మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తారకమంత్రమగు ప్రణవము సామాన్యశబ్దముకాదు, సాక్షాత్ పరబ్రహ్మస్వరూపము. అటులనే పవిత్రతను భక్తినిగోరుకొనుట క్షుద్రమగు లౌకిక వాంఛలతో బోల్పదగదు.
స్ర్తిలయెడ నుండవలయు మనోభావము
435. స్ర్తిలందఱును జగన్మాతయొక్క అంశములేకావున ఎల్లరును వారిని తల్లులవలె భావింపవలయును.
436. స్ర్తిలు యోగ్యురాండ్రైయుండనిమ్ము, అయోగ్యురాండ్రై యుండనిమ్ము, పతివ్రతలు కానిమ్ము, కాకపోనిమ్ము; వారిని ఆనందమయియగు అల జగజ్జనని దివ్యస్వరూపములుగా గనవలయును.
437. ప్రశ్న: స్ర్తిలను మేమెటుల జూడవలయును?
ఉ.ఎవ్వడు బ్రహ్మజ్ఞానమును బడసియున్నాడో, అట్టివాడు వారిని గాంచువిషయమున భయమందడు. ఆతడు వారిని తాత్త్వికదృష్టితో, అనగా జగజ్జననియొక్క అంశములుగాగాంచును. కావున వారియెడ గౌరవమర్యాదలు చూపుటయేకాక, పుత్రుడు జననినివలె సాక్షాత్తువారిని ఆతడు పూజించును. (చూ.86)
438. ప్రశ్న: కామమును మేమెట్లు జయింపగలము?
ఉ. స్ర్తిలనందఱను నీతల్లివలె భావింపుము. స్ర్తిల పాదములవైపు చూడుముకాని ముఖమువైపు ఎన్నడును జూడకుము. ఇట్లు చేసిన యెడల మనస్సునుండి దుష్టచింతలు పలాయనమగును. (చూ.85, 243, 350, 426.)
439. భర్తతో కాపురము చేయుచును గూడ బ్రహ్మచర్యము నవలంబించుస్ర్తి సాక్షాత్తు జగజ్జననియే.
440. ప్రశ్న: తంత్రశాస్తమ్రు బోధించునటుల స్ర్తి సాంగత్యమున సాగింపబడు భక్తిసాధనలను గూర్చి మీ అభిప్రాయమేమి?
ఉ. అని నిరపాయమైన మార్గములుకావు, మఱియు దుర్లభములు, భ్రమప్రమాదములతో గూడుకొనియున్నవి. తంత్ర శాస్త్రానుసారము మూడు విధములైన సాధనలుగలవు. జగజ్జననియెడ సాధకుడు వీర భావమునుగాని, సఖీభావమును గాని, పుత్రభావమునుగాని అవలంబింపవచ్చును. నాది పుత్రభావసాధన. సాధకుడు జగన్మాతయొక్క సఖినని భావించుటకూడ మంచిదే కాని వీరభావము, లేక వీరాచారము అపాయముతో గూడుకొనియున్నది. (తాను జగజ్జనని పుత్రుడనని భావించు) పుత్రభావమే నిష్కళంకము.
441. నీకు దైవానుగ్రహము వలయునెడల పరాశక్తియగు జగన్మాతను సంతుష్టురాలినొనర్పుము. ఔను, ఆమెయే మహామాయ. సమస్త జగత్తును భ్రమింపజేయునదామెయే. సృష్టిస్థితిలయములను మహాలీల నామెయే సాగించుచున్నది. సర్వము నామె అజ్ఞానముచే గప్పియున్నది. మోక్ష ద్వారము నామె తెఱవనిదే ఎవ్వరును ఆత్మసౌధమును బ్రవేశింపజాలరు. బైటనుండి మనము కేవలము బాహ్య విషయములను జూచుచున్నాము. సచ్చిదానందమయుని స్వరూపము సర్వదా మనకు అతీతమై, అగోచరమై యున్నది.
విద్య, అవిద్యయునని దివ్యశక్తి రెండు రూపముల వెలయుచున్నది. కామినీ కాంచనములచే అవిద్య జగమును భ్రమింపజేయుచు సంసారబద్ధమొనర్చుచున్నది. విద్యయో,- భక్తికిని, జ్ఞానమునకును, ప్రేమకును, కారుణ్యమునకును నిలయమై మనలను పరమేశ్వరుని సన్నిధికి గొనిపోవును. (చూ.4.)
ఈయవిద్యాశక్తిని సంతుష్ట నొనర్చుటకే శక్తి పూజ విధింపబడియున్నది. ఇందులకై వివిధ మార్గములుకలవు. సాధకుడు తనను ఆమెయొక్క సఖిగాగాని, భర్తగాగాని, బిడ్డగాగాని భావించుకొనవచ్చును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి