మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాను సంరక్షింపవలసినవారు కుటుంబమున దనకెవ్వరును లేకున్నను ఏ మనుమనియందోగల మమకారముచే నరుడు కాశికి వెడలజాలకున్నాడు. ‘‘నేను లేని పక్షమున మా హరి ఏమైపోవునో’’ అను చింతయే వానిని సంసారబద్ధుని జేసివేయుచున్నది. వెదురుమావు యొక్క ద్వారములు తెఱచియేయున్నను అందలిచేపలు పైకి పోజాలకుండును. గొంగళిపురుగు తానల్లుకొనిన గూటిలో తన్ను తాను బంధించుకొని నశించుచున్నది. ఇటువంటి సంసారము మిథ్య కాదా?
545.అహంకారమునెట్లు నశింపజేసికొనవలయునో తెలియునా? వడ్లు దంచువారు అప్పుడప్పుడాగి, ఊక మొదలగునవి పూర్తిగా పోయెనో లేదో యని పరిశీలించుచుందురు. నగలను త్రాసులో వైచి తూచువారు ముల్లు సరిగా నడుమ నిలుచుచున్నదో లేదో తరచుగా ఆగి కనిపెట్టుచుందురు. అటులనే అహంకారము ఇంకను తలయెత్తుచున్నదో, అడగిపోయినదో తెలిసికొనుటకు అప్పుడప్పుడు నన్ను నేను నిందించుకొనెడివాడను. ఒక్కొక్కప్పుడు శరీర స్వభావమును గూర్చి యిట్లు పర్యాలోచించుకొనువాడను: ‘‘చూడు! ఈ శరీరము ఎట్టిదో! మాంసముతోడను ఎముకలతోడను గూడినపంజరము కాక మరేమి ఇది? ఇందులో నెత్తురు, చీము మొదలగు మలిన పదార్థాములు తప్ప మరేమున్నవి? దీనిగురించి ఇంత అభిమానమును అహంకారమును పూనుట ఎంత విచిత్రము!’’
546. పొయ్యిమీద అన్నము ఉడుచుకున్నదనుకొనుము. సరిగా ఉడికినదో లేదో కనుగొనుటకై నీవొక మెదకును దీసి నొక్కి చూతువు గదా? దానివలన వెంటనే నీకు పాత్రలోని అన్నమంతయు ఉడికినదియు లేనిదియు తెలియగలదు. అందుకై అన్నపు మెదుకులనన్నిటిని పట్టిచూడనక్కరలేదు. కొన్ని మెదుకులను బట్టి చూచి అన్నము యొక్క స్థితిని దెలిసికొను తీరుననే ప్రపంచము శాశ్వతమో, అశాశ్వతమో, సత్యమో, మిథ్యయో ప్రపంచమందలి రెండు మూడు విషయములను బరిశీలించినంతనే నీకు బోధపడగలదు.
మానవుడు జన్మించుచున్నాడు, కొంతకాలము మనుచున్నాడు, చనిపోవుచున్నాడు, జంతువులను వృక్షములను గూడా నిట్లే పుట్టుచు గిట్టుచున్నవి. నామరూపములుగల సర్వమునకును - సూర్య చంద్రాదులకును గూడ- ఇదియే గతియని వివేచనచే నీకు తెలియగలదు. జగత్తునందలి సమస్తవస్తువుల తత్త్వమును ఈవిధముగా నీకు బోధపడును. ఇట్లు జగత్తు అశాశ్వతమనియు, మిథ్యయనియు నీవు గ్రహించినంతనే దానియందిక నీకు మోహము ఉండజాలదు. అపుడు సంసారమును మానసికముగా త్యజించి కోరికలనుండి విముక్తుడవగుదువు. ఇట్లు విషయ పరిత్యాగము చేయగల్గినయెడల జగత్తునకు ఆధారభూతుడగు పరమాత్ముని గనజాలుదువు. ఈ విధముగా బ్రహ్మ సాక్షాత్కారమును బొందినవాడు సర్వజ్ఞుడు కానిచో మరేమగును?
వైరాగ్యము
547. మన యైహిక వాంఛలన్నియు నెరవేరినను, దానిచే మనము ఒడలు తెలియకున్నను, ‘‘ఈ భోగములనన్నిటిని అనుభవించు నేనెవడను?’’ అను ప్రశ్న అంతరంగమున బయలుదేరక మానదు. ఉన్న కిటుకు వెల్లడికానారంభించు సమయమదియేకావచ్చును’’.
548. ముండ్లతోడను తుప్పలతోను నిండియుండు వనమున చెప్పులు లేకుండ నడచుట దుస్సాధ్యము. వనమంతయు తోలుచే గప్పబడియున్న పక్షమున నట్లు నడవవచ్చును. లేదా మన పాదములకు చెప్పులు తొడిగికొనినను నడవవచ్చును. వనమంతటిని తోలుచే గప్పుట అసాధ్యము, కావున మనమే చెప్పులు తొడుగుకొనుట లెస్స. సంసారమున మానవుడు అంతులేని కోరికలతో బాధపడుచున్నాడు. అందుండి తప్పించుకొనుటకు రెండే మార్గములున్నవి.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి