మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విహంగ మార్గము, (2) మర్కట మార్కము, (3) పిపీలికా మార్గమునని సాధన మూడు విధములు.
1) పక్షివచ్చి పండు పొడుచును. బహుశః ఆ పోటుతో పండు పడిపోవును, ఇక నది పక్షికి దక్కదు. అటులనే అతి తీవ్రముగా సాధనలు సాగింప యత్నించువారు కొందఱుందురు. ఆ తీవ్రతయే తఱచు వారి ప్రయత్నములను భగ్నము చేయుచుండును.
2) కోతి పండును నోట గఱచుకొని కొమ్మనుండి కొమ్మకు దుముకుట దాని స్వభావము. ఇట్లు దుముకునప్పుడు పండు తఱచు నోటినుండి పడిపోవుచుండును. అటులనే సాధకుడు పట్టువదలిన యెడల జీవితమున సంభవించు నొడుదొడుకులచే తన సాధన విధానమును జాఱవిడుచు చుండును- బ్రహ్మమార్గ భ్రష్టుతగుచుండును.
3) చీమ నెమ్మదిగా, నిశ్చయముగా ఆహారమున్నచోటికి ప్రాకి వెడలి దానినిబట్టుకొని తిరిగి తన కన్నములోనికి తీసికొనిపోయి సురక్షితముగా భుజించును. ఇట్టి పిపీలికా మార్గముననుసరించు సాధన విధానమే సర్వోత్తమము. ఇందు ఫలప్రాప్తి నిశ్చయము.
588. చేపలను బట్టగోరువాడు ఒక గుంటలో మంచి చేపలు దొరుకునో, లేదో తెలిసికొనుటకై అందిదివఱకు చేపలనుబట్టిన వారికడకుపోయి ఆత్రముతో నిట్లు విచారించును; ‘‘్ఫలాని గుంటలో పెద్దపెద్ద చేపలు దొరకుట నిజమేనా? వానిని బట్టుటకు ఏలాటి ఎరవేయవలయును?’’ కావలసిన విషయములను వారివలన దెలిసికొని పరికరములతో గుంట యొద్దకు వెడలి, గాలము వైచి, ఓపికపట్టి, నేరిమితో చేపల నాకర్షించును. తుదకు చక్కని పెద్దచేపను బట్టుకొనగల్గును. అటులనే మహాత్ములయొక్కయు ఋషులయొక్కయు వాక్కులందు పరిపూర్ణ విశ్వాసముంచి, భక్తియగు ఎరతోడను మనోనిశ్చయమును గాలవుగోలతోడను భగవంతుని బట్టుకొని హృదయమును నిలుపుకొనవలయును. అందులకై అఖండమైన ఓరిమితో కాలపరిపాకమునకై వేచియుండవలయును. అటులొనర్చినచో ఆ దివ్యమీనము లభింపగలదు.
589. శ్రీగురుదేవుడు తఱచుగా నిట్లు వచించువాడు:
‘‘నేను విధించు నియమములను పరిపూర్ణముగా మీరు పరిపాలింపగల్గుదురా? అందు పదునాఱవ వంతు మీరనుష్ఠింపగల్గిన యెడల మోక్షప్రాప్తి మీకు నిశ్చయమని నమ్మడు.’’
590. ఆత్మసాక్షాత్కారము కావలయుననిన, సాధనలను ఆచరించి తీరవలయును. కాని పరిపూర్ణ శ్రద్ధయుండునెడల స్వల్ప సాధనయైనను జాలును.
591. పరమపావనమైన భగవన్నామముయొక్క ప్రభావమున సంపూర్ణ విశ్వాసమున్నయెడల- నిరంతర నామస్మరణమున మనస్సు రమించునెడల- అట్టివానికి మఱియేయితర సాధనగాని, విచారముగాని అనావశక్యము. అపుడు సర్వసంశయములును సమసిపోవును. మనస్సు నిర్మలమగును. పావన నామప్రభావమున భగవానుడే స్వయముగా వానికి సాక్షాత్కరించును.
592. వేదములును పురాణములను పఠింపదగినవి, వినదగినవి. కాని తంత్రములు సాధన చేయదగినవి. హరినామమును నోరార పలుకవలయును. చెవులార వినవలయును. కొన్ని రోగముల నివారణకై పైకి మందు రాయవలయును. లోనికిని మందు పుచ్చుకొనవలయును. (్భవరోగ నివారణకై భగవన్నామ శ్రవణమును కీర్తనమునుగూడ జేయవలయును.)
593. సాధన సిద్ధులనియు కృపాసిద్ధులనియు సిద్ధులు (లేక ముక్తులు) రెండు విధములుగానుందురు. మంచి పంట లభించుటకై కొందఱు తమ పొలములకు కాలువలు త్రవ్వియో, నటిని తోడియో, చాల శ్రమపడవలసియుండును.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి