మెయిన్ ఫీచర్

భయానికి కారణం అహం! (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అహం ఎప్పుడూ భయంనుంచే బయటపడుతూ ఉంటుంది. నిజంగా, నిర్భయుడైన వ్యక్తికి అహముండదు. అహం ఎప్పుడూ ఒక రక్షణ కవచం లాంటిది. మీరు భయపడుతున్నారు కాబట్టి, మీచుట్టూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును మీరు సృష్టించుకుంటారు. అప్పుడు మీకు హాని చేసేందుకు ఎవరూ సాహసించరు. లేకపోతే, వౌలికంగా అది భయమే. అయినా మంచిదే. ఎందుకంటే, మీరు దాని లోతుల్లోకి సరిగ్గా దృష్టి సారించారు.
ఒకసారి వౌలిక కారణాన్ని మీరు తెలుసుకుంటే, అన్ని విషయాలు మీకు సులభమవుతాయి. లేకపోతే, అందరూ అహంతో యుద్ధంచేస్తూనే ఉంటారు. నిజానికి, అహం ఒక సమస్యకాదు. మీరు అసలైన రోగంతో కాకుండా, రోగ లక్షణంతో పోరాడుతున్నారు. భయమే అసలైన రోగం. మీరు అహంతో నిరంతరం పోరాడుతూనే ఉంటారు. అయినా మీరు మీ లక్ష్యాన్ని కోల్పోతూనే ఉంటారు. ఒకవేళ ఆ పోరాటంలో మీరు విజయాన్ని సాధించినా, ఏదీ గెలుచుకోలేరు. ఎందుకంటే, అహం మీకు నిజమైన శత్రువుకాదు. అది కేవలం నకిలీ. దానిని మీరు జయించలేరు. ఎవరైనా అసలైన శత్రువును జయించగలరు కానీ, ఉనికిలో లేని నకిలీ శత్రువును ఎలా జయించగలరు? దాని ముఖం చాలా వికారంగా ఉంటుంది. మీరు దానిని నగలతో అలంకరిస్తారు.
నేను ఒక సినీ నటుడి ఇంట్లో ఉంటున్నప్పుడు నన్ను చూసేందుకు వచ్చిన వారిలో ఒక సినీ నటి కూడా ఉంది. ఆమె చాలా అందమైన వాచీని ధరించింది. దాని పట్టీ చాలా వెడల్పుగా ఉంది. ఆమె పక్కనే కూర్చున్న వ్యక్తి ‘‘మీ వాచీ చాలాబాగుంది. ఒకసారి చూసేందుకు ఇస్తారా?’’ అన్నాడు ఆమెతో. ఆ వాచీ తీసి ఇచ్చేందుకు ఆమె సంకోచిస్తోంది. ‘‘ఏమనుకోకండి. ఒకసారి చూసి ఇచ్చేస్తా’’అని అతడు మళ్ళీ అడగడంతో ఆమెకు ఇవ్వక తప్పలేదు. ఆమె వాచీ తీసేటప్పుడు ఆమెనే గమనిస్తున్న నాకు ఆమె చేతిపై ‘‘బొల్లిమచ్చ’’కనిపించింది. ఆ మచ్చ కనిపించకుండా ఉండేందుకే ఆమె ఆ వాచీ ధరిస్తోంది. విషయం నాకు తెలిసిందని ఆమె గ్రహించింది. దానితో ఆమెకు చెమటలు పట్టాయి.
అహం కూడా అలాంటిదే. అందరికీ భయం ఉంటుంది. కానీ, అది ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదని అందరూ అనుకుంటారు. ఎందుకంటే, మీరు భయపడుతున్నట్లు తెలిస్తే, మిమ్మల్ని మరింత భయపెట్టేందుకు బయట ఉన్న చాలామంది మిమ్మల్ని చితకబాదుతారు. అలా అవమానించడం ద్వారా తమకన్నా బలహీనులున్నారనే భావనతో వారు మిమ్మల్ని చక్కగా దోచుకుంటూ ఆనందిస్తారు.
అందువల్ల భయపడుతున్న ప్రతి వ్యక్తి తమ భయంచుట్టూ అహం బుడగను సృష్టించుకుని అందులోకి గాలి ఊదుతూ ఉంటారు. అలా వారిలోని అహం పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. అడాల్ఫ్ హిట్లర్, ఈద్ అమీన్‌లు అలాంటివారే. అందుకే వారు అందరినీ హింసిస్తూ భయపెట్టారు.
నిజానికి, లోలోపల భయపడుతున్నవారే- తాము భయపడుతున్నట్లు వారికి తెలుసు కాబట్టి-అందరినీ భయపెట్టేందుకు ప్రయత్నిస్తాను. లేకపోతే, వారికి ఆ అవసరమేముంది? భయం లేని వ్యక్తి ఎప్పుడూ ఎవరికీ భయపడడు, ఇతరులను భయపెట్టేందుకు ఎప్పుడూ ప్రయత్నించడు. ఆ అవసరం అతనికి లేదు.
కాబట్టి, భయపడే వ్యక్తులే అందరినీ భయపెడతారు. అప్పుడే ఎవరూ తమని తాకరని, ఎదిరించరని వారు భావిస్తూ ఉంటారు.
మీరు విషయాన్ని చక్కగా గ్రహించారు. కాబట్టి, మీరు ఎప్పుడూ అహంతో పోరాడకండి.

- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.