మెయిన్ ఫీచర్

రామనామం...తారకమంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహితీ క్షేత్రంలో వెలువడిన కృతుల్లో రామాయణం ఆదికావ్యం. దీనిని లోకానికి అందించి పాఠకులను మదురానుభూతులను పంచి ఇచ్చిన మహర్షి వాల్మీకి. సీతారాముల వృత్తాంతాన్ని ఆధారంగా తీసుకుని లోకానికి ఆనందోపదేశం చేశారు. వాల్మీకి మానవులకు ధర్మాచరణ చేయడానికి మార్గదర్శకుడుగా నిలిచాడు.రాముని చరితాన్ని చూపి ధర్మాచరణ ఏలా చేయాలో రాముని చేత చేయించి చూపాడు. రామాయణం మానవాళికి లభించిన పరమ పవిత్ర కావ్యం. సకల సందేహాలను దూరం చేసి పవిత్ర ధర్మమార్గములను సూచించిన దివ్య రచన. కావ్యరూపమున వెలసిన ఒక మధుర కృతి. ఇతిహాసములలో రామాయణం భారతీయ వాఙ్మయమునకు తలమానికము దీనిలోమర్యాదా పురుషోత్తముడైన శ్రీరామ చంద్రుని దివ్యలీలలుగా వర్ణించబడ్డాయి. రాజుగారి బిడ్డ యినా సామాన్య మానవునివలె రాముడుచరించిన ఘటనలు విని రామాయణ పాఠకుడు అబ్బురం చెందుతాడు. తాను కూడా ఆ ధర్మాచరణ చేయాలనే తలంపుకు వస్తాడు. సమస్త కావ్యములకును మకుటాయమానమై విరాజిల్లేది రామాయణమే.
స్వయంభువు అయిన బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి సాక్షాత్కరించి రామాయణాన్ని రచించ గలిగే అద్భుత వరాన్ని ప్రసాదించినారు. శ్రీమన్నారాయణుని దశావతారాల్లో త్రేతాయుగంలోని శ్రీరామావతారము ప్రసిద్ధికెక్కి పరిపూర్ణావతారంగా రూపు దాల్చింది. శిష్ట రక్షణకు దుష్ట శిక్షణకు శ్రీహరి దశరథ తనయునిగా వెలసి ధర్మ రక్షణగావించిన దివ్యోపదేశమే శ్రీరామాయణం. తన సద్గుణములచే అందరినీ ఆనందింపచేసిన వాడు రాముడు. శ్రీరాముని కన్న రాముని నామమే యుగ యుగాలలోను గొప్పదై మహనీయతను చాటుతుందనీ రామనామం భవతారకం అనీ పరమ శివుడు కైలాసంలో పార్వతీ దేవి అడిగిన ప్రశ్నకు జవాబుగా రామ నామ ప్రభావాన్ని గురించి చెప్పాడు. రామాయణం వేదతుల్యం అని ప్రబోధించాడు. ఒక పద్యంలో కవి రామనామ ప్రాభవాన్ని గురించి ఇలా చెబుతున్నాడు.
ఎవని నంత కాలమొనయుచో నొక పరి
యేని దలచి - మనుజ లీదునార
లిల భవామ్ది నతని య లఘుకింకరుని
క్కడలి గడచుటెంత కమల నయన !
ఓ పార్వతీ ! జీవితం చివరి కాలంలో ఎవరి నామాన్ని ఒక్కసారి తలచినంత మాత్రాన ఈ సంసార సాగరాన్ని దాటగలరో అట్టి వాని గొప్ప సేవకునికి ఈ జలధి దాటడం ఎంతపని అని మారుతి గురించి శివుడు పార్వతితో చెప్పాడు. రఘువంశసుధాంబుధి చంద్రుడు శ్రీరాముడు.
సచ్చిదానంద పరబ్రహ్మ మే శ్రీరాముడు. సహజ కవి బమ్మెర పోతనామాత్యుల వారు భాగవత రచన గావిస్తూ రామ నామ మహిమను తెలిపిన తీరు మనోజ్ఞం.
మంతనములు సద్గతులకు
పొంతనములు ఘనములైన పుణ్యమల కిదా
నీంతన పూర్వ మహాఘ ని
కృంతనములు రామ నామ కృతి - చింతనము లే అన్నారు.
మానవులను సన్మార్గంలో నడిపించడానికి ఇహ పరాల రెండింటిలోను గొప్ప పుణ్యాలను లభింపచేయుడుకు రామకథా కావ్యాలే దిక్కు. అవే మూలాలు. జన్మజన్మల నుండి పేరుకొని పోయిన పాపాలను రామనామ కృతులే నశింపచేస్తాయి. నిరంతరం హరి నామస్మరణలో పునీతుడైన నారద మహర్షి అందించిన ప్రోత్సాహంతో వాల్మీకి ముని రామనామ స్మరణ చేసి తపం చేసి మహాకవియై రామాయణం రచించాడు. ఆదికవిగా చరిత్ర చిరకీర్తిని ఆర్జించి పెట్టాయి. పరమ శివుడే స్వయంగా రామ నామ ప్రభావాన్ని తెలుపుతూ శ్రీరామ రామ రామేతి రమే రామే మనో రమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అన్నాడు. చూశారా.. మానవులు నేటికైనా రాముని జీవితాన్ని తెలుసుకొని రాముని నడవడిని అలవాటు చేసుకొంటే చాలు రామునిలాగా మారుతారు. జీవితం ఆనంద నందన వనంగా మార్చుకుంటారు. కేవలం రామనామం పలకండి. జీవితాన్ని నందనవనం చేసుకోండి.

- పి.వి. సీతారామమూర్తి