మెయిన్ ఫీచర్

వాస్తవమే ధైర్యస్థైర్యాలిస్తుంది( ఓషో బోధ )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనోవైజ్ఞానిక విశే్లషణ విజయ రహస్యమదే. అది చాలా చిన్నరహస్యమే అయినా, దాని మొత్తం రహస్యమంతా అదే. మీ అచేతనంలో ఉన్న దానిని సచేతన స్థాయికి తెచ్చేందుకు, మీ ఉనికి చీకటి ప్రపంచంలో ఉన్న దానిని మీకు తెలిసేలా చేసేందుకు మనోవైజ్ఞానిక విశే్లషకుడు చక్కగా సహాయపడతాడు. అప్పుడే వాటిని మీరు చూడగలరు, ఇతరులు కూడా చూడగలరు. అవి మీ దృష్టిలో పడగానే వాటికి మృత్యువు ఆసన్నమైనట్లే. మీలో గొప్ప మార్పులు రావాలంటే వాటిని మీరు ఏ ఒక్కరికి వివరించినా సరిపోతుంది. అప్పుడే అద్భుతాలు జరుగుతాయి.
మనోవైజ్ఞానిక విశే్లషణకుని మీ వివరాలన్నీ ఎలాంటి దాపరికం లేకుండా చెప్తారు. మనోవైజ్ఞానిక విశే్లషణలో మీరుచేసే పని అదే. కానీ, దానికీ పరిమితులుంటాయి. ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఉంచుతానని హామీ ఇచ్చినప్పుడే- అది మనోవైజ్ఞానిక విశే్లషకుని వృత్త్ధిర్మంలో ఒక భాగం. అలా ప్రమాణం చేసేవారు ఆ వృత్తిని స్వీకరిస్తారు- వాటిని మీరు ఏకాంతంలో అతనికి చెప్పేందుకు సిద్ధపడతారు. అంతా వృత్తిపరమైన పరిమితుల్లోనే జరుగుతుంది కాబట్టి, అదికొన్ని రోజుల్లో ముగించే పని కాదు. అయినా మీకు మేలు జరుగుతుంది. అందుకే మనోవిశే్లషణ చేసేందుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా అది ఎప్పటికీ పూర్తికాదు, పూర్తయిన దాఖలాలు కూడా ఇంతవరకు లేవు. ఎందుకంటే, మీ మనోవిశే్లషకులు కూడా పూర్తిగా మనోవిశే్లషణ చేసుకున్నవారు కాదు. ఎందుకంటే, వారుకూడా కొన్ని నిబంధనల పరిమితులకు లోబడి చెప్పినవారే. అందుకే మనోవిశే్లషకుడు మీరు చెప్తున్నవి వినీవిననట్లుగా వింటారు. అయినా మీ మనోభారం తగ్గుతుంది. ఎందుకంటే, వాటిని అతడు ఎవరికీ చెప్పడు. అలా మీకు మేలు జరుగుతుంది.
మీరు మీ వాస్తవాలను- పరిమితులకు లోబడి ఎవరితోనో రహస్యంగా చెప్పడం కాకుండా- మీతో ధైర్యంగా చెప్పుకోగలిగితే మీరు ధార్మికులైనట్లే. సన్యాసమంటే అదే. మీ నగ్నత్వాన్ని మీరు తెలుసుకోవడమే సన్యాసం. అది అన్నిరకాల పరిస్థితులలోను, సంబంధాలలోను- మీ భార్యతో, బంధువుతో, శత్రువుతో, స్నేహితునితో, అధికారితో, సేవకునితో-నిరంతరాయంగా చేసుకునే స్వీయ మనోవైజ్ఞానిక విశే్లషణ. అలా మిమ్మల్నిమీరు తెలుసుకునే పనిలోముందు మీకు నిజంగా అనేక భయాలు కలుగుతాయి. కానీ, త్వరలోనే మీరు మరింత శక్తిని పుంజుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకంటే, ఒకసారి సత్యం బయటపడగానే అది మరింత బలపడుతుంది, అసత్యం అంతరిస్తుంది. అలా బలపడిన సత్యంతో పాతుకుపోయిన మీరు కేంద్రంగా మారతారు. దానితో మీ వ్యక్తిత్వం అంతరించి మీ వాస్తవ స్వరూపం బయటపడుతుంది. అలా మీరు వాస్తవమైన విశిష్ట వ్యక్తిగా మారడం ప్రారంభిస్తారు.
సామాజిక ఆడంబరాల మెరుగులతో బయటినుంచి వేయబడ్డ ముసుగే మీ వ్యక్తిత్వం. అందుకే అది నకిలీ. మీ విశిష్ట అస్తిత్వమే మీ వాస్తవం. అదే అసలైనది. ఎందుకంటే, మిమ్మల్ని ఆ దేవుడే తయారుచేశాడు. అందుకే అది అద్భుతమైన శక్తితో చాలా పచ్చిగా, దృఢంగా, విశృంఖలంగా ఉంటుంది.
భయం చాలా సహజం. ఎందుకంటే, చిన్నప్పటినుంచే మీకు అవాస్తవాలు బోధించడం జరిగింది. మీరు వాటితోనే ఎక్కువగా గుర్తింపు పొందారు. వాటిని వదులుకోవాలంటే దాదాపు ఆత్మహత్య చేసుకుంటున్నట్లనిపిస్తుంది. ఆ గుర్తింపు సంక్షోభంనుంచి బయటపడాలంటే భయంగానే ఉంటుంది. ఎందుకంటే, యాభై, అరవై ఏళ్ళపాటు ఒక రకమైన గుర్తింపుతో ఉన్న మీరు ఇప్పుడు జీవిత చరమాంకంలోకి ప్రవేశించారు.
- ఇంకాఉంది

ధ్యానజ్యోతి పబ్లికేషన్స్ ప్రచురించిన ఓషో నవజీవన మార్గదర్శకాలు
‘స్వేచ్ఛ.. మీరనుకుంటున్నది కాదు’ నుంచి స్వీకృతం.
పుస్తకం లభించు చోటు- విశాలాంధ్ర బుక్ హౌస్,
ఫోన్:040-24602946 / 24655279, నవచేతన పబ్లిషింగ్ హౌస్, గాంధీ బుక్ హౌస్
పోన్: 9490004261, 9293226169.