మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాక్షాదవతారమూర్తియగు శ్రీరామచంద్రుడు లంకలోనికి బోవుటకై సముద్రమునకు సేతువు గట్టవలసివచ్చెను. కాని యాతని భక్తుడును సేవకుడునగు హనుమంతుడు రామనామమందలి యఖండ విశ్వాసముచే ఒక్కదుముకున సాగరమున లంఘించెను. కేవల విశ్వాస మహిమచే స్వామికంటే సేవకుడే ఎట్లు ఘనతర కార్యమును జేయగల్గెనో చూడుడు.
509. బ్రహ్మహత్యాపాపమునకు పాల్పడిన యొక రాజు తాను ఎట్టి ప్రాయశ్చిత్తము చేసికొని పునీతుడు కాగల్గునో తెలిసికొనుటకై యొక ఋష్యాశ్రమమునకు వెడెలను. ఆశ్రమమున ఋషి లేడుగాని యాతని కుమారుడుండెను. రాజువచ్చిన పనిని దెలిసికొని, ‘‘ముమ్మారు రామనామస్మరణము చేయుము, నీ పాపపరిహారమగును’’అని యాతడు ప్రాయశ్చిత్తము విధించెను. పిమ్మట ఋషి వచ్చి తన కుమారుడు విధించిన ప్రాయశ్చిత్తమున గూర్చి విని కుపితుడై యిట్లు పలికెను. ‘‘రామభగవానుని నామమును ఒక్కసారి యుచ్చరించినంతనే కోటిజన్మములలో జేసిన పాపములన్నియు హరించునే! ఓరీ! మూఢుడా! నీవెంతటి విశ్వాసహీనుడవు! అట్టి పవిత్ర నామమును మూడుసార్లు ఉచ్చరింపుమని విధించితివా! నీ విశ్వాహీనతకు ఫలముగా చండాలుడవై పుట్టుము’’ ఆతడే రామాయణమున బేర్కొనబడిన గుహుడు.
510, 511. బొమ్మఱాయి అనేక సంవత్సరములు నీటిలో బడియుండవచ్చును, కాని యొక చుక్క నీరైనను దానిలోని కెక్కదు. కాని మృత్తిక నీటి స్పర్శ తగులగానే మెత్తబడిపోవును. అటులనే దృఢవిశ్వాసముగలవాని హృదయము ఎన్ని బాధలు వచ్చినను, ఎన్ని హింసలకు గురియైనను క్రుంగిపోదు. దుర్బల విశ్వాసము కలవాడో, ఇసుమంత కష్టము ప్రాప్తించినంతనే చంచలించిపోవును.
512. భావనననుసరించియే సిద్ధియు గలుగును. భ్రమరమును గూర్చి కీటకము సదా భావన చేయుటవలన ఆ కీటకమే భ్రరముగా మాఱునని చెప్పుదురు. అటులనే బ్రహ్మానందమును గూర్చి సదాభావన చేయువాడు (తుదకు) బ్రహ్మానంద మయుడగును.
513. ఆజన్మాంతము పాపమునుగూర్చియు నరకమును గూర్చియు ప్రలాపింపనేల? భగవన్నామస్మరణ యొనర్చి, ‘‘ఓ తండ్రి! పరమేశ్వరా నేను చేయరాని పనులనెన్నో చేసితిని. చేయవలసిన పనులనెన్నో చేయక విడిచితిని. తండ్రీ! నన్ను క్షమింపుము’’ అని యొక్కసారి మొఱపెట్టుము. భగవంతునియందు సుస్థిర విశ్వాసముంచుము, తప్పక పాప విముక్తుడవగుదువు.
514. మన దేశమున వైద్యులలో కేవలము విశ్వాసమును గొలిపి రోగమును కుదుర్చువారు కలరు. రోగులకు వారు, ‘రోగమనునదియే లేదు’ అని పూర్ణ విశ్వాసముతో మరల మరల స్మరింపుడు’’ అని విధింతురు. రోగగ్రస్తులటుల స్మరించి యామనోభావముయొక్క మహిమ చేతనే ఆరోగ్యమును బొందగల్గుదురు. పాపినని- నైతిక దుర్బలుడనని- తలపోయసాగితివా, ఆచిరకాలముననే అటులగుదువు. నీవు అఖండ శక్తిమంతుడవని- మహామహిమాన్వితుడవని గ్రహింపుము, విశ్వాసము పూనుము; తుదకు నీవు అఖండ శక్తిమంతుడవగుదువు. మహామహిమాన్వితుడ వగుదువు.
515. జీవుడనని భావించువాడు జీవుడగనే యుండును. దేవుడనని భావించువాడు దేవుడే యగును. మనము ఎట్లు భావింతుమో అట్లగుదుము
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి