మెయిన్ ఫీచర్

స్వేచ్ఛకు దారి చైతన్యమే ( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తప్పించుకోవాలనే భావన మీలో ఎప్పుడు కలిగినా, వెంటనే ఎక్కడికి పారిపోకుండా మొండిగా అక్కడే ఉండి దానితో శక్తి వంచన లేకుండా పోరాడండి. అలా ప్రతిదానికి వ్యతిరేకంగా నెలరోజులు చెయ్యగలిగితే ఆ రెండిండినీ పోరాడడం, పారిపోవడాలను - ఎలా వదిలించుకోవాలో మీకు అర్థమవుతుంది. అవి రెండు తప్పే. ఒక తప్పు మీలోతుల్లోకి బాగా చొచ్చుకుపోయింది. దానిని మరొక దానితో సమతౌల్యం చెయ్యాలి. అప్పుడే మనిషి నిర్భయుడవుతాడు. కనుక ఏవిషయంలోనైనా మీరు నెలరోజుల పాటు ఒక యోధుడుగా ఉండండి. అపుడు మీరు నిజంగా చాలా చక్కని అనుభూతిని పొందుతారు.
తప్పించుకుని పారిపోయేవారిని ఎవరైనా నీచంగా భావిస్తారు. ఎందుకంటే అది పిరికిపందలు చేసే పని. కాబట్టి ధైర్యాన్ని కూడగట్టుకోండి. అప్పుడే పోరాడడం, పారిపోవడాలను వదిలించు కోగలుగుతారు. ఎందుకంటే, ధైర్యంగా ఉండడమనేది కూడా మీలోని పిరికితనానికి చిహ్నమే. కాబట్టి ధైర్యం, పిరికి తనాలు మాయమైన వెంటనే ఎవరైనా నిర్భయులవుతారు. కావాలంటే మీరు కూడా ప్రయత్నించి చూడండి.
నమ్మకాన్ని కలిగించే ధ్యానం:
ఒకవేళ నమ్మకం మీకు కష్టమనిపిస్తే మీరు రమీ గత జ్ఞాపకాల లోతుల్లోకి వెళ్లాలి. ఆ జ్ఞాపకాలన్నీ పరమ చెత్త. మీ మనసు వాటితో నిండి బరువెక్కి పోయింది. దానిని శుభ్రం చేయాలంటే ముందు ఆ చెత్త బరువును దించుకోవాలి. అందుకు మీరు పతిరోజు రాత్రి మీ గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఎంత చిన్న నాటి పాత జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటే అంత మంచిది. ఎందుకంటే జరిగిన అనేక విషయాలను మన చైతన్యంలోకి ప్రవేశించకుండా మనం దాచేస్తూ ఉంటాం. వాటిని మీ చైతన్యంలోకి ప్రవేశించనివ్వండి. అలా ప్రతిరోజు దానిపైన దృష్టి పెట్టి ఒక గంట ధ్యానం చెయ్యండి. అలా చేస్తున్నపుడు మీరు చాలా లోతుల్లోకి మీజ్ఞాపకాల లోతుల్లోకి వెళ్తున్నట్టు మీక చాల ఆస్పష్టంగా తెలుస్తుంది. ఆ క్రమంలో మీరు నాలుగైదేళ్లు వయసులో ఉన్నపుడు జరిగిన విషయాలు మీకు జ్ఞాపమొస్తాయి. అంతకుమించిమీరు ముందుకు వెళ్లలేరు. ఐనా మీప్రయత్నాన్ని ఆపకుండా, మీ సాధనను కొనసాగిస్తే మీ రెండేళ్ల ప్రాయంలో జరిగిన విషయాలు గుర్తుస్తాయి. ఆ సాధనలో తల్లి గర్భంలో ఉన్నప్పటి జ్ఞాపకాలు తెలుసుకొన్నవారు, ఇంతకన్నా ముందుకెళ్లి గత జన్మలో ఎప్పుడు ఎక్కడ ఎలా మరణించారో తెలుసుకొన్న వారు కూడా ఉన్నారు. తల్లి గర్భం నుంచి ఎంత కష్టపడి మీరు బయటపడ్డారో తెలుసుకోగలిగితే ఆ జ్ఞాపకం నుంచి మీరు బయటపడుతారు. ఎందుకంటే దానిని మీరు దాదాపు పునర్జన్మగా భావిస్తారు. శిశువు పుట్టిన వెంటనే కొన్ని క్షణాలు ఊపిరాడక ఉక్కిరిబిక్కిరియై ఏడుస్తారు. అపుడే ఆ శిశువుకు అన్ని దారులు తెరుచుకుంటాయి. ఊపిరాడడం, ప్రారంభమవుతుంది. సాధనలో మీరు కూడా ఆస్థితికి చేరుకోవచ్చు. అపుడు మీరుకూడా ఆ శిశువులా ముందుకు వెళ్లడం, వెనక్కిరావడం చేస్తూ ఉండాలి. అపుడు ప్రతిరోజు మీ మనసులోని గత జ్ఞాపకాల బరువు తగ్గడం, దాని స్థానంలో నమ్మకం చోటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలా మూడు నుంచి తొమ్మిది నెలల కాలంలో మనసు పరిశుద్ధమై మీకు స్వేచ్ఛ లభిస్తుంది. ఇలా మీ జ్ఞాపకాలను మీరు తెలుసుకోగలిగితే వాటి నుంచి మీరు బయటపడుతారు. చైతన్య రాహిత్యం మీకు బానిసత్వాన్ని సృష్టిస్తుంది. అవగాహన, మిమ్మల్ని ఆ బానిసత్వం నుంచి బయటపడేలా చేస్తుంది. అపుడే నమ్మకం కలిగేందుకు అవకాశముంటుంది.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం. పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.