మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాని క్రొత్తగా వ్యవసాయమునకు దిగిన వర్తకుడు ఒక్క ఋతువు అనావృష్టి సంభవించినంతనే దిగులుపడి, ‘మనకిది అచ్చిరాలే’దని ఆ వ్యవసాయమును కట్టిపెట్టును. అదే తీరున జీవితకాలమంతయు సాధనచేసి తుదకు భగవంతుని గనజాలకున్నను నిజమైన భక్తుడు నిరుత్సాహము చెందడు.
572. ఈత నేర్వదలచినవాడు కొన్నాళ్లు తత్ప్రయత్నము చేయవలయును. ఒక్కనాడు సాధనచేసినంతనే సముద్రమున ఈదులాడుటకై యెవ్వడును సాహసింపరాదు. అటులనే సచ్చిదానంద సాగరమున ఈదులాడదలచెదవేని నీవు కృతార్థుడవగుటకు ముందు కష్టనష్టములకోర్చి యనేక సాధనలుచేయవలసి యుండును.
573. అప్పుడు పుట్టిన దూడ స్థిరముగా నిలువగలుగుటకు ముందు అనేక పర్యాయములు తడబడును, పడును. అటులనే బ్రహ్మసాక్షాత్కారము సిద్ధించు పర్యంతము సాధకునకు బ్రహ్మమార్గమున ఎన్నియోసారులు తొట్రుపాటుగలుగును.
574. భయంకరమగు శవసాధన (రాత్రి శ్మశానమున శవముపై గూర్చుండి చేయు తాంత్రిక సాధన)ను పూని యిరువురు కాళికాదేవిని బ్రత్యక్షముచేసికొన బ్రయత్నించిరట. అందొకడు అర్ధరాత్రమునకు ముందుగా కాన్పింపసాగిన భయంకర దృశ్యములనుగాంచి భీతిల్లి పిచ్చివాడయ్యెను. రెండవవాడు రాత్రితుదిని కాళీ ప్రసాదమున ఆమె సాక్షాత్కారమును బడసెను. అప్పుడాతడామెనిట్లడిగెను. ‘‘అమ్మా! జగజ్జననీ! ఈ రెండవవాడు పిచ్చివాడైపోయినాడు, ఎందుచేతనమ్మా!’’ దేవి యిట్లు సమాధానమొసగెను. ‘‘నాయనా! నీవును నీ పూర్వజన్మములందు అనేక పర్యాయములు ఇట్లే పిచ్చివాడవయితివి; కాని యిప్పుడు, తుదకు, నన్ను గాంచగల్గితివి.’’
575. ప్రశ్న: అరుదుగాగాని మనకు చిత్తశాంతి లభింపదుగదా, అటుల లభించిన శాంతియైనను చిరకాలము నిలువకుండుటకు హేతువేమి?
ఉ. నిరంతరము ఊదుచుండిననేకాని వెదురుకఱ్ఱల నిప్పు ఆరీపోవును. ఆధ్యాత్మికాగ్నిని ప్రజ్వలింపజేయుటకు నిరంతరమైన సాధన ఆవశ్యకము.
576. కూజాను నిండుగా నింపి ఉట్టిమీద బెట్టియుంచుము. కొలది దినములలో నీరంతయు ఇగిరిపోవును. కాని దానినే నీటిలోనుంచితివేని, అటులచటనున్నంతకాలము నిండుగనే యుండును. నీ భగవద్భక్తి విషయము కూడ నిట్టిదే. కొంతకాలము భక్తిసాధనచేసి, పిమ్మట ఆ విషయమే మఱచి, యితర వ్యవహారములలో దిగిన పక్షమున నీ హృదయమందలి భక్తిరవంతయు హరించిపోవును. కాని నీ యానందమయ హృదయమును పవిత్రభక్తి విశ్వాసములను నమృతసాగరమున సదా ముంచియుంచితివేని వానితో నెప్పుడును పరిపూర్ణమై యొప్పుచుండును.
577. పాలకుండ క్రింద నిప్పున్నంత పర్యంతము పాలుపొంగుచునే యుండును. కాని నిప్పును తీసివేసినంతనే పొంగు చల్లారును. అటులనే నూతన సాధకుడు తన పారమార్థిక సాధనలను సాగించుచున్నంతవఱకే ఆవేశముతోడను ఉత్సాహముతోడను పొంగుచుండును.
578. వరునియందెంత కాలము దైవభక్తియు ధర్మబుద్ధియు నిలుచును? కనకనలాడు నిప్పులోనున్నంతవఱకు ఇనుము ఎఱ్ఱగానుండును. వెలుపలికి తీయగానే నల్లబడును. అటులనే నరుడు బ్రహ్మానుసంధానము చేయుచుండునంతవఱకు బ్రహ్మభావము గలిగియుండును.
579. మనస్సు సిద్దీవాని ఉంగరాల జుట్టువంటిది. దానిని నీవెంతగా సవరించి వక్రగతిని మాన్పజూచినను తిరిగి వక్రమగుచునేయుండును.
- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి