మెయిన్ ఫీచర్

పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

612. ధ్యానమున తీక్ష్ణమైన ఏకాగ్రత గలుగునపుడు అన్యమేదియు గానబడదు, వినబడదు. బాహ్యస్పర్శలుగాని, విషయానుభవములుగాని లేకుండును. శరీరముపై పాము ప్రాకుచున్నను అపుడు తెలియరాదు, ధ్యాతకుగాని, పామునకు గాని ఆ విషయమైన ఎఱుకయే లేకుండును.
613. ధ్యాననిష్ఠలో నుండ పక్షులు తన తలపై గూండ్లుకట్టుకొనినను ఏ విధమైన బాహ్యస్ఫురణము లేకుండునట్టివాడే ధ్యానసిద్ధుడు. ధ్యానమున బరిపూర్ణుడు.
614. గాఢమైన ధ్యానమున ఇంద్రియ వ్యాపారములన్నియు కట్టుపడును. బాహ్యప్రపంచ ద్వారములు బంధింపబడినవో యనునటుల మనస్సు అంతర్ముఖమై వృత్తిరహితమై యుండును. శబ్దస్పర్శ రూపరస గంధము లైదును వెలుపలనేయుండి గోచరింపకుండును. ధ్యానమున మొట్టమొదట విషయములు మనస్సునకు గోచరించును, కాని ధ్యానము గాఢమైనప్పుడు విషయానుభవములు కలుగనేకలుగవు- అవి బహిష్కరింపబడును.
615. భగవత్ సాక్షాత్కారమునకై నీవే మార్గమవలంబించినను మనస్సు సంపూర్ణముగా అడగిపోయిననే కాని- వృత్తిశూన్యమైననే కాని- యోగము సిద్ధింపదు. ఇదియే రహస్యము. యోగి యెప్పుడును మనస్సునకు అధీనుడుగాక మనస్సును సదా తనయధీనమున నుంచుకొని యుండును.
భగవత్ పరితాపము
సాక్షాత్కారమునకై పరితపింపుము- నిజమైన పరితాపమెట్టిది:- భగవత్ సాక్షాత్కారమునకు ప్రధాన నియమము.
సాక్షాత్కారమునకై పరితపింపుము
616. ఎట్లైనను పరితాపము తప్పనిచో ప్రాపంచిక విషయములకోసము కాక, భగవత్ సాక్షాత్కారమునకై పరితపింపుము- భగవద్భక్తి ఉన్మత్తుడవు కమ్ము.
617. లోకులు పుత్త్రసంతానము లేదనియో, కలిమి కలుగలేదనియో కన్నీరు కాలువలు గట్టునట్లు విలపింతురు. కాని, ఆహా! భగవద్దర్శనము కాలేదని విలపించువారెవ్వరు? నిజముగా అట్టివారు కోటికొకరుండుట దుర్లభము. భగవంతుని వెదకుచు, ఎవ్వడు పరితపించునో, విలపించునో, నిశ్చయముగా అట్టివాడు భగవంతుని గాంచును.
618. భగవంతుని కోసము పరితపించువాడు, ‘‘ఏమి తిందును? ఏమి త్రాగుదును?’’ అను స్వల్ప విషయములను గూర్తి యెంత మాత్రము యోచన చేయజాలడు.
619. దాహముచే నోరు ఎండిపోవువాడు బురదగానున్నదని నదీ జలమును విడిచి శుభ్రమైన నీటికొఱకు నూతిని త్రవ్వనారంభించునా? అటులనే ఎవ్వనికి ధర్మపిపాస కలదో అట్టివాడు దాపుననున్న మతము- హిందూ మతము కానిండు. మఱేమతము కానిండు- విడిచివేయజాలడు. స్వయముగా తన నిమిత్తము క్రొత్త మతమును సృష్టించను బూనుకొనడు. నిజమైన జిజ్ఞాసకలవానికి ఇటువంటి లేనిపోని విమర్శలు చేయుటకు వ్యవధి యొక్కడిది?
నిజమైన పరితాప మెట్టిది?
620. ధనముకోసము లోభి పరితపించునట్లు భగవానుని కోసము పరితపింపుము.
621. నీట మునిగిపోవువాడు ఊపిరాడక పరితపించునట్లు భగవంతునికోసము పరితపింపవలయును,- అపుడు భగవద్దర్శనము లభించును.
622. భగవద్దర్శన లాభమును బొందుటకై ఎట్టి భక్తి కావలయునో తెలియునా? తల గీఱుకొనిపోయిన కుక్క యెట్లు అశాంతితో నానా దిశలను పరుగెత్తునో అట్లు భగవంతుని కోసము ఆవేదన పడవలయును.
623. ఓ మనసా! నీ దివ్య మాతను ఎలుగెత్తి పిలువుము. ఆమెకోసము విలపింపుము. ఆమె యెంత వేగిరముగా నీ కడకు పర్విడివచ్చునో చూతువుగాక, మనసార భగవంతుని బిలుచునెడల భగవంతుడు ఉపేక్ష వహించి యూరకుండజాలడు.

- ఇంకాఉంది

శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 112 మహోపదేశములుగల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -
సంగ్రహ జీవిత సహితము - అనువాదం: శ్రీ చిరంతనానందస్వామి