మెయిన్ ఫీచర్

మరుగు కావాల్సిందే ! (ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా నిజాలు తెలిపేందుకు నేనెందుకంత భయపడుతున్నాను?
మీరే కాదు, ఆ పని చేసేందుకు ఎవరైనా భయపడతారు. అది సహజం. యుగయుగాలుగా, అనేక జన్మలనుంచి మీ మనసులో పేరుకున్న ఎందుకూ పనికిరాని చెత్తను బయటపెట్టాలంటే మీకు భయంగానే ఉంటుంది. ఎందుకంటే, అప్పుడు మీ దుర్భలత్వం, తప్పులు, బలహీనతలు బయటపడతాయి. అంటే, మీ నగ్నత్వం పూర్తిగా బయటపడి మీరు ఖాళీ అయినట్లే. అది మృత్యువుతో సమానం. అందుకే మీరు భయపడతారు. మీ మనసులో పేరుకున్న చెత్త, రణగొణధ్వనుల వెనకాల ‘‘పరమ శూన్యం’’ అనే కోణముంది.
దేవుడు లేకపోతే ఎవరైనా ఏమీలేని ఖాళీ డొల్లే. ఆ వికారమైన తమ దిగంబర రూపం ఎవరికీ తెలియకూడదనే ఎవరైనా కోరుకుంటారు. అందుకే వారు దానిని అందమైన అలంకరణలతో కప్పేసి, తమ ప్రత్యేకతను చాటుకుంటూ నటిస్తారు. వారేకాదు, అన్నిచోట్ల అందరూ అలాగే చేస్తారు. ‘‘అందరూ ఏమనుకుంటారు?’’అనే భయంలో ఉంటారే కానీ, ఎవరూ తెరిచిన పుస్తకంలా ఉండరు. మీ చిన్నప్పటినుంచి మీకు అందమైన ముసుగులు ఎలావేసుకోవాలో నేర్పారు. కాబట్టి, మీకు అందమైన ముఖం ఉండవలసిన అవసరంలేదు. అందమైన ముసుగులు ఉంటే చాలు. పైగా, అవి చాలా చవక. ముఖాన్ని మార్చడం చాలా కష్టమైన పని. కానీ, దానికి రంగువెయ్యడం సులభమే.
ఉన్నపళంగా మీరు మీ ముసుగు తీసి మీ ముఖాన్ని బయటపెట్టాలంటే మీ ఉనికి అంతర్గత కేంద్రంలో విపరీతమైన వణుకు పుడుతుంది. ఎందుకంటే, మీ ముఖం అందరికీ నచ్చుతుందో, నచ్చదో, మునుపటిలా అందరూ మిమ్మల్ని ప్రేమిస్తారో, ప్రేమించరో, గౌరవిస్తారో, గౌరవించరో ఎవరికి తెలుసు? ఇంతవరకు అందరూ మీ అందమైన ముసుగునే ప్రేమించారు, గౌరవించారు, కీర్తించారు. అందుకే ఆ ముసుగు తీసి, మీ నిజ స్వరూపాన్ని బయటపెట్టాలంటే మీకు చాలా భయంగానే ఉంటుంది. ఎందుకంటే, ‘‘ఒకవేళ మీ నిజ స్వరూపం నచ్చకపోతే, అందరూ మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారేమో’’అనేదే మీ భయం. అందుకే అందరూ నకిలీ మనస్తత్వంతో నటిస్తూ ఉంటారు. కేవలం భయంనుంచే నటన, నకిలీ మనస్తత్వాలు పుట్టుకొస్తాయి. కాబట్టి, నిర్భయులుగా ఉండాలంటే ఎవరైనా వాస్తవంగా ఉండక తప్పదు.
మీరు దేనిని దాచినా అది ఎదుగుతూనే ఉంటుంది. కాబట్టి, మీరు ఎలా బయటపడ్డా అందులో సత్యముంటే రాణిస్తారు, అసత్యముంటే పతనమవుతారు. ఇదే జీవిత సత్యాలలోని ప్రాథమిక సూత్రం. అందువల్ల అసత్యానికి ఎప్పుడూ సహకరించకండి. అప్పుడే అది నిదానంగా ఆశ్చర్యమవడం ప్రారంభిస్తుంది. అందరూ తమ వాస్తవాలతో అలమటిస్తూ, అవాస్తవాలతో కొవ్వెక్కిపోతున్నారు. మీ అవాస్తవ ముఖాలకు అబద్ధాలే ఆహారం. అందువల్ల వాటికోసం మీరు అనేక అబద్ధాలు కనుక్కోవలసి వస్తుంది. ఒక అబద్ధాన్ని కాపాడేందుకు మీరు వంద అబద్ధాలు కనుక్కోవలసి వస్తుంది. ఒక అబద్ధాన్ని కాపాడేందుకు మీరు వంద అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే, ఒక అబద్ధాన్ని దానికన్నా పెద్ద అబద్ధాలు మాత్రమే కాపాడగలవు. కాబట్టి, మీరు మీ ముఖాల వెనకాల దాక్కున్నప్పుడు మీ వాస్తవం మరణించడం ప్రారంభిస్తుంది. మీ అవాస్తవం మరింత బలపడుతూ కొవ్వెక్కిపోతుంది. ఒకవేళ మీరు మీ వాస్తవాన్ని బయటపెడితే మీ అవాస్తవం మరణించక తప్పదు. ఎందుకంటే, అవాస్తవం మీ అచేతనత్వం చీకట్లో రహస్యంగా దాగి ఉంటుందే కానీ, వెలుపల వెలుగులోకి రాలేదు. ఒకవేళ మీ అవాస్తవాన్ని మీరు మీ సచేతనంలోకి తెస్తే అది ఆవిరవడం ప్రారంభిస్తుంది.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
ఫోన్: 9490004261, 9293226169.