మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇట్టి గ్రహణ శక్తితోడనే మానవుడు భగవంతుని దెలిసికొనగల్గును. ఈ రీతి నిర్మల ప్రజ్ఞచేతనేకాని భగవత్సాక్షాత్కారము పొందజాలము.
540. వీర్యనష్టమువలన శక్తిసామర్థ్యములు క్షీణించును. తన యెఱుక లేకయే గలుగు (స్వప్న) స్ఖలనము ఒక లెక్కలోనిది కాదు. అయ్యది ఆహార దోషముచే సంభవించును. కాని, ఉత్తమ పారమార్థికుడగు వానికి స్ర్తితో ఎట్టి సంపర్కము నుండరాదు.
541. స్ర్తి భోగమును విడిచినవాడే ప్రపంచమును త్యజించినవాడు! భగవానుడు వానికి అత్యంత సన్నిహితుడు!
వివేకము
542. వివేకము నవలంబింపుము. కామినీ కాంచనములు మిథ్యాభూతములు, భగవంతుడొక్కడే సత్యము. ధనమువలననేమి ప్రయోజనము? మనకది అన్న వస్తమ్రులను నివసించుటకు ఇంటిని ఇచ్చును, - అంతే. ధనమువలన నీ వెన్నటికిని భగవంతుని గనజాలవు. ధనము పరమపురుషార్థముకాదు. ఈ విధమైన విచారము వివేకము. కాంచనములోగాని, స్ర్తిసౌందర్యములోగాని ఏమున్నది? వివేకము వినియోగించి చూచినచో, మహాసుందర స్ర్తి శరీరము సైతము రక్తము, మాంసము, చర్మము, ఎముకలు, క్రొవ్వు-మజ్జ, - తుదకు ఇతర జంతు శరీరములవలెనే- ప్రేగులు, మలము, మూత్రము మొదలగు వానితో గూడుకొనియున్నదని బోధపడును. భగవంతుని మఱచి ఈ తుచ్ఛ కళేబరముపై మానవుడు తన మనసు నిలుపుట ఎంత విచిత్రము! (చూ.395, 545)
543. వివేక వైరాగ్యముల నవలంబింపుడు, నిత్యమేదియో అనిత్య మేదియో గ్రహించుటయే వివేకము; విషయ భోగములందు రాగములేకుండుటయే వైరాగ్యము. వివేక వైరాగ్యములు ఆకస్మికముగా లభించునవి కావు, వానిని అనుదినము అభ్యాసము చేయవలయును. కామినీ కాంచనములను మొట్టమొదట మానసికముగా విడచిపెట్టవలయును; భగవదనుగ్రహముండునేని అటుపిమ్మట బాహ్యముగను ఆంతరంగమును కూడ విసర్జింపనగును. అభ్యాసయోగముచే- నిరంతర ధ్యాన సాధనలచే - కామినీ కాంచనముల యెడ వైరాగ్యమబ్బును- గీతయందును ఇట్లే చెప్పబడియున్నది. నిరంతర సాధనచే అసాధారణ శక్తికలుగును. అపుడింద్రియములను- కామాదులను-సులభముగా నిగ్రహింపగల్గుదుము. అవయవములను బొరుసులోనికి లాగుకొనిన తాబేటిని నీవు ముక్కముక్కలుగా నఱికినను అది తన యవయవములను ఈవలికి తీయదు. ఇంద్రియ నిగ్రహమనగా ఇట్టిది.
544. ప్రశ్న: జగత్తు మిథ్యయా?
ఉ. నీవు భగవంతుని గన జాలనంతవఱకు జగత్తు మిథ్యయే. సమస్తము భగవత్స్వరూపముగా గనుటకు బదులు, ‘‘నేను, నాది’’యను పాశములచే మానవుడు సంసారబద్ధుడగుచున్నాడు. అట్లు అజ్ఞాన మోహితుడై, విషయాసక్తుడై, సంసార కూపమున బడిపోవుచున్నాడు. తరణోపాయము స్పష్టముగా గోచరించియున్నను మాయ తన జాలమునుండి మానవులను వెలువడనీయదు, తనయొక్క మోహముచే వారిని అంధులను జేసివైచును. విచారించిన, ఈ సంసార మెంత అనిత్యమో నీకే తెలియగలదు. మనము నివసించు నింటిని గూర్చి క్షణమాలోచింపుము. ఇందెందఱు పుట్టిరో! ఎందఱు గిట్టిరో! ప్రాపంచిక విషయములు ఒక్క క్షణమున మనయెదుట గాన్పించి -ఉత్తర క్షణమున అదృశ్యమైపోవును. ‘‘నావారు’’ అని నీవు భావించువారు కనుమూసినంతనే (మరణించినంతనే) లేకపోవుచున్నారు. సంసారులకు మోహపాశములెంత బలీయములో కదా!
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి