మెయిన్ ఫీచర్

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరుడు సంసార తాపత్రయమున మునిగియున్నంతవఱకు వానికి చేయు ధర్మోపదేశములు వ్యర్థములు. కొంత కాలము విషయానుభవమును పొందనిండు. విషయములందలి రాగము కొంతవఱకు తగ్గిన పిమ్మట ధర్మోపదేశములు ఫలించు సమయము వచ్చును. అంతవఱకు వానికి చేయి నుపదేశములన్నియు వ్యర్థములే.
564, 565. వైరాగ్యము అనేక విధములుగానుండును. ఘోరమైన సంసార దుఃఖానుభవముచే గలుగునది ఒక విధమైన వైరాగ్యము. కాని తనకు అందుబాటుగానున్నను ఐహిక భోగభాగ్యములు అశాశ్వతములనియు తుచ్ఛములనియు గ్రహించుటచే గలుగు వైరాగ్యము ఉత్తమమైనది. ఇట్టి వైరాగ్యముగలవానికి సమస్త భోగభాగ్యములన్నను లేనివిగనే యెంచవలయును.
566. వైరాగ్యము ఎన్నివిధములు? తీవ్ర వైరాగ్యమని, మందవైరాగ్యమని సాధారణముగా రెండు విధములు, ఒక్క రాత్రిలో చెఱువు త్రవ్వి అప్పటికప్పుడు నీటితో నింపవలయునని దీక్ష వహించుట వంటిది తీవ్ర వైరాగ్యము. నెమ్మదిగా అడుగడుగునన ఆగుచు, కాలనిలంబము చేయుచు, వృద్ధిపొందునది మందవైరాగ్యము. అది యెప్పుడు పరిపక్వదశకు వచ్చునో పరమాత్మునకెఱుక!
567. ఒకడు స్నానము చేయుటకై ఏటికి పోవుచు, చాల దినములుగా ఎవరోయొక పెద్దమనిషి సన్న్యసించుటకై ప్రయత్నించుచున్నట్లు వినెను. ఈ మాటవలన సన్న్యాస జీవనమే సర్వోత్తమమని వానికెట్లో మనసునకు తట్టెను, వెంటనే యాతడు సన్న్యసింపవలయునని నిశ్చయించుకొని యింటికి మఱలకుండ కట్టుకొనిన అంగవస్తమ్రుతోడనే వెడలిపోయి నాడు. తీవ్ర వైరాగ్యమనగా ఇటువంటిది.
568. అఖండ సచ్చిదానంద సాగరమున నిమగ్నుడవుకమ్ము. కామక్రోధములను మూసళ్లకు వెఱవకుము. వివేక వైరాగ్యములను పనువును దట్టముగా ఒడలినిండ రాచుకొనుము. దాని యగరుచే కామక్రోధములను మూసళ్లు నిన్ను సమీపింపజాలవు.
సాధనయందు దీక్ష
569. వ్యవసాయులు గిత్తలనెట్లు కొందురో తెలియునా? ఓ! ఆ విషయములో వారు ఎంతయో నేర్పరులు. ఏవి మంచివో, ఏవి చెడ్డవో వారు ఇట్టె గ్రహింపగలరు; గిత్తయొక్క చుఱుకుదనము ఎట్టిదో కనుగొనుట వారికి చక్కగా తెలియును. వారు ఊరక తోకను తాకెదరు; ఫలితమో, అద్భుతము, చుఱుకుదనము లేనివి చలింపక నిద్రపోవుచున్నవో యనునటుల పరుండియుండును. చుఱుకైనవియో, తమ జోలికి వచ్చినందులకై ఆగ్రహపడుచున్నవో యనునటుల ఎగిరి గంతులువేయును. వ్యవసాయులు ఈ రకము వానినే ఎన్నుకొందురు.
జీవితము సఫలము కావలయుననిన, మానవునకు నిజమైన పౌరుషము ఉండవలయును. కాని పాలలో నానవేసిన మరమరాలవలె మెత్తనై ఎందునబొందని పౌరుషవిహీనులనేకులుందురు! వారిలో సామర్థ్యము సున్న! దీక్షవహించియే కార్యమునైనను కొనసాగించుటకు సంకల్పశక్తి శూన్యము! మనోబలము అంతకుమునుపే పూజ్యము! ఇట్టివారి జీవితములు ఎందులకును కొఱగానివి.
570. పెద్ద చేపను బట్టదలచిన జాలరి నీటిలో గాలమును వైచి గంటలకొలది కనిపెట్టుకొనియుండును. అటులనే దీక్షతోడను ఓరిమితోడను సాధనలను సాగించు భక్తుడు తుదకు తప్పక భగవంతునిగాంచును.
571. పరంపరగా వ్యవసాయము చేయుచుండు రైతుపండ్రెండేండ్లు అనావృష్టి వచ్చి యేమియు పండకున్నను వ్యవసాయముచేయుట మానడు.
- ఇంకాఉంది
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి