ కలుషితమైంది. ముంచెత్తుతున్న రకరకాల విష రసాయనాలు ఇందుకు కారణం..బహుళ జాతి వాణిజ్య సంస్థలు తయారు చేస్తున్న, పురుగు మందులు కలిసిన శీతల పానీయాలను తాగుతున్నవారు, దూడల కడుపులోని లేత మాంసం కరిగిన ఐస్‌క్రీమ్‌లను ఆరగిస్తున్నవారు, ‘సోడియమ్ మోనో గ్లుటమేట్’ రసాయనం కలిసిన సేమ్యాలను భోంచేస్తున్నవారు, ‘ఎముకల నూనె’తో తయారైన ‘బజ్జీ’లతో వీధిపక్కన చేరి బొజ్జలను నింపుతున్నవారు తరతరాల ప్రాకృతిక సమన్వయాన్ని భంగం చేస్తున్నారు. రసాయన శీతల పానీయం తాగడం భయంకర వికృతి. కొబ్బరినీళ్లు, చెఱకురసం తాగడం ప్రకృతిని రక్షించే ప్రవృత్తి. వినాయకుడు మట్టికి ప్రకృతికి ప్రతిరూపం. ‘‘వినాయక చవితి’’ని అనేక ప్రాంతాలలో ‘‘టెంకాయల పండుగ’’ అని పిలవడం తరతరాల భారతీయుల ప్రాకృతిక సమన్వయ ప్రవృత్తికి చిహ్నం.
వినాయక చతుర్థి కొబ్బరికాయల నీటి పండుగ మాత్రమే కాదు, మేఘపు నీటి పండుగ కూడ. శ్రావణ, భాద్రపద మాసాలు పర్జన్యగర్జనలతో, కుంభవృష్టితో భూమిని ముంచెత్తడం అనాది ప్రాకృతిక సూత్రం. శ్రావణ, భాద్రపదాలు కలసిన వర్షఋతువులో ఆకాశం నిరంతరం నీటి మేఘాలతో ఆవృతమై ఉంటుంది. పదేపదే పునరావృతవౌతోంది..అందు భాద్రపద శుద్ధ చవితి రోజున కూడ సూర్యచంద్రులు కనిపించకపోవడం ప్రాకృతిక సంప్రదాయం. సృష్టిగత వాస్తవాలు సమాజస్థిత జీవన సంప్రదాయాలు కావడం హైందవ జాతీయ వికాస పరిణామక్రమం.. అందువల్ల వినాయక చవితి రోజున చంద్రుణ్ని చూడలేము, నల్లని వర్ష మేఘాల వెనుక నక్కినవాడు మనకు కన్పించడు. కనిపించకపోవడం సహజం, కనిపించాడంటే వర్షంలేని దుస్థితి ఏర్పడినట్టు స్పష్టమైపోతుంది. వినాయకుడు నీటిని సమకూర్చాలన్నది సంప్రదాయం. అందువల్లనే అనావృష్టి ఏర్పడిన సమయంలో గణపతిని పూజించిన తరువాత గ్రామీణులు ఆ విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయరు..చెఱువులు ఎండిపోయి ఉంటాయి. వర్షం కురిసేవరకు ‘‘గణపతి విగ్రహాన్ని నిర్బంధించి ఉంచుతారు.’’ ఇదీ ‘‘గణపతి చెఱవేయడం.’’ చెఱ నుండి బయటపడాలంటే బుజ్జి వినాయకుడు వాన కురిపించి తీరవలసిందే. లేకపోతే ‘బొజ్జ’ కుడుములతో నిండదు. వర్షం కురిసి చెఱువులు నిండిన తరువాత గణేశ విగ్రహాన్ని ద్విగుణీకృత ఉత్సాహంతో గ్రామీణులు ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేయడం అనేక ప్రాంతాలలో ఇప్పటికీ సంప్రదాయం.
మట్టినీరు సృష్టిస్తున్న పరిమళాల ప్రకృతి మన మానసిక, శారీరక బౌద్ధిక ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ఆలవాలమై ఉంది. ఈ పరిమళపత్రాలను, మొక్కల వృక్షాల ఆకులను ఇంటింటికీ తెచ్చుకొనడం వల్ల ఇల్లు కాలుష్యరహిత వౌతోంది. మట్టి గణపతిని ఇరవై ఒక్క ఆకులతో పూజించ డం ద్వారా ఆ ఔషధీ పత్రాల స్పర్శను మనం కూడ పొందగలుగుతున్నాము. ప్రతి ఆకు ఒక్కొక్క అద్భుతమైన సుగంధాన్ని విరజిమ్ముతోంది. ప్లాస్టిక్ వాసనలను మరిగి ముక్కులు ముఖాలు చెడిపోయిన వారికి సైతం ఈ ప్రాకృతిక సుగంధాలు, స్వస్థతను సమకూర్చుతున్నాయి. ‘గరికె’ భూమి ఆరోగ్యానికి ప్రతీక. గరికె జంట-దుర్వాయుగ్మం-ల గణపతికి ప్రాకృతిక పతాకాలు. గరికెకు మరోరూపం దర్భ. కొండలలో పరిమళాలను వెదజల్లే రకరకాల గడ్డి గరికెకు వివిధ రూపాలు. గరికె ప్రకృతిని పరిశుభ్రం చేస్తున్న దివ్యౌషధ కలిక! ‘గరికె’ ప్రగతికి చిహ్నం. కణుపు కణుపు మరో ప్రగతి మలుపు. అందుకే..
నీ నడిచెడి దారులందు
గరికెపూలు పూయుగాక
నీ ఇంటికి వెనుక, ముందు
నీటి కొలనులుండుగాక
అన్నది వేద ఋషుల ఆకాంక్ష..‘‘ఆయనేతే పరాయణే, దుర్వా రోహన్తి పుష్పిణీ, హ్రదాశ్చ పుండరీకాణి..’’ ఈ నీటి కొలనులలోని పువ్వుల పరిమళాలు పరిశుభ్రతను పంచే పవన వాహనాలు. మట్టి గణపతులను ఇలాంటి నిర్మలమైన నీటికొలనులలో నిమజ్జనం చేయగల రోజులు మళ్లీ రావడం నరేంద్ర మోదీ స్వచ్ఛ్భారత్ స్వప్నానికి సాకారం. నీటి శుభ్రత, భూమి శుభ్రత ముడివడి ఉన్నాయి. విష రసాయనాలు లేని సేంద్రియ వ్యవసాయం భూమి ఉపరితలాన్ని, గర్భాన్ని స్వచ్ఛంగా తీర్చిదిద్దగల ఏకైక సాధనం. భూగర్భ స్వచ్ఛత నీటి స్వచ్ఛతకు దోహదకరం..ఇందుకోసం మరింత వౌలికమైనది మన మానసిక స్వచ్ఛత!!

- హెబ్బార్ నాగేశ్వరరావు సెల్: 9951038352