మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

525. అన్నము తిని పారవేసిన ఆకువలె లోకమున మనుము. అది యొకప్పుడింటిలోనికిని మఱియొకప్పుడు పెంటమీదికిని గాలిచే నెగురగొట్టబడుచు, దానికి వశమైయుండును. దైవ వశమున నీవిప్పుడిక్కడనున్నావు. మంచిది. ఇట్లేయుండుము. ఇందుండి తీసివేసి దైవము మఱల నిన్నింతకంటె ఉత్తమస్థితిలో నుంచుననుకొనుము. అపుడును పూర్తిగా అసంగుడవై, ‘‘దైవేచ్ఛయే జరుగుగాక!’’యను నాత్మార్పణబుద్ధితో నుండుము. ఏమి జరిగినను జరుగుగాక నీవు మాత్రము నిశ్చింతుడవై యుండుము.
ఇష్టనిష్ఠ
526. కుటుంబమున అత్తమామల యెడ కోడలు విధేయురాలై వారిని గౌరవించుచు వారికి సేవలుచేయుచుండును. వారి నెన్నడును నిరసింపదు, వారి మాటను జవదాటదు. ఐనను తన పెనిమిటిని అందఱికంటెను హెచ్చుగా ప్రేమించును. అటులనే నీయిష్టదైవమునెడ భక్తిశ్రద్ధలు వహింపుము; కాని యితర దేవతలను నిరసింపకుము. వారినిగూడ పూజింపుము. సమస్త దేవతలును ప్రేమమూర్తియగు పరమేశ్వరుని రూపములే కదా!
527. అష్టకాష్ఠము అనునాటలో పాచికలు అన్ని గదులను దాటిపోయి, తిరిగి రాకుండ నడిమి గదిని జేరి పండవలయును. నడిమిగదిని జేరువఱకును ఏ పాచికయైనను ప్రారంభించినచోటికే మఱల మఱల బోవుచు చాలసార్లు పాడిన పాటనే పాడవలసి వచ్చును. కాని రెండు పాచికలు జంటగా ఒక గది నుండి మఱియొక గదికి బావుచుండునెడల, ఏయాటకాడును వానిని వెనుకకు నెట్టివేయజాలడు. అటులనే లోకము (అనునాటపాళి)లో ఆధ్యాత్మిక యాత్ర సాగించువారు గురువును ఇష్టదైవమును శరణుజొచ్చినయెడల మార్గమున అవరోధములను బాధలను గుఱించి భయపడవలసిన అవసరం ఉండదు. వారి పురోగమనము సరళముగా, నిరాటంకముగా సాగును.
528. కలకత్తాకు పోవుమార్గములనేకములు కలవు. సంశయశర్మ యనువాడు ఆచటికి పోవలయునని దూరముననున్న తనయూరినుండి బయలుదేఱెను. దారిలో అతడు, ‘‘నేను శీఘ్రముగా కలకత్తా జేరు మార్గమేది?’’అని యొకని నడుగగా ఆతడు, ‘‘ఇదిగో, ఈ మార్గము ననుసరించి పొమ్ము’’అని చెప్పెను. ఆ దారిని కొంతదూరము వెడలి సంశయశర్మ వేఱొకని జూచి, ‘‘కలకత్తాకు దగ్గఱత్రోవ ఇదేని?’’అని యడిగెను. ఆ మనుష్యుడు, ‘‘అబ్బే! ఇదికాదు, వెనుకకు మఱలి యెడమ చేతివైపునవున్న త్రోవను బోవలయును’’అనెను ఆ మార్గమునుబట్టి కొంత దూరముపోయి సంశయశర్మ మఱల మఱియొకని జూచి త్రోవయడిగెను. ఆతడు మఱియొక త్రోవ జూపినాడు. ఇట్లు పదే పదే త్రోవలను మార్చుకొనుచు సంశయశర్మ ప్రొద్దుగ్రుంకువఱకు నడిచెను. కాని బయలుదేఱినచోటినుండి ఎంతయో దూరముపోలేదు. నిజముగా కలకత్తాకు బోదలచినవాడు నమ్మదగిన యొకడు చూపిన యేదియో యొక మార్గమునుబట్టి పోవలయును. అటులనే భగవంతుని ప్రాపింపగోరువాడు ఉత్తముడగు నొకానొక గురువు నాశ్రయించి యాతడు చూపుమార్గమును శ్రద్ధ్భాక్తులతో అనుసరింపవలయును.
529. ఒకడు నూయి త్రవ్వనారంభించినాడు. నాలుగైదు బారల లోతు త్రవ్వి నీరుగానక మఱియొక చోటును నిర్ణయించి అక్కడ ఇంకను లోతుగా త్రవ్వినాడు. కాని అక్కడను నీరు పడకపోవుటచే మఱియొక తావును నిర్ణయించి అక్కడ మఱింత లోతుగా త్రవ్వినాడు, కానీ ఫలము కలుగలేదు. తుదకు విసిగివేసారి ఆ పనినే విడిచిపెట్టినాడు. ఈ మూడు నూతుల లోతును కలిపిన పాతిక బారలకు కొంచెము తక్కువగా నుండును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము - సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి