మెయిన్ ఫీచర్

రహస్యార్థాల రామాయణం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీమదాంధ్ర వాల్మీకి రామాయణం యథా వాల్మీకంగా పూర్వ కాండలతో ఉత్తర కాండను కూడా కలిపి రచించిన ఏకైక మహానుభావులు కీర్తి శేషులు వావివిలికొలను సుబ్బారావు (వాసు దాసు) గారు. రామాయాణాన్ని చదివితే చాలు మనిషి ఎలా జీవించాలో ధర్మాన్ని ఎందుకు ఆచరించాలో మనిషితనం మనిషిలో లేకపోతే ఏం జరుగుతుందో తెలుస్తుంది. ప్రేమ అనే దినుసు అన్నదమ్ములు, తల్లిదండ్రులు, అక్కచెల్లెళ్లు, భార్యభర్తలు ఇలా ఎవరిమధ్యనైనా ఉంటే ఆ ప్రేమ కేవలం వారికే కాదు దేశానికి ఎలా ఉపయోగపడుతుందో అర్థమయ్యేది కేవలం రామాయణ పఠన వల్లే. దేశోన్నతిచెందాలంటే సంఘానికి, సమాజానికి మనిషి తనవంతు కర్తవ్యాన్ని ఎలా నిర్వహించాలన్న అంశం రామాయణాన్ని ఆసాంతం చదివితేనే అర్థమవుతుంది.
శ్రీ రామాయణం...అంటే, లక్ష్మీరమణుడైన శ్రీమన్నారాయణుడి మాయా మానుషావతారమైన శ్రీరామ చరిత్రనీ, శ్రీ లక్ష్మీదేవి అవతారమైన సీతాదేవి చరిత్రనీ అర్థం. దంపతుల మాదిరిగా, వారి ...అభిధానంబులు అనపాయంగా...వుండినట్లే, తత్త్వమెరిగిన మహాత్ముడు వాల్మీకి మహర్షి, తను రచించిన ఆది కావ్యానికి శ్రీ రామాయణం అని పేరు పెట్టాడు. ఇందులో సీతాదేవి మహాత్మ్యాన్ని విశేషించి చెప్పడంవల్ల వాల్మీకి మహర్షే, శ్రీ రామాయణాన్ని ...సీతాయాశ్చరితం మహత్తు...అని వెల్లడిచేశాడు. శ్రీరాముడు భగవంతుడు అనే విషయాన్ని చెప్పక చెప్పారు వాల్మీకి. వాల్మీకి రామాయణానికి-ఇతర రామాయణాలకు గల తారతమ్యం, వాల్మీకి రామాయణంలోని గొప్పదనం తెలియాలంటే ముందు వాల్మీకి విరచిత రామాయణాన్ని చదివితీరాల్సిందే. ఎవరి అనుభవం వారికి చదవడం వల్ల వస్తుంది. రామాయణ ప్రవచనం విన్నా అందులో ఎవరి అనుభూతి వారికే లభ్యమవుతుంది. కనుక ప్రతివారూ రామాయణం చదవాల్సిందే.
శ్రీ రామాయణం మహాకావ్యం. పుట్టుకతోనే కాకుండా గుణంలో కూడ అదే మొదటిది. దానిలోని గుణాలు, రహస్యాలు తెలుసు కోవాలంటే వాల్మీకివంటి సర్వజ్ఞుడికి మాత్రమే సాధ్యమవుతుంది. రామాయణం అద్భుత కావ్యం. కావ్యాలంకారికులు చెప్పినట్టు నవ రసాలున్నాయి. భవభూతి వర్ణించినట్లు ఇందులో హాస్యం, కరుణ, వీర, రౌద్రం, భయానక, బీభత్సం, అద్భుతం, శాంతం రసాలు పఠితలను ఉర్రూతలూగిస్తాయ. అందులో మమేకం చేయస్తాయ. నారదుడిని వాల్మీకి 16 గుణాలు చెప్పి ఇన్ని గుణాలున్న మనిషి ఎక్కడైనా ఉన్నాడా ఉంటే అతని చరిత్ర రాయాలని ఉంది అని అడుగుతాడా కదా. అపుడు నారదుడు రాముని గూర్చి చెబుతాడు. అంటే రాముని కథ వాస్తవమే. కనుక రామాయణంలోను వాల్మీకి స్వభావోక్త్యలంకారాలకు పుట్టిల్లును చేస్తాడు. అదే ఆదికవి వాల్మీకి యొక్క గొప్పతనం. వర్ష వర్ణన చేసిన సందర్భంలో అక్షరాలన్నీ వర్షంలాగా జలజలా రాలుతున్నట్టే ఉంటాయ. హేమంతాన్ని వర్ణిస్తుంటే, మనకు మంచులో తడుస్తున్నామా అనిపించేంతగా అక్షరాలు ముద్దమందారాలవుతాయ. ఇదంతా వాల్మీకి వర్ణనా చాతుర్యమే. వాల్మీకి మరో ప్రత్యేకత ....ఉత్ప్రేక్ష అలానే ఆయన వాడిన శే్లషాలంకారాలు. శే్లషాలంకారానికి చక్కటి ఉదాహరణ వాల్మీకి నోట వెలువడిన ప్రథమ శ్లోకం. ఆ శ్లోకాన్ని అనువదిస్తూ వాసు దాసు ఆంధ్ర వాల్మీకి రామాయణంలో -తెలియు మా నిషాదుండ ప్రతిష్ఠ నీక
ప్రాప్తమయ్యెడు శాశ్వతహాయనముల
గ్రౌంచ మిథునంబునందు నొక్కండు నీవు
కామమోహిత ముం జంపు కారణమున
ఇక్కడా మనకు వాల్మీకి నే తారసపడ్డట్టు ఉంది కదా. వాల్మీకి రామాయణంలోని పాత్రలు-వారి పేర్లు, పాత్రధారుల వాక్కులు, ఆయా పాత్రల చిత్త వృత్తి గుణాలను తెలియచేసేవిగా, సందర్భోచితంగా, వారున్న అప్పటి స్థితికి మన కళ్లెదుట నిలబెట్టేవిగా ఉంటాయ. ఇదేపాత్రౌచిత్యం అంటే.
కావ్యానికి ప్రాణం ధ్వని. రామాయణంలో ధ్వని విశేషంగా వినపడుతుంది. కావ్యమంతా ధ్వన్యర్థం వుంటుంది. రామాయణ మహాత్మ్యాన్ని తెలుసుకోవాలంటే రామాయణ పారాయణ అనుభవైకవేద్యమై ఉండాలి. శ్రీ విశిష్టాద్వైతం మతోద్ధారకుడైన శ్రీ రామానుజాచార్యులు పద్దెనిమిది పర్యాయాలు గురు ముఖంగా రామాయణాన్ని పఠించి వ్యాఖ్య రాశారు.
శ్రీమద్వాల్మీకి రామాయణం మంత్రనిధానం. వేదస్వరూపం కూడా. ఇందులో అనేకానేక మంత్రాలు ఉద్ధరించబడి వున్నాయి. అందువల్లే, విధిపూర్వకంగా రామాయణాన్ని చదివి, వారి వారి కోరికలు నెరవేర్చుకుంటారు. సుందర కాండ పారాయణం చేసి కార్య సిద్ధిని పొందేవారు లెక్కకు మించి ఉంటారు. ఉత్తర కాండలో చెప్పినట్లు, రామాయణమంతా గాయత్రీ స్వరూపమే. గాయత్రిలోని 24 అక్షరాలను, ప్రతి వేయి శ్లోకాలకు ఒక అక్షరం చొప్పున శ్లోకం ఆరంభంలో చెప్పబడింది. ఏడు కాండలలో ఏడు వ్యాహృతులు వివరించడం జరిగింది.
ఈ గాయత్రీ విధానాన్ని నారదుడే స్వయంగా వాల్మీకి మహర్షికి, రామాయణంతో పాటే ఉపదేశించాడు. ....తప స్స్వాధ్యాయ నిరతం, తపస్వీ వాగ్విదాంవరమ్, నారదం పరిపప్రఛ్చ, వాల్మీకిర్మునిపుంగవమ్...అని గాయత్రిలోని మొదటి అక్షరంతో శ్లోకాన్ని ప్రారంభించి...జనశ్చ శూద్రోపి మహత్త్వ మీయాత్....అని గాయత్రి కడపటి అక్షరంతో సర్గను ముగించాడు వాల్మీకి. అంధ్ర వాల్మీకంలో, మూలంలో వున్నట్లు ....తపమున స్వాధ్యాయంబున, నిపుణుని... ..... తమి గావించెన్...అన్న పద్యంతో ప్రారంభించి, ....యథావిధి విన్న బఠింప నారయన్.....అని ముగించబడింది. కామ్యార్థమైనా, మోక్షార్థమైనా, రామాయణం పారాయణం చేసినవారి కోరికలు నెరవేర్చే శక్తి, రామాయణానికి వుండడానికి కారణం, అది భగవత్ కథ కావడానికి అదనంగా సర్వజ్ఞుడైన వాల్మీకి (ఆంధ్ర వాల్మీకి) కూర్చిన బీజాక్షరాల మహాత్మ్యమే.
ఎన్నో రహస్యాలను నిక్షిప్తం చేసుకొన్న రామాయణం ప్రతివారూ చదివి రామునిలాగా మారితే కలియుగంలోను రామరాజ్యం చూడవచ్చు.

-వనం జ్వాలా నరసింహారావు 80081 370 12