మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరణాగతి
516. ‘పరమేశ్వరేచ్ఛయే జరుగుగాక’ యని నిర్మలమైన భక్తితోడను, నిష్కటపమైన విశ్వసముతోను ఎవ్వడు పరమేశ్వరునకు తన్ను తాను సమర్పించుకొనునో అట్టివాడు శీఘ్రముగా సాక్షాత్కారము బొందును.
517. సంసారమున నుండుట కాని సంసారమును త్యజించుటకాని పరమేశ్వరేచ్ఛపై నాధారపడియున్నది. కాబట్టి సర్వము ఆ పరమేశ్వరునికే సమర్పించి కర్మముల నొనర్పుము. అంతకంటె నీవు చేయగల్గినదేమి?
518. ఆరుబయటను పొలములోనున్న చిన్నగుంట యందలి నీరు, ఎవ్వరును వాడుకొని హరింపకున్నను త్వరలోనే ఎండిపోవును. అటులనే పాపాత్ములొక్కక్కప్పుడు పరమేశ్వరుని కరుణను కృపగా అనన్యగతిగా నమ్ముకొని కేవలము వాని ఆత్మార్పణము చేసికొని తరింతురు.
519. (ఇచట 271వ ప్రవచనము జదువుకొనుడు)
520. ముక్త్యారునామా (పవర్ ఆఫ్ అటార్నీ)కు మించిన సులభతరమును సురక్షితమునగు మార్గము వేరులేరు. ఇచట ముక్తారునామా అనగా ‘నాది’ యనుభావము పూర్తిగా విడిచి సర్వేశ్వరేచ్ఛకు సంపూర్ణముగా తన్ను తాను సమర్పించుకొనుట అని భావము.
521. కోతి తిరుగులాడుచుండ దాని పిల్ల తల్లిని గట్టిగా అంటిపట్టుకొనియుండును. పిల్లికూనయో, అటులగాక జాలిపుట్టునట్లు ‘మ్యావు, మ్యావు’ మనుచుండును. అంత తల్లి దానిని మెడ పట్టుకొని (సురక్షితమైన చోటికి) తీసికొని పోవును. కోతిపిల్ల తనయొక్క పట్టును విడిచెనా, క్రిందపడి హాని పొందును. ఎందుచేతననగా అది తన బలమునే నమ్ముకొనియున్నది. కాని పిల్లిపిల్లలకు అటువంటి భయము లేశమునులేదు, తల్లియే దానిని ఒక చోటినుండి మరియొక చోటికి తీసికొనిపోవును. పరమేశ్వరునకు పూర్తిగా ఆత్మార్పణము చేసికొనుటకు తన్నుతాను నమ్ముకొని యుండుటకును గల భేదమిటువంటిది.
522. ఒకడు తన యిరువురు బిడ్డలను (కుమారులను) దీసికొని పొలముమీదుగా బోవుచుండెను. ఒక బాలునెత్తుకొనినాడు. రెండవవాడు తండ్రి చేతిని బట్టుకొని నడచుచుండెను. అంత వారికి ఆకాశమున నెగురుచున్నయొక గాలి పటము కాన్పింప, తండ్రి చేతిని బట్టుకొనిన బాలుడు తన పట్టును విడిచి చప్పట్లుగొట్టుచు, ‘‘నాన్నా! నాన్నా! అదిగో; గాలిపటము!’’అని యానందముతో కేకలిడసాగెను. ఇంతలో ఆ బాలుడు తడబడి పడిపోయెను. దెబ్బలు తగిలినవి. తండ్రి యెత్తుకొనిన బాలుడును ఆనందముతో చప్పట్లు గొట్టినాడు. కాని తండ్రి పట్టుకొనియుండుటచే క్రిందబడలేదు. ఆధ్యాత్మిక విషయమున స్వయంసాహాయ్యమును- పురుష కారమును- నమ్ముకొనువాడే ఇందు మొదటిబాలుడు, భగవంతునకు ఆత్మార్పణము చేసికొనువాడే రెండవవాడు.
523. వేయి చిల్లులుగల కడవతో నీళ్లుతెచ్చి శ్రీమతి (రాధాదేవి) తన పవిత్రతను ఋజువుచేసికొనవలసి వచ్చినప్పుడు ఒక్క నీటి బొట్టైన క్రిందబడకుండ తేగల్గెను. దానినిగాంచి యందఱును ‘‘ఇట్టి పతివ్రత ఇంతకుముందు లేదు. ఇకముందు ఉండబోదు’’అని వక్కాణించుచు ఆమెను విశేషముగా కొనియాడసాగిరి. అంత రాధాదేవి యిట్లు పలికెను; ‘‘ననే్నల నుతించెదరు! కృష్ణునకు జేజేలు పెట్టుడు! ఆ మహిమమంతయు ఆతనిది కాని నాది కాదు. నేను కేవలము అతని సేవకురాలను?’’
524. సంపూర్ణమైన ఆత్మార్పణస్థితి యెట్టిదో తెలియునా? దినమంతయు కష్టపడి పనిచేసి యలసియున్నవాడు దిండుపై జేరబడి తీఱుబడిగా చుట్టకాల్చుకొనుచు అనుభవించు సుఖవిశ్రాంతి వంటిది. అపుడంతయు కేవల నిర్విచారము!

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి

- ఇంకాఉంది